Vijay Sethupathi: స్టార్ హీరోని కొడితే రూ.1001 బ‌హుమ‌తి.. ఓపెన్ ఆఫర్..

స్టార్ హీరో విజయ్ సేతుపతిని బాగా కొట్టాలని.. ఎవరైనా అలా చేస్తే 1001 రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తామని ప్రకటించిందిహిందూ మక్కల్ కట్టి సంస్థ. 

FOLLOW US: 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. ఇక్కడ కూడా ఆయనకు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటారు. తనొక స్టార్ అనే విషయాన్ని పట్టించుకోకుండా చాలా ఒదిగి ఉంటారు. అభిమానులతో కూడా ఎంతో సరదాగా మాట్లాడతారు. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే.. వెంటనే స్పందిస్తారు. అలాంటి వ్యక్తిని కొడితే బహుమతులు ఇస్తామని ఓ సంస్థ బహిరంగంగా ప్రకటించింది. 

Also Read: ఎన్టీఆర్... రామ్ చరణ్... నాటు నాటు... ఊర నాటు! ప్రేక్షకులు చిందేసేట్టు!!

రీసెంట్ గా బెంగుళూరు ఎయిర్‌‌పోర్ట్‌లో విజయ్ సేతుపతిపై ఓ వ్యక్తి దాడి చేసినట్లు వార్తలొచ్చాయి. నిజానికి ఆ దాడి విజయ్ సహాయకుడిపై జరగడంతో క్షమాపణలతో విడిచిపెట్టేశారు. అయితే హిందూ మక్కల్ కట్టి సంస్థ మాత్రం విజయ్ పై దాడి జరిగి ఉండాల్సిందని అంటోంది. అతడిని బాగా కొట్టాలని.. ఎవరైనా అలా చేస్తే 1001 రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. స్వాతంత్య్ర సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ ను తను అవమానించాడని.. అలాంటి వ్యక్తిని కొట్టినా తప్పు లేదని.. విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పేవరకు ఇలానే చేస్తామని సదరు సంస్థ ప్రతినిధి అర్జున్ సంపత్ చెప్పుకొచ్చారు. 

అర్జున్ ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత ఎయిర్‌‌పోర్ట్‌లో జరిగిన దాడిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఆగంతుకుడు ఎవరో తాగిన మత్తులో అలా చేశాడని విజయ్ సేతుపతి చెప్పారు కానీ ఈ ప్రకటన చూసిన తరువాత కావాలనే విజయ్ సేతుపతిపై దాడి చేయించి ఉంటారా..? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై స్పందించిన అర్జున్ సంపత్ ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కానీ విజయ్ ని కొడితే మాత్రం కచ్చితంగా బహుమతి ఇస్తామని అంటున్నారు. 

విజయ్ సేతుపతిపై దాడికి పాల్పడిన వ్యక్తితో తాను మాట్లాడానని అర్జున్ సంపత్ అంటున్నారు. నేషనల్ అవార్డు వచ్చినందుకు అతడు వెళ్లి విష్ చేయబోతే విజయ్ సేతుపతి వ్యంగ్యంగా మాట్లాడాడట. తేవర్(దేవుడు) పూజకి రమ్మని పిలిస్తే.. ఈ లోకంలో తనకి తెలిసిన తేవర్ యేసుక్రీస్తు ఒక్కడేనని సేతుపతి సమాధానం చెప్పాడట. అందుకే అతనికి కోపమొచ్చి వాదనకు దిగాడట. కానీ విజయ్ సేతుపతి అలాంటి వ్యక్తి కాదని.. కావాలనే అతడిపై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. 

Also Read: సంక్రాంతి తర్వాతే కొరటాల సెట్స్‌కు యంగ్ టైగర్... పక్కా ప్లాన్ రెడీ

Also Read: సిక్స్‌ప్యాక్‌ బాడీ వల్లే మూడు సినిమా ఛాన్సులు... నాకు ఫిజిక్ అడ్వాంటేజే

Also Read: కందిసేను కాడ... పంపుషెడ్డు కాడ... డాంట‌కు డ‌డ‌న‌! 'బంగార్రాజు' లడ్డుండా!!

Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Nov 2021 03:34 PM (IST) Tags: Vijay Sethupathi Hindu Makkal Katchi star hero vijay

సంబంధిత కథనాలు

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!

NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!

Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?

Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!

NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!