News
News
X

Devatha September 7th Update: దేవి మీద ప్రేమ పెంచుకుంటున్న చిన్మయి- అయోమయంలో రుక్మిణి, ఆదిత్యపై సత్య అనుమానం

దేవికి ఆదిత్యని దూరం చేయాలని మాధవ్ మరో ప్లాన్ వేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఎం జరిగిందంటే..

FOLLOW US: 

ఆదిత్య మాట్లాడుతుంటేనే రాధ నా మాట వినడం లేదు ఇప్పుడు అత్తగారు కూడా మాట్లాడారు అంటే రాధ బయటకి వెళ్లిపోవళి అనే ఆలోచనకి బలం పెరుగుతుంది. ఒక వేళ తాను వెళ్లలేకపోతే దేవిని అయిన ఈ ఇంటి నుంచి పంపించేస్తుంది. నేను తనని ఈ ఇంటి గడప దాటకుండా ఎంత ట్రై చేస్తున్నానో రాధకి ఆ ఇంటితో అనుబంధం అంతకంతకూ పెరిగిపోతుంది. ఇలాగే వదిలేస్తే రాధ నాకు దూరం అయిపోవడం ఖాయం. కానీ అలా జరగనివ్వను. రాధ విషయంలో నేను తొందరపడాలి’ అని మాధవ టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. చిన్మయి అన్నం తింటూ నేను దేవి నీ పిల్లలమే కదా మరి నాకు నాన్న మాట తీరు దేవికి నీ మాట తీరు వచ్చిందేంటి అమ్మా అని అడుగుతుంది. అదేమీ లేదని రాధ కవర్ చేస్తుంది.

దేవుడమ్మ ఇంట్లో దేవి రుక్మిణితో ఆడుకుంటూ ఉంటుంది. దేవుడమ్మ వచ్చి దేవి కొలతలు తీసుకుంటూ ఉంటుంది. పండగ కదా నీకు కొత్త బట్టలు కుట్టి ఇస్తాను అని చెప్తుంది. నీకు మిషన్ కుట్టడం కూడా వచ్చా అని దేవి దేవుడమ్మని అడుగుతుంది. వచ్చని చెప్తుంది దేవుడమ్మ. ఇద్దరు కాసేపు నవ్వుతూ మాట్లాడుకుంటారు. నీ నవ్వుతో మాయ చేస్తావే అని దేవుడమ్మ అంటే నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంటావని దేవి దేవుడమ్మ బుగ్గలు గిల్లుతుంది. అది చూసి ఆదిత్య మురిసిపోతాడు. చిన్మయి నిద్రపోతు దేవి అని ఒక్కసారిగా అరిచి నిద్రలో లేస్తుంది. నాకు చెల్లి కావాలి నేను దేవి దగ్గరకి వెళ్తాను అని రాధని అడుగుతుంది. దేవి లేకపోతే నాకు ఏదోలా ఉంది, నేను కూడా ఆఫీసర్ సారు ఇంటికి వెళ్తాను లేదంటే చెల్లిని తీసుకుని రా అని అడుగుతుంది. సరే అని చెప్పి రాధ చిన్మయిని పడుకోబెడుతుంది.

Also Read: రుక్మిణికి ఫోన్ చేసి మాట్లాడిన దేవుడమ్మ- మాధవ్ షాక్, కుమిలి కుమిలి ఏడుస్తున్న రుక్మిణి

దేవుడమ్మ దేవి కోసం బట్టలు కుడుతూ ఉంటుంది. దేవికి డ్రెస్ కుట్టించాలని నీకు ఎందుకు అనిపించిదని ఆదిత్య అడుగుతాడు. ఏమో తెలియదు కానీ డబ్బులు పెట్టి కొనివ్వొచు కాని నా చేతులతో కుడితేనే ఆనందం అని అంటుంది. ఆదిత్య కూడా అక్కడే ఉంది దేవిని చూస్తూ నిలబడిపోవడం సత్య గమనిస్తుంది. దేవి అంటే ఆదిత్యకి ఎందుకంత అభిమానం అని సత్య ఆలోచిస్తుంది. ‘ఆంటీ దేవి మీద ప్రేమ చూపిస్తుంది అంటే పిల్లలు లేరని బాధ ఉంది. ఇన్నాళ్ళూ చెరదీసిన పిల్ల అని అభిమానం చూపిస్తున్నారు అందులే తప్పేమీ కనిపించడం లేదు కానీ ఆదిత్య ఎందుకు దేవి గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడు, దేవిని రెండు రోజులు ఉంచుకుంటాను అంటే అక్కడ అక్క కూడా ఒప్పుకుంది, అలా ఎలా ఒప్పుకుంది అసలేం జరుగుతుంది, నాకేమీ అర్థం కావడం లేడు’ అని సత్య అనుకుంటుంది. రాధ చిన్మయికి చీర కత్తి అందంగా ముస్తాబు చేస్తుంది. అది చూసి రామూర్తి దంపతులు సంతోషిస్తారు.

చిన్మయిని దగ్గరకి తీసుకుని జానకి చాలా సంతోషంగా ముద్దు పెట్టుకుంటుంది. మా బంగారం రాధమ్మలా తయారైంది అని రామూర్తి అంటాడు. చీర కడితే పుత్తడి బొమ్మలా ఉన్నావ్ అని జానకి అంటుంది. అయినా నా మూడ్ బాగోలేదు దేవి ఇక్కడ లేకపోతే నాకు ఏమి బాగోలేదమ్మా అని చిన్మయి మళ్ళీ అంటుంది.  

Also Read: పేపర్ కి ఎక్కిన తులసి, సామ్రాట్ గొడవ, లాస్య ప్లాన్ సక్సెస్ - తులసిని ఆఫీసులో అడుగుపెట్టనివ్వనన్న సామ్రాట్

Published at : 07 Sep 2022 08:09 AM (IST) Tags: devatha serial devatha serial today episode Devatha Serial Today Devatha Serial Today Episode Written Update Devatha Serial September 7th

సంబంధిత కథనాలు

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?