By: ABP Desam | Updated at : 08 Nov 2021 05:29 PM (IST)
బాలయ్య షోలో నాని..
నందమూరి బాలకృష్ణ ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' కోసం ఓ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. 'Unstoppable' అంటూ బాలయ్య రచ్చ చేస్తున్నారు. దీపావళి రోజు నుంచి ఈ షోను స్ట్రీమింగ్ చేస్తున్నారు. తొలి ఎపిసోడ్ కి మంచు మోహన్ బాబు గెస్ట్ గా వచ్చారు. ఆయనతో పాటు మంచు విష్ణు, మంచు లక్ష్మి సైతం ఈ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వచ్చినప్పటినుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. పలు ఇంట్రెస్టింగ్ విషయాలతో ప్రోమోను కట్ చేశారు. ఎపిసోడ్ కూడా బాగా క్లిక్ అయింది. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దెబ్బకి 'ఆహా' సబ్ స్క్రిప్షన్స్ ఓ రేంజ్ లోపెరిగిపోయాయి.
Also Read: రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. హిందీ రిలీజ్ పక్కా..
ఇప్పుడు రెండో ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి గెస్ట్ గా నేచురల్ స్టార్ నానిని తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను ఇప్పటికే విడుదల చేశారు. ''మనలో ఒకడు.. సెల్ఫ్ మేడ్‌కి సర్ నేమ్.. మన రెండో గెస్ట్ నాని..'' అంటూ బాలయ్యతో కలిసి షోలో తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
'దెబ్బకి థింకింగ్ మారిపోవాలా' అంటూ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చేశారు బాలకృష్ణ. 'ఈరోజు మన గెస్ట్ మీ నుంచి వచ్చాడు.. సెల్ఫ్ మేడ్‌కి సర్ నేమ్.. నాని' అంటూ అరిచి చెప్పారు బాలయ్య. అరుస్తున్న ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ.. 'ఆగండి.. ఆగండి.. ఎక్కడ నాని' అని అడగ్గా.. జనాల్లో నుంచి లేచి స్టేజ్ పైకి వచ్చాడు నాని. 'నువ్వేంటి నాని.. జనం, అభిమానుల మధ్య నుంచి వచ్చావ్' అని బాలయ్య అడగ్గా.. 'మీతో పెరిగాడు.. మీ మధ్య నుంచి వచ్చాడు అని అన్నారు. సో వాళ్ల దగ్గరనుంచి రావడం కరెక్ట్ అనిపించింది' అంటూ బదులిచ్చారు.
ఆ తరువాత బాలయ్య 'గల్లీ క్రికెట్ ఆడడం అలవాటా..? లేక నేర్చుకున్నావా..?' అని నానిని అడగ్గా.. 'గల్లీ క్రికెట్ అలవాటు సార్' అనగా.. 'నాక్కూడా క్రికెట్ బాగా వచ్చయ్యా.. ఏ స్టూడియోలో షూటింగ్ జరిగినా.. నా కార్ డిక్కీలో క్రికెట్ కిట్ ఉండాల్సిందే' అని చెప్పారు బాలయ్య. ఆ తరువాత ఇద్దరూ సరదాగా స్టేజ్ పై క్రికెట్ ఆడారు. బాలయ్య ఆడే సమయంలో నాని.. 'మీరు కావాలనుకుంటే చెమట పట్టకుండా చంపేయడమే' అంటూ డైలాగ్ వేశారు. బాలయ్య ముందు ఆయన డైలాగే చెప్పి ఇంప్రెస్ చేశారు నాని. మధ్యలో బాలయ్య పులిహోర కబుర్లు చెప్పొద్దు అంటూ నానికి డైలాగ్ వేశారు. ఈ షోలో నాని ఎదుర్కొన్న డిస్ట్రిబ్యూటర్స్ సమస్య గురించి బాలయ్య అడిగారు. ఓవరాల్ గా ప్రోమో అయితే ఇంట్రెస్టింగానే ఉంది. నవంబర్ 12న ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయనున్నారు.
Adiripoye entertainment ki idi chinna sample maatrame 😉#UnstoppableWithNBK Ep-2 promo out now 💥💥
— ahavideoIN (@ahavideoIN) November 8, 2021
▶️https://t.co/kI14jdCwJp
Full Episode Premieres November 12 🤩#NandamuriBalakrishna @NameisNani #MansionHouse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustries pic.twitter.com/cIvlKVv8VW
Also Read: మారుతితో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
Also Read: బండ్ల గణేష్... పవన్‌ను జాగ్రత్తగా చూసుకుంటావా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్ రిలీజ్!
Upcoming OTT Movies: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల
RDX OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?
DD Returns: తెలుగులో సంతానం తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?
Kushi OTT Release Date: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు
Chandrababu News: చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి
Salaar Vs Dunki : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా
/body>