News
News
X

Gruhalakshmi September 6th Update: పేపర్ కి ఎక్కిన తులసి, సామ్రాట్ గొడవ, లాస్య ప్లాన్ సక్సెస్ - తులసిని ఆఫీసులో అడుగుపెట్టనివ్వనన్న సామ్రాట్

నందు తులసి మాజీ భర్త అని బయటపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. తులసి, సామ్రాట్ ని దూరం చేసేందుకు లాస్య ప్లాన్స్ వేస్తుంది.

FOLLOW US: 

తులసిని తీసుకురమ్మని చెప్పడంతో నందు చిరాకుగా ఉంటాడు. లాస్య మాత్రం కూల్ గా ఉండు ఎందుకు అంత టెన్షన్ అని ఏదో ప్లాన్ వేసి నందు చెవిలో చెప్తుంది. అమ్మో సామ్రాట్ కి తెలిస్తే అని నందు భయపడతాడు. ఎలా తెలుస్తుంది మనం చెప్తేనే కదా తెలిసేది ఇప్పుడు సామ్రాట్ కి మనం చెప్పేదే వేదం అని అంటుంది. ఎందుకు వచ్చిన తలనొప్పి, నిజం చెప్పేస్తాను అని నందు కంగారు పడతాడు. ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకుని సామ్రాట్ తులసి శాశ్వతంగా విడిపోయేలా చేద్దామని లాస్య చెప్తుంది. అభి జరిగింది తలుచుకుని ఆలోచిస్తూ తులసిని మాట్లాడటానికి పిలుస్తాడు. అంకిత పక్కన ఉంటే తనని వెళ్ళమని అంటాడు. నువ్వు డాడ్ తో మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి మామ్ అని అంటాడు. అభి మాటలు పట్టించుకోకండి అని అంకిత అంటుంది.

ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావ్, డాడ్ ని అవమానిస్తున్నావ్ అరుస్తున్నావ్ నిర్లక్ష్యం చూపిస్తున్నావ్ నీకు తెలుస్తుందా అని అభి అంటాడు. తెలుస్తుంది  అందుకు కారణం నీకు తెలియడం లేదా అని వేదాంతం చెప్తుంది. మార్నింగ్ డాడ్ ఏమని అడిగారు ఆఫీసుకి రమ్మని అంతే కదా దానికి ఇష్టం ఉంటే వెళ్ళు లేదంటే లేదని చెప్పాలి అంతేకానీ డాడ్ పరువు తీసేలా మాట్లాడటం నాకు నచ్చలేదు దయచేసి ఇంకోసారి రిపీట్ చెయ్యకు అని అభి అంటాడు. మీ నాన్నతో గట్టిగా మాట్లాడటం అవమానంగా కనిపిస్తుంది మరి నేను ఆయన ఇంటికి వెళ్ళి బతిమలాడితే చీదరించుకున్నారు మరి నేనేమీ అనుకోవాలి అని తులసి అంటుంది. నీ వైపే కాదు డాడ్ వైపు కూడా ఆలోచించమని అభి చెప్తాడు. నా మాజీ భర్త అని కారణం వల్ల ఆయనకి సమస్య రాకూడదని అనుకున్నా అందుకే నేను సమస్యలో చిక్కుకున్నా.. మీ నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం కదా అమ్మ మీ మాట విన్నది కదా నాన్న నువ్వు మాత్రం ఎందుకు వినవు అని అడుగు అదే నీ ప్రశ్నకి సమాధానం అవుతుంది అని గట్టిగా ఇచ్చిపడేస్తుంది.

Also Read: రుక్మిణికి ఫోన్ చేసి మాట్లాడిన దేవుడమ్మ- మాధవ్ షాక్, కుమిలి కుమిలి ఏడుస్తున్న రుక్మిణి

సామ్రాట్ తన బాబాయ్ అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చిన్న విషయాన్ని నేను సీరియస్ గా తీసుకుంటున్నాన అని అనుకుంటూ ఉండగా నందు, లాస్య వస్తారు. వెనకే తులసి వచ్చిందేమో అని ఆశగా చూస్తూ ఉంటాడు సామ్రాట్. తులసి రాను అన్నది రాను అని చెప్పమన్నది అని లాస్య చెప్తుంది. ఆ మాటకి షాక్ అవుతాడు సామ్రాట్. చాలాసేపు కన్వీన్స్ చేశాం కానీ తను మా మాట వినలేదు, మా ఇష్యూలో ఇన్వాల్వ్ అవడానికి మీరు ఎవరు అని మమ్మల్ని చాలా అవమానించింది మాజీ భర్త అనే గౌరవం కూడా ఇవ్వలేదు పోయి సామ్రాట్ గారికి చెప్పుకోండి అనేసింది. మేము ఇక్కడ ఉద్యోగం చెయ్యడం తన ప్రాబ్లం అయితే మేము ఉద్యోగం మానేసి వెళ్లిపోతాము అని లాస్య అనేసరికి అవసరం లేదు తను ఎవరో చెప్తే మీరు రిజైన్ చెయ్యడం ఏంటి ఈ కంపెనీకి నేను బాస్ ని సామ్రాట్ అంటాడు.

ఒక్కసారి మీరు తులసితో మాట్లాడి చూడండి తను కన్వీన్స్ అవుతుంది అని లాస్య అంటుంది. నేను బతిమాలడను నాకు ఆ అవసరం లేదు తను ఇంక ఈ ఆఫీసులో అడుగుపెట్టడానికి వీల్లేదు తను మనసు మార్చుకున్నా నేను మనసు మార్చుకునే ప్రసక్తే లేదు నా మాటగా ఈ విషయాన్ని మీ మాజీ భార్యకి చెప్పండి అని సామ్రాట్ కోపంగా చెప్తాడు. లాస్య తన ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుకుంటుంది.   

Also Read: అభి వేసిన చెత్త ప్లాన్ ఫెయిల్- తిట్టిన మాళవిక, సంతోషంలో అన్నాచెల్లెళ్ళు

Published at : 06 Sep 2022 09:06 AM (IST) Tags: Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial Gruhalakshmi Serial September 6th

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Rana Naidu Web Series: బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్

Rana Naidu Web Series: బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల