Prabhas: మారుతితో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
దర్శకుడు మారుతితో ప్రభాస్ సినిమా చేస్తాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారానికి ఓ కారణం ఉంది.
'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ప్రభాస్. అప్పటినుంచి వరుసగా పాన్ ఇండియా కథలనే ఎన్నుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వరుస సినిమాలు లైన్లో పెట్టారు ప్రభాస్. 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కె' ఇలా ప్రభాస్ చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇవి కాకుండా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా కమిట్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే మరో సినిమా చేయబోతున్నారు. ఇన్ని సినిమాలు ఉండగా.. దర్శకుడు మారుతితో ప్రభాస్ సినిమా చేస్తాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
ఈ ప్రచారానికి ఓ కారణం ఉంది. యూవీ క్రియేషన్స్ అంటే మారుతికి సొంత సంస్థ లాంటిది. ఆయన సినిమా తీస్తానంటే.. ఎంత బడ్జెట్ పెట్టడానికైనా ఆ సంస్థ వెనుకాడదు. ఆయనపై అంత నమ్మకం ఉంది. ఇందులో ప్రభాస్ హీరో అంటూ ప్రచారం మొదలుపెట్టారు. మారుతికి ప్రభాస్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో సినిమా జనాలు నిజమేమో అనుకున్నారు. తాజాగా ఈ విషయంపై దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చారు.
ప్రభాస్ తో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయని.. వాటిలో నిజం లేదని తేల్చి చెప్పారు. తనెప్పుడూ కూడా హీరోని దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకోనని.. తన కథకు ఎవరైతే సూట్ అవుతారనిపిస్తుందో వాళ్ల దగ్గరకు వెళ్తానని చెప్పారు. ప్రభాస్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. తనకు కూడా ప్రభాస్ తో సినిమా తీయాలనుందని.. మంచి కథ దొరికితే కచ్చితంగా ఆయనకు చెప్తానని అన్నారు. ఇప్పుడొస్తున్న వార్తల్లో అయితే నిజం లేదని చెప్పుకొచ్చారు.
చిన్న సినిమాలతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మారుతి అతి తక్కువ సమయంలోనే తన సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత నాని, వెంకటేష్, శర్వానంద్ లాంటి హీరోలతో కలిసి పని చేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రస్తుతం చిరు సినిమా కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారు. రీసెంట్ గా మారుతి డైరెక్ట్ చేసిన 'మంచి రోజులు వచ్చాయి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి.
Also Read: బండ్ల గణేష్... పవన్‌ను జాగ్రత్తగా చూసుకుంటావా?
Also Read: పాట కష్టం తెలిసినోడు... కొన్నేళ్లుగా రాయనోడు... మళ్లీ పవన్ కోసం రాశాడు!
Also Read: పెళ్లి కబురు చెప్పిన కార్తికేయ... ఆ తర్వాత కాబోయే భార్యను పిలిచి!
Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!
Also read: ‘సూర్యవంశీ’ స్క్రీనింగ్ ను అడ్డుకున్న రైతులు... కేంద్రం మీద ఉన్న కోపం అక్షయ్‌పై చూపించారుగా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి