NTR30: సంక్రాంతి తర్వాతే కొరటాల సెట్స్‌కు యంగ్ టైగర్... పక్కా ప్లాన్ రెడీ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'జనతా గ్యారేజ్' వచ్చింది. వీళ్లిద్దరూ మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందంటే?
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా చిత్రీకరణ పూర్తయింది. అందులో ఓ హీరోగా నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ ప్రారంభించారు. మరి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అభిమానులు ఈ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ ఓ సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆయన నటించబోయే సినిమా అదే.
ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉంది. అంతకు ముందు మరో సినిమా కూడా చేశారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'బృందావనం' సినిమాకు కొరటాల రచయిత. అందువల్ల, వీళ్లిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా కోసం ఇటు ప్రేక్షకులు, అటు అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇది ఎన్టీఆర్ 30వ సినిమా. ఆల్రెడీ కొరటాల బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం. అయితే... రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరో మూడు నెలలు పడుతుంది.
జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' విడుదల కానుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషనల్ కార్యక్రమాలకు ఎక్కువ రోజులు కేటాయించాలి. సినిమా విడుదలైన తర్వాత పండగ. అప్పుడు కొన్ని రోజులు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాతే సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని ఎన్టీఆర్, కొరటాల శివ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే జనవరి సెకండాఫ్ లేదంటే ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇందులో కథానాయిక ఎవరనేది అధికారికంగా ప్రకటించలేదు.
AlsoRead: సిక్స్‌ప్యాక్ బాడీ వల్లే మూడు సినిమా ఛాన్సులు... నాకు ఫిజిక్ అడ్వాంటేజే!
Also Read: కందిసేను కాడ... పంపుషెడ్డు కాడ... డాంటకు డడన! 'బంగార్రాజు' లడ్డుండా!!
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..
Also Read: మహేష్ బరువు బాధ్యతలు తీసుకుంటాడా? చూద్దామంటున్న నాగార్జున!
Also Read: మారుతితో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Also Read: ఖం... ఖం... ఖంగుమంది 'అఖండ' శంఖం! ధర్మభేరి శబ్దం... చెయ్యమంది యుద్ధం!
Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
Also Read: బండ్ల గణేష్... పవన్‌ను జాగ్రత్తగా చూసుకుంటావా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి