Devatha September 8th Update: మాధవ్ కి వాత పెట్టిన భాగ్యమ్మ- రాధని మెచ్చుకున్న దేవుడమ్మ, రెండు ఇళ్ళల్లో వినాయక చవితి సంబరాలు
దేవి మీద చిన్మయి రోజు రోజుకి ప్రేమ పెంచుకుంటుంది. అది చూసి రాధ ఎలా దేవమ్మని బయటకి పంపించాలి అని బాధపడుతుంది.
చిన్మయి దేవి దగ్గరకి వెళ్తాను అని మారాం చేస్తుంది. సరే అని రాధ రామూర్తిని ఆఫీసర్ సార్ కి ఫోన్ చేయమంటుంది. ఫోన్ రాధకి ఇస్తాడు. పెనిమిటి అని పిలవబోయి ఆగిపోతుంది. చిన్మయి కూడా దేవి దగ్గరకి వస్తాను అంటుంది అని చెప్తుంది. సరే పంపించు అంటాడు. ఆఫీసర్ సారు కారు పంపిస్తా అన్నారు అందులో వెళ్ళు అని రాధ చెప్పడంతో చిన్మయి చాలా సంతోషంగా ఉంటుంది.
దేవి, ఆదిత్య సత్య, దేవుడమ్మ కలిసి మట్టి వినాయకుడిని తయారు చేసే పోటీ పెట్టుకుంటారు. అవ్వా మేమే ముందు వినాయకుడిని చేశాము చూడు అని దేవి అంటుంది. రుక్మిణి అందంగా రెడీ అయ్యి వచ్చేసరికి అది చూసి భాగ్యమ్మ నా బిడ్డ ఎంత చక్కగా ఉందో అని దిష్టి తీస్తుంది. అలా అనేసరికి జానకి, రామూర్తి షాక్ అవుతారు. ఈ బిడ్డ కూడా నా బిడ్డ లెక్కే కదా అందుకే అలా అన్నాను అని భాగ్యమ్మ కవర్ చేస్తుంది. పూజ మీదలు పెట్టమని రామూర్తి రాధతో చెప్తాడు. రాధ దేవుడు ముందు దీపం పెడుతుంటే అప్పుడే మాధవ వస్తాడు. ఇంత అందం ఇన్నాళ్ళూ కళ్ల ముందు ఉన్నా ఎందుకు గుర్తించలేకపోయాను, చాలా మిస్ అయ్యావు రా మాధవ్ అని లోలోపల అనుకుంటాడు. మాధవ్ కన్నార్పకుండా రాధాని చూస్తూ ఉండటం భాగ్యమ్మ చూసి తిట్టుకుంటుంది.
Also Read: మాట మార్చిన యష్- షాకైన వేద, నిధి, వసంత్ పెళ్ళికి ఏర్పాట్లు
వేడి వేడి గిన్నె తీసుకుని వచ్చి మాధవ్ చేతికి తగిలిస్తుంది. కాలేసరికి మాధవ్ అరుస్తాడు. చూసుకోకుండా తగిలింది పటెలా మన్నించు అని కవర్ చేస్తుంది భాగ్యమ్మ. దేవి ఆఫీసర్ సార్ ఇంటికి వెళ్ళిందని జానకి చెప్పడంతో మాధవ్ ఎందుకు పంపించారు అని అడుగుతాడు. దేవుడమ్మ నోరు తెరిచి అడిగింది పంపించకుండా ఎలా ఉంటాను అని జానకి చెప్తుంది. మరి చిన్మయి ఎక్కడ అని మళ్ళీ అడుగుతాడు. దేవమ్మ దగ్గరకి వెళ్ళింది, పంపించలేదని మొహం నల్లగా పెట్టుకుంది అందుకే నేనే పంపించాను అని రాధ కోపంగా మాధవ్ మొహం కూడా చూడకుండా చెప్తుంది. ఇంట్లో పిల్లలు లేకుండా ఇద్దరినీ పంపిస్తారా అని అరుస్తాడు.
‘ఆదిత్య విషయం వస్తే చాలు అందరూ సమర్ధించే వాళ్ళే. అసలు ఆఫీసర్ సార్ ఇంటికి మన పిల్లల్ని పంపించడం ఏంటి. ఆ అదిత్యకి పిల్లలు లేరని మన పిల్లల్ని పంపిస్తారా? అసలు ఆ ఆఫీసర్ కి పిల్లలు లేకపోవడం ఏంటి? పిల్లల్ని వద్దని అనుకున్నారా లేదంటే పిల్లలే పుట్టరా? లేదా ఆఫీసర్ లో ఏదైనా లోపం ఉందా’? అని మాధవ్ అనేసరికి భాగ్యమ్మ, రాధ ఆగ్రహంతో ఊగిపోతారు. రాను రాను నీకు మాట పద్ధతి లేకుండా పోతుందని రామూర్తి అంటాడు. దేవుడమ్మ ఇంట్లో పూజకి కూర్చుంటారు. దేవి దేవుడమ్మ కుట్టిన లంగా జాకెట్ వేసుకుని వస్తుంది. అది చూసి ఆదిత్య మురిసిపోతాడు. ఎంత చక్కగా ఉన్నావమ్మా అని ఆదిత్య ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు.
Also Read: దేవి మీద ప్రేమ పెంచుకుంటున్న చిన్మయి- అయోమయంలో రుక్మిణి, ఆదిత్యపై సత్య అనుమానం
దేవి వినాయకుడిని అలంకరిస్తుంది. అప్పుడే చిన్మయి కూడా ఇంటికి వస్తుంది. వెళ్ళి ఇద్దరు ఒకరినొకరు కౌగలించుకుని సంతోషంగా ఉంటారు. నువ్వు ఇంట్లో లేకపోయేసరికి నాకేమీ బాగోలేదని చిన్మయి అంటుంది. వాళ్ళ ప్రేమ చూసిన దేవుడమ్మ పిల్లలంటే ఇలాగే ఉండాలని అంటుంది. ఈరోజుల్లో ఇలా ఎవరు ఉంటున్నారక్కా అని రాజమ్మ అనేసరికి నిజమే ఆ రాధ ఎలా ఉంటుందో చూడలేదు కానీ ఆ అమ్మాయి పిల్లాలిద్దరిని చక్కగా పెంచింది అని దేవుడమ్మ మెచ్చుకుంటుంది.