Karthika Deepam జనవరి 13 ఎపిసోడ్: రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన దీప , మోనిత నుంచి తప్పించుకున్న కార్తీక్.. కార్తీకదీపం జనవరి 13 గురువారం ఎపిసోడ్
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 13 గురువారం 1248 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…
కార్తీకదీపం జనవరి 13 గురువారం ఎపిసోడ్
హోటల్ కి వచ్చిన మోనితని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. మోనిత కుర్చీలోంచి లేచి తనవైపే రావడం చూసి కంగారు పడిన దాక్కుంటాడు. వాష్ బేసిన్ ఎక్కడుందో చూసుకుని వెళ్లిపోతుంది. ఈమె ఇక్కడకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందనే ఆలోచనలో పడతాడు కార్తీక్. హోటల్ పనిచేసే మరో సర్వర్ ఐ యామ్ అప్పారావ్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తాడు. మీరేం చేస్తారని అడిగితే.. నేను డాక్టర్ అన్న మోనితతో అయితే మీ వారు కూడా డాక్టరే కదా అంటాడు. మురిసిపోయిన మోనిత మావారు కార్తీక్ గుండెజబ్బుల డాక్టర్ అంటుంది.
Also Read: తాడికొండలో పోటాపోటీగా సౌందర్య-మోనిత .. కార్తీక్ విషయంలో నెగ్గేదెవరు, కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
మోనితని చూసి కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఇక్కడి వరకూ వచ్చిందంటే మమ్మల్ని కచ్చితంగా వెతికి పట్టుకుంటుంది. ఊరు దాటి వెళదాం అంటే రుద్రాణి అప్పు సంగతేంటని తలుచుకుంటాడు. అరే బావా ఎగ్ బిర్యాని తొందరగా తీసుకురా అని కార్తీక్ పై అరుస్తాడు అప్పారావ్. ఏం చేయాలో అర్థంకాని కార్తీక్ పక్కనే ఉన్న చాకుతో వేలు కోసుకుంటాడు. అప్పుడే అక్కడకు వచ్చిన అప్పు నీకు చేయి కోసుకుపోయింది..అక్కడకు డాక్టర్ వచ్చింది పద అంటాడు. వద్దులే అని చెప్పి తప్పించుకుంటాడు కార్తీక్.
Also Read: కాకిఎంగిలి చేసిన చాక్లెట్ వసుతో షేర్ చేసుకున్న రిషి, ఐ యామ్ వెరీ హ్యాపీ అంటూ రోడ్డుపై అరుపులు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్...
దీప ఇంటికి వచ్చిన పక్కింటి మహాలక్ష్మి గ్లాసుడు పంచదార అడుగుతుంది. ఆ తర్వాత రుద్రాణితో జాగ్రత్త అని చెబుతూ పిల్లల్ని స్కూల్ కి పంపించకుండా ఇంట్లోనే చదివించొచ్చు కదా అంటుంది. వచ్చే నెల రుద్రాణి పుట్టిన రోజు..ఆ రోజుకి రెండు గౌన్లు కుట్టమని కొలతలు ఇచ్చింది...నువ్వు బయట ఆరేసిన బట్టలు వాళ్ల మనిషి వచ్చి ఎత్తుకెళ్లాడు. నీ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతోందని నా అనుమానం జాగ్రత్త అని చెప్పేసి వెళ్లిపోతుంది మహాలక్ష్మి. ఏదో ఆలోచనలో అలా వెళ్లి కోటేష్ పెట్టెను కిందకు తోసేస్తాడు. అందులోంచి పడిన పుస్తకంలో చిట్టాలు రాసి ఉండడం చూసి ఇలా లెక్కలు రాసుకున్నాడు, దేవుడు వాళ్ల లెక్క వేరేలా రాశాడని అనుకుంటుంది. ఆ తర్వాత పేజీలో ఓ కార్ నంబర్ , దాని కిందనే నీకు దండాలమ్మ, నన్ను క్షమించమ్మా అని రాసి ఉంటుంది. ఈ కార్ నంబర్ ఎక్కడో చూసినట్టుందే అనుకుంటుంది. ( అది మోనిత కారు, బాబుని ఆ కారులోంచే ఎత్తుకొచ్చాడు కోటేష్). కట్ చేస్తే దీప బుక్ లో చూసిన కార్ నంబర్ మోనితదే అని అర్థమయ్యేలా కారుపై ఫోకస్ చేశారు. హోటల్లో తినేసి వెళ్లిపోతుంది మోనిత.
