Nindu Noorella Saavasam Serial Today February 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీ ఇంటికొచ్చిన ఆనందంలో పిల్లలు – అయోమయంలో మనోహరి
Nindu Noorella Saavasam serial Today Episode February 26th: భాగీ ఇంటికి వచ్చిందన్న ఆనందంలో పిల్లలుంటే.. మనోహరి మాత్రం అయోమయంలో పడిపోతుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీని అమర్ తిట్టి పైకి వెళ్లగానే.. ఇంట్లో ఎక్కడ ఉండాలో అయోమయంగా ఉన్న భాగీని తన రూంలోకి బలవంతంగా తీసుకెళ్తుంది మనోహరి. దీంతో భాగీ తనను ఎందుకు ఈ రూంలోకి తీసుకొచ్చావు అని అడుగుతుంది.
మనోహరి: ఇక నుంచి ఇది నా రూం కాదు భాగీ నీ రూమే అనుకో.. నీ రూమే అని వాడుకో
భాగీ: మరి నువ్వెక్కడుంటావు మనోహరి
మనోహరి: నేను కూడా ఇక్కడే ఉంటాను
భాగీ: అంటే నేను నీతో రూం షేర్ చేసుకోవాలా..?
మనోహరి: అవును షేర్ చేసుకోవాలి..
భాగీ: నో నేను నీతో రూం షేర్ చేసుకోలేను మనోహరి. బెడ్ కూడా షేర్ చేసుకోలేను.
మనోహరి: ఏమైంది భాగీ ఎందుకు
భాగీ: ఇప్పటికే నీ నుంచి నేను చాలా తీసుకున్నాను మనోహరి. ఆయన్ని తీసుకున్నాను.. పిల్లలను తీసుకున్నాను.. ఈ ఆస్థిని తీసుకున్నాను.. ఇప్పుడు ఈ రూం కూడా తీసుకోవాలా..?
చంభా: (మనసులో) అందుకేగా నువ్వు తిరిగి వచ్చావు
భాగీ: నో మనోహరి నో నా వల్ల కాదు..
మనోహరి: ఇట్స్ ఓకే భాగీ ఇట్స్ ఓకే నువ్వు తీసుకున్నవన్నీ నాకు తిరిగి ఇవ్వడానికే కదా వచ్చావు
భాగీ: అందుకే వచ్చాను. నీ రూం వాడుకోవాలి అంటే నాకెందుకో గిల్టీగా ఉంది మనోహరి
మనోహరి: భాగీ నేనేం ఫీల్ అవ్వడం లేదులే ఈ రూం కాదు ఈ ఇల్లే నీది అనుకో
భాగీ: ఇది నా ఇల్లే కదా
మనోహరి: ఏంటి ఏమన్నావు..?
భాగీ: అంటే ఒకప్పుడు ఇది నా ఇల్లే కదా అంటున్నాను.. కానీ ఇప్పుడు నీ ఇల్లు కాబోతుంది. ఈ ఇల్లు, ఆయన, పిల్లలు నీ సొంతం కాబోతున్నారు
చంభా: (మనసులో) ఈ మనోహరి తను అంత డైరెక్టుగా చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది. ఏంటో ఈ మనోహరి
మనోహరి: ఏనీవే.. థాంక్యూ భాగీ.. నాకు అమర్‌కు పెళ్లి చేసే వరకు నువ్వు అమర్‌తో గొడవ పడకుండా ఉండవా ఫ్లీజ్..
భాగీ: ఆయనతో గొడవ పడాలని నాకు మాత్రం ఉంటుందా..? చెప్పు ఏం చేస్తాం..
చంభా:(మనసులో) అవును అవును మీ ఆయనతో మళ్లీ కలిసిపోవాలని వచ్చావు అంతే కదా..?
భాగీ: కాకపోతే నువ్వు ఫీల్ అవ్వకపోతే నీ ఫ్రెండ్ గా నీ రూం వాడుకోవాలంటే నాకేదో గిల్టీగా ఉంది
మనోహరి: పోనీ నేను యాదమ్మ రూంకు వెళ్తానులే నువ్వు ఒక్కదానివే ఈ రూంలో ఉండొచ్చులే
చంభా: మనోహరి మేడం అది సర్వెంట్ రూం చాలా చిన్నది
మనోహరి: పర్వాలేదులే యాదమ్మ భాగీ కోసం నేను అర్జెస్ట్ అవుతానులే..
చంభా: అంటే నేను బెడ్ మీద మీరు కింద పడుకోవడం బాగోదు కదా మేడం (మనోహరి కోపంగా చూస్తుంది.) ఓకే మేడం మీరే బెడ్డు మీద పడుకోండి నేనే కింద పడుకుంటాను..
మనోహరి: భాగీ ప్రాబ్లమ్ సాల్వ్ నువ్వు ఈ రూంలోనే ఉండు.. నేను యాదమ్మ ఆ రూంలో ఉంటాము.
భాగీ: థాంక్యూ మనోహరి నీది ఎంత పెద్ద మనసో
మనోహరి: పర్వాలేదు భాగీ సరే కాసేపు రెస్ట్ తీసుకుని నువ్వు వచ్చిన పని మీద దృష్టి పెట్టు..
అంటూ మనోహరి, చంభా వెళ్లిపోతారు. భాగీ మాత్రం కోపంగా పిచ్చి పుల్లమ్మ నిన్ను నీ రూం నుంచి సర్వెంట్ రూంకు తరిమేశాను. అని మనసులో అనుకుంటుంది. అప్పుడే పిల్లలు, రాథోడ్ వస్తారు. మనోహరిని చంభా రూంకు వెళ్లేలా చేసినందుకు భాగీతో కలిసి నవ్వుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!























