Ennenno Janmalabandham September 6th: అభి వేసిన చెత్త ప్లాన్ ఫెయిల్- తిట్టిన మాళవిక, సంతోషంలో అన్నాచెల్లెళ్ళు
ఆదిత్యని అడ్డం పెట్టుకుని యష్ మీద పగ సాధించాలని అభిమన్యు, మాళవిక ప్రయత్నిస్తూ ఉంటారు.
ఖుషి తన అన్నయ్య ఆదిత్యకి రాఖీ కట్టడానికి వస్తుంది. రాఖీ కట్టడానికి ఖుషి వెళ్తుంటే మాళవిక ఆపుతుంది. నేను చెప్పినట్టు వింటేనే అన్నయ్యకి రాఖీ కట్టడం కుదురుతుందని చెప్పి ఒక గదిలోకి పంపిస్తుంది. ఏంటి వేద ఒక్కదానివే వచ్చావ్ మీ ఆయన రాలేదా అని మాళవిక అడుగుతుంది. వచ్చారు బయటే ఉండమని చెప్పాను అని వేద అంటుంది. అదేంటి మీ ఆయన వస్తేనే కదా అసలు మజా ఉండేది అని మాళవిక అనేసరికి ఇవన్నీ వద్దనే ఆయన్ని బయట ఉంచాను అని వేద కోపంగా చెప్తుంది. టైం వెస్ట్ చెయ్యకుండా ఆదిత్యని పిలువు రాఖీ కడుతుందని అంటుంది. ఖుషి ఆదిత్యకి రాఖీ కట్టాలంటే చిన్న కండిషన్.. ఖుషి నన్ను అమ్మా అని పిలవాలి, నేనే తన కన్నతల్లిని అని నాదగ్గరకి వచ్చి ఒప్పుకోవాలి అప్పుడే తనతో ఆదికి రాఖీ కట్టిస్తాను అని మాళవిక చెప్తుంది.
ఖుషికి నువ్వంటే ప్రేమ లేదంటే విషయం ఇప్పటికీ చాలా సార్లు ప్రూవ్ అయ్యింది అన్ని తెలిసి కూడా నీ పిచ్చి కోరికలు, పిచ్చి కండిషన్లు ఏంటి అని వేద తిడుతుంది. నేనంటే ప్రేమ లేకపోవచ్చు కానీ నువ్వంటే పిచ్చి కదా ఖుషిని నాదగ్గరకి తీసుకొచ్చి చెప్పించాలి, నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచేలా ఒప్పించాలి, నాకు ముద్దు పెట్టేలా చెయ్యాలి లేదంటే ఖుషి చేత రాఖీ కట్టించను. ఎంతో హ్యాపీగా వచ్చిన ఖుషిని కన్నీళ్లతో తీసుకొస్తావో లేదంటే నేను చెప్పినట్టు చేసి రాఖీ కట్టించి తీసుకెళతావో మీ ఇష్టం అని మాళవిక చెప్తుంది.
Also Read: సామ్రాట్ రాక్స్, నందు షాక్- తులసితో కాళ్ళ బేరానికి వచ్చిన నందు, లాస్య
నువ్వు అసలు తల్లివెనా కన్న బిడ్డల సంతోషాన్ని నీ అవసరానికి వాడుకుంటావా? కంటే సరిపోదు వాళ్ళ సంతోషం కోసం ప్రాణం ఇచ్చి అయిన వాళ్ళ సంతోషానికి కారణం కావాలి, వాళ్ళ కన్నీళ్ళు అడ్డం పెట్టుకుని నీ కోరిక తీర్చుకోడం ఏంటి అని యష్ కోపంగా అరుస్తాడు. ఖుషి తీసుకుని రా వెళ్దాం అని యష్ అంటాడు. తను అన్నయ్యకి రాఖీ కట్టాలని ఆశగా వచ్చింది, వద్దని చెప్తే ఊరుకుంటుందా అని మాళవిక అంటుంది. నీ స్వార్థం కోసం ఇలా చేస్తున్నావ్ అది నేను ఒప్పుకోను అని యష్ అంటాడు. నేను వెళ్ళి ఖుషితో మాట్లాడతాను అని వేద సర్ది చెప్తుంది.
వేద ఖుషి దగ్గరకి వచ్చి మాళవికని అమ్మా అని పిలిచి ముద్దు పెడితే హ్యాపీగా ఉంటుంది అని చెప్తుంది. తనకి ముద్దు పెట్టడం నాకు ఇష్టం లేడని ఖుషి చెప్తుంది. తనని అమ్మా అని కూడా పిలవను నాకు అమ్మా అంటే నువ్వు ఒక్కదానివే అని అంటుంది. యష్ వచ్చి అదంతా విని ఖుషికి కూడ ఇష్టం లేదు పదండి వెళ్దామని అంటాడు. అదేంటి అని ఖుషి అమాయకంగా అడుగుతుంది. నువ్వు రాఖీ కట్టాలంటే తనని అమ్మా అని పిలవాలని, ముద్దు పెట్టాలని కండిషన్ పెట్టింది అందుకే నిన్ను బతిమలాడటానికి మీ అమ్మ వచ్చిందని విషయం చెప్పేస్తాడు యష్. అలా చేయకపోతే అన్నయ్యకి రాఖీ కట్టలేనా, ఫస్ట్ టైం అన్నయ్యకి రాఖీ కడుతున్నా అని చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నా ఇలా జరిగింది ఏంటి అని ఖుషి ఏడుస్తుంది.
Also Read: తగ్గేదెలే అంటోన్న మోనిత, ముంబయికి డాక్టర్ బాబు- కుమిలి కుమిలి ఏడుస్తున్న దీప
యష్ ఖుషిని తీసుకుని ఆదిత్య దగ్గరకి వెళ్లబోతుంటే అభి అడ్డుపడి ఆపుతాడు. కాసేపు ఇద్దరి మధ్య మాటల వార్ నడుస్తుంది. కోపంగా యష్, వేద ఖుషిని తీసుకుని ఇంటికి వెళ్తుంటారు. ఇంట్లో ఒక చోట ఆదిత్య తనకి నేర్పించిన సంగీత వాయిద్యం వాయిస్తుంది. అది విని ఆదిత్య పరిగెత్తుకుంటూ వచ్చి చెల్లిని ప్రేమగా కౌగలించుకుంటాడు. మార్నింగ్ నుంచి నీ కోసమే వెయిట్ చేస్తున్నా అని ఆదిత్య అంటాడు. ఈరోజు రాఖీ కదా నేను నిన్ను ఎలా మిస్ అవుతాను అని ఖుషి చెప్తుంది ఖుషి సంవతోషంగా అన్నయ్యకి రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తుంది. అది చూసి యష్, వేద చాలా సంతోషిస్తారు.