Sundeep Kishan : సందీప్ కిషన్ 'పవర్ పేట' కోసం పాన్ ఇండియా హీరోయిన్?
Ritika Nayak : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మూవీలో మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Ritika Nayak To Lead Pair In Sundeep Kishan Powerpeta Movie : 'ప్రస్థానం'తో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. ఆ తర్వాత అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో వరుస మూవీస్‌తో ఎంటర్టైన్ చేశారు. గతేడాది ఆయన హీరోగా నటించిన 'మజాకా' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఈ ఏడాది పొలిటికల్ యాక్షన్ డ్రామా 'పవర్ పేట'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సందీప్‌తో మిరాయ్ బ్యూటీ?
ఈ మూవీలో సందీప్ సరసన 'మిరాయ్' బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. 'అశోకవనంలో అర్జున కల్యాణం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రితికా... హాయ్ నాన్న మూవీతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత మిరాయ్‌తో బిగ్ సక్సెస్ అందుకున్న ఆమె... ప్రస్తుతం డ్యూయెట్, కొరియన్ కనకరాజు మూవీస్‌లో నటిస్తున్నారు. వీటితో పాటే 'పవర్ పేట'లోనూ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
ఈ మూవీకి రౌడీ ఫెలో, చల్ మోహన్‌రంగ్ మూవీస్ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా... 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తొలుత ఈ భారీ ప్రాజెక్టులో నితిన్‌ను హీరోగా అనుకున్నా... ఆ తర్వాత అనుకోని కారణాలతో సందీప్ వద్దకు వెళ్లింది. తొలుత ఈ మూవీని మూడు పార్టులుగా తెరకెక్కించాలని ప్లాన్ చేసినా... కథలో భారీ స్థాయిలో మార్పులు చేసి ఒకే పార్టుగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రశంసలు - సౌత్ ఇండస్ట్రీపై ఆరోపణలతో విమర్శలు... హీరోయిన్ తాప్సీ యూటర్న్
ప్రస్తుతం సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇది నెట్ ఫ్లిక్స్‌లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటే విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో 'సిగ్మా' మూవీ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మూవీ రూపొందుతోంది. అలాగే, తన సొంత బ్యానర్ వెంకటాద్రి టాకీస్‌లో రెండు మూవీస్ కూడా అనౌన్స్ చేశారు.
























