Pushpa: రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. హిందీ రిలీజ్ పక్కా..
'పుష్ప' సినిమా హిందీ రిలీజ్ సమస్యను పరిష్కరించడానికి అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగాన్ని డిసెంబర్ 17న ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. 'అల.. వైకుంఠపురములో' సినిమా తరువాత బన్నీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. నేషనల్ వైడ్ గా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. అందుకే 'పుష్ప' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు.
Also Read: మారుతితో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా హిందీ రిలీజ్ కు సమస్య వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. మైత్రి మూవీస్ సంస్థ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను అలవాటు ప్రకారం.. ఓ బయ్యర్ కు అమ్మేశారు. ఆ తరువాత పాన్ ఇండియా రిలీజ్ అనుకోవడంతో అసలు సమస్య మొదలైంది. హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుకున్న వ్యక్తి థియేట్రికల్ రిలీజ్ కు అంగీకరించడం లేదు. దీంతో మైత్రి అధినేతలు హిందీ డబ్బింగ్ హక్కులు కొనుక్కున్న వ్యక్తితో డిస్కషన్లు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అవి ఫలించలేదని.. ఈ సినిమాను యూట్యూబ్ లోనే రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు.
హిందీ వెర్షన్ కూడా థియేటర్లో విడుదల చేయాల్సిందే అంటూ ట్విట్టర్ లో రచ్చ చేశారు. వారి కోరిక ప్రకారమే.. 'పుష్ప' హిందీ వెర్షన్ థియేటర్లోనే రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. గోల్డ్ మైన్ ఫిలిమ్స్ సంస్థ 'పుష్ప' హిందీ హక్కులను దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా గోల్డ్ మైన్ ఫిలిమ్స్ వాళ్లతో చర్చల్లో పాల్గొంటున్నారట. త్వరలోనే డీల్ ను క్లోజ్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం హిందీ వెర్షన్ కు సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయట. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలను వీలైనంత త్వరగా చిత్రీకరించి చెప్పిన టైంకి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దర్శకుడు సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ పనుల్లో చాలా బిజీగా గడుపుతున్నారు.
Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
Also Read: బండ్ల గణేష్... పవన్‌ను జాగ్రత్తగా చూసుకుంటావా?
Also Read: పాట కష్టం తెలిసినోడు... కొన్నేళ్లుగా రాయనోడు... మళ్లీ పవన్ కోసం రాశాడు!
Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!
Also read: ‘సూర్యవంశీ’ స్క్రీనింగ్ ను అడ్డుకున్న రైతులు... కేంద్రం మీద ఉన్న కోపం అక్షయ్‌పై చూపించారుగా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి