News
News
X

Gruhalakshmi September 9th Update: లాస్యని ఆట ఆడేసుకున్న లక్కీ- హనీని తీసుకుని తులసి ఇంటికి సామ్రాట్, శ్రుతి మీద తన ప్రేమని బయటపెట్టిన ప్రేమ్

సామ్రాట్, తులసిని శాశ్వతంగా దూరం చేసేందుకు లాస్య ప్లాన్ వేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

జీవితంలో తులసితో మాట్లాడేది లేదని సామ్రాట్ తన బాబాయ్ తో తేల్చి చెప్పేస్తాడు. హనీ చార్ట్స్ కొనుక్కోడం కోసం రోడ్డు మీదకి వస్తుంది. అక్కడ రోడ్డు మీద తులసి కనిపించేసరికి హనీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. వెహికల్స్ వస్తున్నాయి ఆగు మేమే వస్తాం అని తులసి ఎంత చెప్పిన వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చి తనని కౌగలించుకుంటుంది. అలా వస్తే ఎలా హనీ ఏమైనా ప్రమాదం జరిగితే అని తులసి చాలా కంగారు పడుతుంది. నేను మీ మీద దిగులు పెట్టుకున్నాను, ఊరు వెళ్ళే ముందు ఒక మాట చెప్పొచ్చు కదా అని హనీ అంటుంది. నేను ఊరు వెళ్ళాను అని ఎవరు చెప్పారని తులసి అడుగుతుంది. అలా అని ఎవరు చెప్పారు అంటే మా నాన్న అందుకే మీరు మా ఇంటికి కూడా రావడం లేదని హనీ అంటుంది.

ఊరు వెళ్ళాను అని హనీకి అబద్ధం చెప్పి సర్ది చెప్పారు అంతే కానీ నాతో ఫోన్ చేసి మాట్లాడలేదు అంత కోపంలో ఉన్నారు అని తులసి మనసులో అనుకుంటుంది. మా నాన్న అబద్ధం చెప్పారా నిజంగా మీరు ఊరుకి వెళ్లలేదా అని హనీ అడిగేసరికి లేదు మీ నాన్న అబద్ధం ఎందుకు చెప్తారు నేను నిజంగానే ఊరు వెళ్ళాను అని తులసి కవర్ చేస్తుంది. లక్కీ కూడా వస్తాడు. మీ ఇంటికి వచ్చి నేను కూడా పండగ చేసుకోవచ్చా అని హనీ తులసిని అడుగుతుంది. తులసి సామ్రాట్ మాటలు గుర్తు చేసుకుని ఆలోచనలో పడుతుంది. బిక్కు బిక్కుమంటూ ఒక్కదాన్నే ఇంట్లో కూర్చుంటున్న అందరితో సరదాగా గడిపే అదృష్టం నాకు లేదని హనీ బాధపడుతుంది. ఎందుకే లేదమ్మా ప్రతి పండగక్కి మా ఇంటికి వచ్చి సెలెబ్రేట్ చేసుకో అది కూడా నీ ఇల్లే రావడానికి నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదని తులసి అంటుంది. మరి నేనేం పాపం చేశాను నన్ను కూడా పిలవమని చెప్పొచ్చు కదా లక్కీ అంటాడు. సంతోషంగా రండి అని తులసి పిలుస్తుంది.

Also Read: తులసిని ఛీ కొట్టి వెళ్ళిన సామ్రాట్- పార్టీ చేసుకుంటున్న నందు, లాస్య

శ్రుతి తనకి డబ్బు అవసరం పడిందని తన అత్తయ్యకి కాల్ చేసి అడుగుతుంది. అది ప్రేమ్ వింటాడు. నా మీద ఎందుకు అంత ద్వేషం నా నుంచి ఎందుకు దూరం అవ్వాలని అనుకుంటున్నావ్. మంచో చెడో అమ్మ కోసం ఈ ఇంట్లో బంధి అయ్యావు. సంతోషించాను కానీ నా వైపు చూడకుండా ఉంటున్నావ్. చాలా బాగా నటిస్తున్నావ్ అదే భార్యగా నటిస్తున్నావ్ అంటాడు. నాకు నీతో మాట్లాడాలని లేదని శ్రుతి అంటుంది. ఎన్ని రోజులు ఇలా ఉంటావ్ అని ప్రేమ్ అంటాడు. అన్నీ గొడవలు మర్చిపోయి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అంటాడు కానీ శ్రుతి మాత్రం ఒప్పుకోదు. జీవితంలో నేను పోగొట్టుకున్నది చాలు ఇంకా పోగొట్టుకోడానికి సిద్ధంగా లేనని శ్రుతి తేల్చి చెప్తుంది. ఈ ఇంట్లో ఉన్నంత వరకు నీ బాధ్యత నాది డబ్బుతో సహా నువ్వు మీ అత్తయ్యని అడగాల్సిన అవసరం లేదు నోరు తెరిచి అడగటం ఇష్టం లేకపోతే జస్ట్ మెసేజ్ చేయి చాలు అని డబ్బు తీసి శ్రుతి చేతిలో పెడతాడు. ఇది లంచం కాదు కాక పట్టడం కాదు నా బాధ్యత అని బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

