News
News
X

Nani: 'శ్యామ్ సింగరాయ్' రీమేక్ లో హృతిక్ రోషన్.. నిజమేనా..?

'శ్యామ్ సింగరాయ్' సినిమా గురించి నాని మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

FOLLOW US: 

హీరో నాని ఇప్పటివరకు కామెడీ, ఎమోషనల్, ప్రేమ కథల్లో ఎక్కువగా నటించారు. కానీ తొలిసారి ఆయన పూర్తిస్థాయి పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నారు. అదే 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమాలో నాని రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో భారీ యాక్షన్స్ ఉంటాయని తెలుస్తోంది. 'టాక్సీవాలా' ఫేమ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

Also Read:దెయ్యాలతో కలిసి జీవించిన 'ఎటర్నల్స్' ఫేమ్.. చివరకు ఏం చేసిందంటే..?

తాజాగా ఈ సినిమా గురించి నాని మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయరా..? అని ప్రశ్నించగా.. ఇది పాన్ ఇండియా సబ్జెక్ట్ అని, అన్ని భాషల వాళ్లు చూడదగ్గ సినిమా అని చెప్పిన నాని.. ఈ సినిమాకి ఎలాంటి పరిధులు లేవనే దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి హిందీలో విడుదల చేసే ఆలోచన లేదని.. ఏమో చూద్దాం.. ఏ హృతిక్‌ రోషనో ఈ చిత్రాన్ని హిందీలో చేసేస్తారనే నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. 

ఇప్పటికే బాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమా రీమేక్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ రానుంది. నాని నటించిన 'జెర్సీ' సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా కూడా బాలీవుడ్ కి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి నాని తన స్క్రిప్ట్ సెలెక్షన్ తో బాలీవుడ్ తారలను ఆకట్టుకుంటున్నాడు. 

Also Read: స్టార్ హీరోని కొడితే రూ.1001 బ‌హుమ‌తి.. ఓపెన్ ఆఫర్..

Also Read: ఎన్టీఆర్... రామ్ చరణ్... నాటు నాటు... ఊర నాటు! ప్రేక్షకులు చిందేసేట్టు!!

Also Read: సంక్రాంతి తర్వాతే కొరటాల సెట్స్‌కు యంగ్ టైగర్... పక్కా ప్లాన్ రెడీ

Also Read: సిక్స్‌ప్యాక్‌ బాడీ వల్లే మూడు సినిమా ఛాన్సులు... నాకు ఫిజిక్ అడ్వాంటేజే

Also Read: కందిసేను కాడ... పంపుషెడ్డు కాడ... డాంట‌కు డ‌డ‌న‌! 'బంగార్రాజు' లడ్డుండా!!

Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Nov 2021 04:46 PM (IST) Tags: nani Rahul Shyam Singha Roy Hrithik Roshan Shyam Singha Roy remake

సంబంధిత కథనాలు

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

Akanksha Mohan Suicide: నటి ఆత్మహత్య - సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

Akanksha Mohan Suicide: నటి ఆత్మహత్య - సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

HariHara Veeramallu: అక్టోబర్ లో 'హరిహర వీరమల్లు' షూటింగ్ - వీడియో రిలీజ్ చేసిన టీమ్!

HariHara Veeramallu: అక్టోబర్ లో 'హరిహర వీరమల్లు' షూటింగ్ - వీడియో రిలీజ్ చేసిన టీమ్!

Bigg Boss 6 telugu: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు అమ్మాయిలు, ఇంటి కెప్టెన్ కీర్తి? వరస్ట్ కంటెస్టెంట్ ఆ హీరో?

Bigg Boss 6 telugu: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు అమ్మాయిలు, ఇంటి కెప్టెన్ కీర్తి? వరస్ట్ కంటెస్టెంట్ ఆ హీరో?

టాప్ స్టోరీస్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

Vivo X Fold Plus: రూ.లక్షకు పైగా రేటుతో వివో కొత్త ఫోన్ - మొబైల్ మడిచి జేబులో పెట్టుకోవడమే!

Vivo X Fold Plus: రూ.లక్షకు పైగా రేటుతో వివో కొత్త ఫోన్ - మొబైల్ మడిచి జేబులో పెట్టుకోవడమే!