Also Read: తాడికొండలో సౌందర్య ఎంట్రీ, నీడలా వెంటాడిన మోనిత.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
ప్రకృతి ఆశ్రమంలో కూర్చున్న సౌందర్య ఎందుకోనండీ త్వరలోనే పెద్దోడు కనిపిస్తాడనే నమ్మకం ఉందంటుంది. ఎక్కడున్నా సంతోషంగా ఉంటాడని నాకు నేను సమాధానం చెప్పుకున్నాను, కార్తీక్ ఎలా ఉన్నాడో కానీ వాళ్లు లేరన్న ఆలోచన మనసులో భారాన్ని పెంచుతోందంటాడు ఆనందరావు. మీరు ఎక్కువ ఆలోచించి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దంటుంది సౌందర్య. మనం వాడిని వదిలిపెట్టి ఉండలేనట్టే వాడు కూడా మనల్ని వదిలిపెట్టి ఉండలేడు కదా అని సర్ది చెబుతుంది సౌందర్య. మీతో పాటూ వచ్చిన వాళ్లు ఎక్కడా కనిపించలేదని అడుగుతాడు ప్రకృతి ఆశ్రమంలో పనిచేసే వ్యక్తి. మాతో పాటూ ఎవరూ రాలేదంటారు సౌందర్య, ఆనందరావు. మీ కారుని అనుసరిస్తూ ఎర్రకారు వచ్చిందని చెబుతాడు. మోనిత వచ్చిందేమో అన్న సౌందర్య మాటలకు... ఇక్కడి వరకూ వచ్చి ఏమీ అనకుండా వెళుతుందా అంటాడు ఆనందరావు.
Also Read: ప్రేమని అక్షరాలుగా మలిచిన రిషి, చాలా బాగా రాశారన్న వసు... గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్..
రేపు రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వెళ్లాలి త్వరగా రా అని పనోడికి చెబుతుంది రుద్రాణి. మా ఇంటావిడకి మందులు అయిపోయాయి ప్రకృతి వైద్యశాలకి వెళ్లి మందులు తీసుకుని వెంటనే వచ్చేస్తా అంటాడు. లోపలకు వెళ్లి కూర్చున్న రుద్రాణికి ఎదురుగా వంట చేస్తూ దీప కనిపిస్తుంది. ఏంటి రుద్రాణి గారు అంతా కులాశేనా..ఊళ్లో పెత్తనాలన్నీ బాగా చేసొచ్చారా..ఊళ్లోవాళ్ల వడ్డీ సొమ్ములు బాగా వసూలు అవుతున్నాయా అని అడుగుతుంది. నువ్వేంటి దీప మా ఇంట్లో వంటగదిలో అన్న రుద్రాణితో మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది..వంట చేసుకుని వెళదామని బియ్యం, కూరగాయలు తీసుకొచ్చి వంట చేసుకున్నా అంటుంది. మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే నా ఇంట్లో వంటచేసుకోవడం ఏంటని అడుగుతుంది. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోమా అంటుంది. నువ్వేంటి నా ఇంటికొచ్చి నా వంటగదిలో దూరడం ఏంటని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నీ వంటగది వాడుకుంటేనే నీకు అంత కోపం వస్తే..నా పిల్లలపై కన్నేసిన నీపై నాకెంత కోపం రావాలి..నా పిల్లల జోలికి రావొద్దని హెచ్చరిస్తుంది.
Also Read: వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు, ప్రకృతి ఆశ్రమానికి సౌందర్య, ఆనందరావు.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
మేం కాసేపు కనిపించకపోతే టెన్షన్ పడతావ్ కదా..తాతయ్య నానమ్మ నువ్వు కనిపించకపోతే బాధపడతారు కదా అంటుంది సౌర్య. నానమ్మ పెద్దోడా అని పిలిచే పిలుపు నీకు గుర్తుకు రావడం లేదా..వాళ్లని మిస్ అవుతున్నా అని అనిపించడం లేదా అని ప్రశ్నిస్తుంది. బాధపడిన కార్తీక్.. నేను చేసిన తప్పులకు అందరూ శిక్ష అనుభవిస్తున్నారు.నేను ఏం చేసాధించాను దీపా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు...
Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
Also Read: వామ్మో.. డాక్టర్ బాబుకి సినిమా కష్టాలు మరీ ఈ రేంజ్ లోనా.. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి