News
News
X

Janaki Kalaganaledu September 9th: జ్ఞానంబపై జెస్సి పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్- పూజ నుంచి వెళ్ళిపోయిన జానకి, ఇరికించిన మల్లిక

జెస్సికి న్యాయం చెయ్యాలని జానకి నిర్ణయించుకుంటుంది. దీంతో కథనం ఉత్కంఠగా సాగుతోంది.

FOLLOW US: 

ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా వినాయక చవితి పూజ చెయ్యమని జ్ఞానంబ జానకికి చెప్తుంది. జెస్సి వల్ల తల్లిదండ్రులు జానకికి ఫోన్ చేస్తూ ఉంటారు కానీ తాను లిఫ్ట్ చేయదు. వాళ్ళకి ఇచ్చిన టైమ్ అయిపోయింది కానీ అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని అంటాడు. జానకి మనల్ని మాటలతో ఏమార్చిందని జెస్సి తల్లి మేరీ అంటుంది. అక్క అలా చేయదు అని జెస్సి అంటే నోర్ముయ్ అని తిడతాడు. నిజాయితీ ఉన్నది అయితే ఫోన్ చేసి మాట్లాడేది అలా ఏమి చేయలేదంటే ఏంటి అర్థం అని జెస్సి తండ్రి అంటాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు మన దారికి వస్తారు, అప్పుడే పది మందిలో విషయం పడి మన దారికి వస్తారు అని జెస్సి తండ్రి చెప్తాడు. పోలీసు కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని జెస్సిని రమ్మని పిలుస్తాడు. డ్రెస్ ఛేంజ్ చేసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళిన జెస్సి జానకికి వాయిస్ మెసేజ్ పంపిస్తుంది.

నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదని నాన్న వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్తున్నారు, పరిస్థితి చేయి దాటింది, నువ్వే ఏదో ఒకటి చేసి నాజీవితాన్ని నిలబెట్టు అక్కా అని మెసేజ్ పెడుతుంది. పండగ హడావుడిలో పడి జెస్సి విషయం ఇంట్లో చెప్పడం కుదరలేదు ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి మరికొంచెం టైమ్ తీసుకోవాలని జానకి అనుకుని ఫోన్ చూసుకుంటుంది. జెస్సి వాయిస్ మెసేజ్ విని జానకి టెన్షన్ పడుతుంది. ఎలాగైనా వాళ్ళని ఆపాలి అని అనుకుంటుంది. అప్పుడే రామా వస్తాడు. అర్జెంట్ పని మీద బయటకి వెళ్తున్నా అత్తయ్యగారు ఏమి అనకుండా మీరే చూడాలి అని రామకి చెప్పి వెళ్తుంది. తను టెన్షన్ గా బయటకి వెళ్ళడం నీలావతి కంట పడుతుంది. జానకి అని పిలుస్తుంది కానీ వినిపించుకోకుండా వెళ్తుంది. ఇంట్లో పూజ పెట్టుకుని ఎక్కడికి వెళ్తుందని అనుకుంటుంది.

Also Read: మాధవ్ కి వాత పెట్టిన భాగ్యమ్మ- రాధని మెచ్చుకున్న దేవుడమ్మ, రెండు ఇళ్ళల్లో వినాయక చవితి సంబరాలు

నీ తోడి కోడలు జానకి ఏంటి ఎక్కడికే వెళ్తుందని నీలావతి మల్లికని అడుగుతుంది. ఏదో జరుగుతుంది ఇప్పుడు జానకిని ఇరికిస్తాను అని మల్లికా ప్లాన్ వేస్తుంది. వెంటనే వెళ్ళి అత్తయ్యగారు జానకి పూజ పనులు చూడకుండా ఎక్కడికో బయటకి వెళ్ళిందని ఊదేస్తుంది. జానకి బయటకి వెళ్ళడం ఏంటి ఇక్కడే ఉంది కదా అని జ్ఞానంబ అంటుంది. జానకి బయటకి వెళ్ళిందా అని రామాని అడుగుతుంది. అవునమ్మ ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పి వెళ్ళిందని అంటాడు. పూజ తన చేతుల మీదగా జరగాలని చెప్పాను కదా ఇప్పుడు బయటకి వెళ్ళడం ఏంటి అని కొప్పడుతుంది.

జానకి సమయానికి వెళ్ళి జెస్సి వాళ్ళ తల్లిదండ్రులు కారుకి అద్దం పడుతుంది. పూజలో ఉండి మీరు చేసింది చూడలేదు. పండగ హడావుడిలో అత్తయ్యగారితో మాట్లాడటం కుదరలేదు కొంచెం టైమ్ ఇవ్వమని జానకి అడుగుతుంది. కేసు పెడితే మీ వాళ్ళు కూడా దిగి వచ్చి పెళ్లి చేస్తారని జెస్సి తండ్రి అంటాడు. అలా జరిగితే వాళ్ళ మనసులు విరిగిపోతాయి. ఇలాంటివి నాలుగు గోడల మధ్యే పరిష్కారం అవ్వాలి కానీ నలుగురిలో పడితే బాధ పడేది జెస్సినే అని జానకి అంటుంది. ఇప్పుడు నీతో పాటు జెస్సిని తీసుకెళ్లు మీ వాళ్ళతో మాట్లాడి జెస్సిని మీ ఇంటి కోడలిగా ఒప్పించమని మేరీ చెప్తుంది. అందుకు జానకి ఒప్పుకుని జెస్సిని తనతో పంపించమని అంటుంది. జానకి కోసం ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మల్లిక పెట్రోల్ పోసి జానకిని ఇరికించాలని ట్రై చేస్తుంటే జ్ఞానంబ నోరు ముయ్యమని తిడుతుంది. దీంతో నీలావతిని ఉసిగొల్పుతుంది మల్లిక.  

Also Read: లాస్యని ఆట ఆడేసుకున్న లక్కీ- హనీని తీసుకుని తులసి ఇంటికి సామ్రాట్, శ్రుతి మీద తన ప్రేమని బయటపెట్టిన ప్రేమ్

Published at : 09 Sep 2022 11:05 AM (IST) Tags: Janaki Kalaganaledu Serial Today Episode Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial Today Janaki Kalaganaledu September 9th

సంబంధిత కథనాలు

Satyadev Interview : మెగాస్టార్ ముందు నేను మామూలోడిని, 'లూసిఫర్' చూడకుండా 'గాడ్ ఫాదర్' ఒప్పుకొన్నా - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Satyadev Interview : మెగాస్టార్ ముందు నేను మామూలోడిని, 'లూసిఫర్' చూడకుండా 'గాడ్ ఫాదర్' ఒప్పుకొన్నా - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి

God Father: 'గాడ్ ఫాదర్'లో 'బింబిసార' బ్యూటీ - ఒక్క సాంగ్ కోసం ఎంత ఖర్చు పెట్టారంటే?

God Father: 'గాడ్ ఫాదర్'లో 'బింబిసార' బ్యూటీ - ఒక్క సాంగ్ కోసం ఎంత ఖర్చు పెట్టారంటే?

యాంకర్‌ను బూతులు తిట్టిన హీరో, అరెస్టు చేసిన పోలీసులు

యాంకర్‌ను బూతులు తిట్టిన హీరో, అరెస్టు చేసిన పోలీసులు

Samantha: దుల్కర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో సమంత - కన్ఫర్మ్ అయినట్లే!

Samantha: దుల్కర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో సమంత - కన్ఫర్మ్ అయినట్లే!

టాప్ స్టోరీస్

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?