అన్వేషించండి
Deepika Padukone: నా మైండ్ పని చేయలేదు.. గుర్తుపట్టలేనంతగా మారిపోయా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్..
కరోనా ఎటాక్ తరువాత తన జీవితం మారిపోయిందని.. కోవిడ్ బారిన పడిన తరువాత తన శరీరంలో చాలా మార్పులొచ్చాయని చెప్పింది దీపికా పదుకోన్.

స్టార్ హీరోయిన్ కామెంట్స్..
కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది స్టార్స్ కోవిడ్ బారిన పడ్డారు. వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కూడా ఉంది. ఆమెతో పాటు తన తండ్రి ప్రకాష్, తల్లి ఉజ్జల, సోదరి అనీషా ఇలా కుటుంబం మొత్తం కోవిడ్ బారిన పడింది. ఆ సమయంలో తను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తాజాగా ఓ ఇంటర్వూలో వెల్లడించింది దీపికా పదుకోన్.
కరోనా ఎటాక్ తరువాత తన జీవితం మారిపోయిందని.. కోవిడ్ బారిన పడిన తరువాత తన శరీరంలో చాలా మార్పులొచ్చాయని చెప్పింది. తనకు వేసుకున్న మందులు, తనకిచ్చిన స్టెరాయిడ్స్ వలనో కానీ గుర్తుపట్టలేనంతగా మారిపోయానని చెప్పింది. కోవిడ్ చాలా భయంకరమైందని అప్పటిరోజులను గుర్తుచేసుకుంది. కోవిడ్ సోకినప్పుడు పెద్దగా భయపడలేదు కానీ.. దాని నుంచి బయటపడ్డ తరువాత అసలు మైండ్ పని చేయలేదని చెప్పింది. అందుకే రెండు నెలలు షూటింగ్స్ కి బ్రేక్ చెప్పానని.. అది తన లైఫ్ లో చాలా డిఫికల్ట్ ఫేజ్ అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం దీపికా పదుకోన్ 'గెహ్రాయాన్' అనే సినిమాలో నటిస్తోంది. శకున్ బాత్రా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే వంటి తారలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రాగా.. అది బాగా వైరల్ అయింది. ఇక త్వరలో ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది దీపికా పదుకోన్. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో దీపికాను హీరోయిన్ గా తీసుకున్నారు.
View this post on Instagram
Also Read:'బంగార్రాజు' కష్టాలు.. చెప్పిన టైంకి వస్తాడా..?
Also Read: షూటింగ్ క్యాన్సిల్.. ఇంట్లోనే చిల్ అవుతోన్న రౌడీ హీరో..
Also Read: క్లాసులు షురూ.. ధనుష్ 'సార్' ఆన్ డ్యూటీ..
Also Read: కోవిడ్ పాజిటివ్ వైఫ్.. నితిన్ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేశాడో చూశారా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
హైదరాబాద్





















