Eternals: దెయ్యాలతో కలిసి జీవించిన 'ఎటర్నల్స్' ఫేమ్.. చివరకు ఏం చేసిందంటే..?
ప్రముఖ హాలీవుడ్ నటి తను చాలా ఏళ్లపాటు దెయ్యలతో కలిసి జీవించానని చెబుతోంది. చివరకు ఒకరోజు వాటిని తరిమేయడం కోసం ఓ వ్యక్తి సహాయం తీసుకున్నానని.. వాటి నుంచి విముక్తి పొందానని చెబుతోంది.
దెయ్యాలు, భూతాలు అంటే ఒకప్పుడు నమ్మేవాళ్లేమో కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది కొట్టిపారేస్తున్నారు. సినిమాల్లో తప్ప రియల్ లైఫ్ లో అలాంటివేవీ ఉండవని చెబుతారు. కానీ ఇప్పటికీ కూడా దెయ్యాలున్నాయని నమ్మేవాళ్లు కొందరు ఉన్నారు. ప్రముఖ హాలీవుడ్ నటి తను చాలా ఏళ్లపాటు దెయ్యలతో కలిసి జీవించానని చెబుతోంది. చివరకు ఒకరోజు వాటిని తరిమేయడం కోసం ఓ వ్యక్తి సహాయం తీసుకున్నానని.. వాటి నుంచి విముక్తి పొందానని చెబుతోంది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: స్టార్ హీరోని కొడితే రూ.1001 బహుమతి.. ఓపెన్ ఆఫర్..
ఇటీవల విడుదలైన 'ఎటర్నల్స్' సినిమాలో నటించిన సల్మా హాయక్ సూపర్ హీరోగా తన నటనతో ఆకట్టుకుంది. రీసెంట్ గా ఓ షోలో పాల్గొన్న ఆమె.. తన లండన్ ఇల్లు దెయ్యలతో నిండిపోయిందని చెప్పారు. ఇంట్లో తాను ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల గురించి.. దెయ్యాలను తరిమేసిన విషయం గురించి వెల్లడించారు. తన ఇంట్లో ఎన్నో వింత సంఘటనలు జరిగేవని.. పియానో దానంతట అదే మోగేదని, మూడో అంతస్థులో ఉన్న లైట్లు వెలిగి ఆరిపోతూ ఉండేవని చెప్పింది.
మొదట్లో ఇవన్నీ చూసి భయపడినట్లు.. ఇదంతా దెయ్యాల పనే అని అర్ధమైనట్లు చెప్పింది. కానీ వాటిని ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదని చెప్పింది. ఈ బాధ నుంచి బయట పడడానికి ఓ వ్యక్తిని తీసుకువచ్చానని.. ఆయనకు కూడా దెయ్యం కనిపించలేదని తెలిపింది. కానీ విచిత్ర సంఘటనలు మాత్రం చోటుచేసుకునేవని చెప్పింది. చివరకు దెయ్యాలను తరిమే వ్యక్తి తీసుకొచ్చానని.. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ వాటిని ఇంటి నుంచి తరిమేశాననే తృప్తి కలుగుతుందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు భయం తగ్గి చాలా ప్రశాంతంగా ఉంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఎన్టీఆర్... రామ్ చరణ్... నాటు నాటు... ఊర నాటు! ప్రేక్షకులు చిందేసేట్టు!!
Also Read: సంక్రాంతి తర్వాతే కొరటాల సెట్స్‌కు యంగ్ టైగర్... పక్కా ప్లాన్ రెడీ
Also Read: సిక్స్‌ప్యాక్ బాడీ వల్లే మూడు సినిమా ఛాన్సులు... నాకు ఫిజిక్ అడ్వాంటేజే
Also Read: కందిసేను కాడ... పంపుషెడ్డు కాడ... డాంటకు డడన! 'బంగార్రాజు' లడ్డుండా!!
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి