Ramesh Babu: మహేష్‌బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూత
సూపర్ సార్ట్ కృష్ణ తనయుడు, ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు శనివారం మరణించారు.
సూపర్ సార్ట్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు శనివారం రాత్రి ఆరోగ్య సమస్యలతో మరణించారు. లివర్ సంబంధిత వ్యాధితో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు.
బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, కృష్ణ గారి అబ్బాయి సహా పలు సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. అయితే ఇండస్ట్రీలో కథానాయకుడిగా మాత్రం రాణించలేకపోయారు. అల్లూరి సీతారామరాజు సినిమాతో బాల నటుడిగా ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1987లో వచ్చిన సామ్రాట్‌తో హీరోగా మారారు. 1997లో సూర్యం సినిమా తర్వాత ఆయన అస్సలు సినిమాల్లో నటించలేదు.
అయితే సినిమాల్లో నటించడం ఆపేసినా.. తర్వాత నిర్మాతగా కొనసాగారు. మొదట సూర్య వంశం(హిందీ)కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాను సోలోగా నిర్మించారు. అతిథి సినిమాను యూటీవీ భాగస్వామ్యంతో నిర్మించిన రమేష్ బాబు.. దూకుడు, ఆగడు చిత్రాలకు సమర్పకుడిగా కూడా ఉన్నారు.
#Krishna Gari elder Son, #MaheshBabu's elder Brother #RameshBabu Garu passes away.
— BA Raju's Team (@baraju_SuperHit) January 8, 2022
May his soul rest in peace.
Deepest condolences to the family @urstrulyMahesh pic.twitter.com/fERxUrByNw
#Superstar #Krishna 's elder son and Actor @urstrulyMahesh 's elder brother #RameshBabu passed away in Hyderabad..
— Ramesh Bala (@rameshlaus) January 8, 2022
He was 56 and was getting treated for liver ailment..
May his soul RIP!
Condolences to Ghattamaneni family.. pic.twitter.com/gkgpnkPqpZ
Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..