హనీ ఇంటికి వచ్చేసరికి సామ్రాట్ కోపంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ అరుస్తున్నరేందుకు నాన్న అని అడుగుతుంది. లేదని అంటాడు. తులసి ఆంటీ ఊరు నుంచి వచ్చేసింది, నాకు రోడ్డు మీద కనిపించింది అని చెప్పేసరికి సామ్రాట్ షాక్ అవుతాడు. నాన్న నీకు ఇంకో సర్ప్రైజ్ చెప్పనా అని హనీ అంటుంది. నాకు తులసి ఆంటీ వాళ్ళ లాగా ఇంట్లోనే పూజ చేసుకోవాలని ఉంది రేపు మీ ఇంటికి రావొచ్చా అని తులసి ఆంటీని అడిగాను అనేసరికి సామ్రాట్ బిత్తరపోతాడు. రావొద్దని చెప్పిందా అని పెద్దాయన అంటాడు. నేను అడిగితే వద్దని చెప్పడమా నెవర్ రమ్మని చెప్పిందని హనీ చెప్తుంది. తులసి ఆంటీ ఇంటికి నువ్వే నన్ను తీసుకుని వెళ్లాలని హనీ అడుగుతుంది. సరే అని అంటాడు. నాకు తులసి మీద ఉన్న కోపం కంటే హనీ మీద ఉన్న ప్రేమే ఎక్కువ నేనే తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను అనేసి వెళ్ళిపోతాడు.

Also Read: మాధవ్ కి వాత పెట్టిన భాగ్యమ్మ- రాధని మెచ్చుకున్న దేవుడమ్మ, రెండు ఇళ్ళల్లో వినాయక చవితి సంబరాలు

లక్కీ పండగకి తులసి ఇంటికి వెళ్తున్నట్టు లాస్యతో చెప్తాడు. ఆ మాటకి నందు, లాస్య షాక్ అవుతారు. అంటే మమ్మల్ని వదిలేసి నిన్ను ఒక్కడినే రమ్మని పిలిచిందా అని లాస్య అడుగుతుంది. ఎవరైనా పండగని ప్రశాంతంగా జరుపుకోవాలని అనుకుంటారు తలనొప్పి కోరుకోరు కదా అని కౌంటర్ వేస్తాడు. మీరు తులసి ఆంటీకి సంబంధించిన ఏ ఫంక్షన్ కి వెళ్ళినా  గొడవ పెట్టి అందరి మూడ్ చెడగొట్టిగాని ఇంటికి రారు, అందుకే మీరిద్దరు నాతో రాకూడదు అని లక్కీ అంటాడు. రేపు హనీ కూడా తులసి ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తుందని చెప్పేస్తాడు.

తరువాయి భాగంలో..

తులసి ఇంటికి లక్కీతో పాటు నందు, లాస్య కూడా వస్తారు. లోపల ఎవరు రెచ్చగొట్టినా ఏం అన్నా కూల్ గా ఉండు నువ్వు తన మాజీ భర్తవీ అన్న నిజం సామ్రాట్ గారికి తెలియకుండా దాచావని నువ్వే తులసిని రిక్వెస్ట్ చేసిన నిజం పొరపాటున కూడా బయట పెట్టకు అని లాస్య నందుని హెచ్చరిస్తుంది. హనీ కోసం సామ్రాట్ కూడా తులసి ఇంటికి వస్తాడు.     

Published at : 09 Sep 2022 08:30 AM (IST) Tags: Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial Gruhalakshmi Serial September 9th

సంబంధిత కథనాలు

జోరు వాన, అందమైన లోకేషన్లలో ‘కృష్ణ వింద విహారి’ షూటింగ్, ఆకట్టుకుంటున్న షెర్లీ సేతియా Vlog

జోరు వాన, అందమైన లోకేషన్లలో ‘కృష్ణ వింద విహారి’ షూటింగ్, ఆకట్టుకుంటున్న షెర్లీ సేతియా Vlog

Janaki Kalaganaledu October 4th: జెస్సిని చీదరించుకున్న అఖిల్- జ్ఞానంబ ఇంట్లో బొమ్మల కొలువు

Janaki Kalaganaledu October 4th: జెస్సిని చీదరించుకున్న అఖిల్- జ్ఞానంబ ఇంట్లో బొమ్మల కొలువు

Guppedantha Manasu October 4Update: వసుకి చాటుగా వీడియో తీసిన రిషి, కొడుకు మనసు తెలుసుకున్న జగతి

Guppedantha Manasu October 4Update: వసుకి చాటుగా వీడియో తీసిన రిషి, కొడుకు మనసు తెలుసుకున్న జగతి

Gruhalakshmi October 4th Update: ఊహించని ట్విస్ట్, తులసి మీద కావాలని నింద పడేలా చేసిన సామ్రాట్- హనీ పుట్టినరోజు వేడుకల్లో తులసికి అవమానం

Gruhalakshmi October 4th Update: ఊహించని ట్విస్ట్, తులసి మీద కావాలని నింద పడేలా చేసిన సామ్రాట్- హనీ పుట్టినరోజు వేడుకల్లో తులసికి అవమానం

Karthika Deepam October 4th Update: కార్తీక్ ముందు మోనితని అడ్డంగా బుక్ చేసేసిన దుర్గ, డాక్టర్ బాబు బర్త్ డే సెలబ్రేట్ చేసిన వంటలక్క

Karthika Deepam October 4th Update: కార్తీక్ ముందు మోనితని అడ్డంగా బుక్ చేసేసిన దుర్గ, డాక్టర్ బాబు బర్త్ డే సెలబ్రేట్ చేసిన వంటలక్క

టాప్ స్టోరీస్

FIR On Srikalahasti CI : చిక్కుల్లో శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

FIR On Srikalahasti CI :  చిక్కుల్లో  శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !