అన్వేషించండి
Advertisement
Swara Bhasker: 'చచ్చిపో.. నీకు నరకంలో కూడా చోటుండదు..' కోవిడ్‌తో బాధపడుతున్న హీరోయిన్‌కు శాపనార్థాలు..
కోవిడ్‌తో బాధపడుతున్న హీరోయిన్‌కు శాపనార్థాలు పెడుతున్నారు.
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ తరచూ ట్రోలింగ్ కి గురవుతుంటుంది. ఆమె చేసే వ్యాఖ్యలు, నటించిన కొన్ని పాత్రల కారణంగా నెటిజన్లు చాలా సార్లు ఆమెను ట్రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి స్వరాను టార్గెట్ చేశారు. ఈసారి ఏకంగా ఆమె చనిపోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల తను కరోనా బారిన పడినట్లు పోస్ట్ పెట్టింది స్వరా.
ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పింది. కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా టెస్ట్ లు చేయించుకోవాలని సూచించింది. అందరూ డబుల్ మాస్క్ వేసుకొని సురక్షితంగా ఉండాలని.. ఇప్పటికే డబుల్ వ్యాక్సిన్ వేయించుకున్నందున త్వరలోనే నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పింది.
ఇది చూసిన కొందరు నెటిజన్లు ఆమెని కావాలనే టార్గెట్ చేస్తూ పలు కామెంట్స్ చేశారు. 'చచ్చిపో.. నీకు నరకంలో కూడా చోటుండదు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'త్వరగా నరకానికి పోయి.. ఈ భూమికి ఉన్న భారాన్ని తగ్గించు' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా ఒక్కొక్కరూ స్వరా భాస్కర్ పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.
ఈ పోస్ట్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన స్వరా.. 'ఫ్రెండ్స్.. మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోండి.. నిజంగా నాకేమైనా అయితే మీ జీవనాధారాన్ని కోల్పోతారు.. అప్పుడు ఇంటిని ఎలా నడిపిస్తారు..?' అంటూ కౌంటర్ వేసింది.
And to my dear Nafrati Chintus and trolls praying for my demise.. doston apni bhaavnaaein kaabooo mein rakho.. mujhey kuch ho gaya toh aapki rozi roti chhin jaaegi.. ghar kaisey chalega ?!? 😬🤷🏾♀️🤗 pic.twitter.com/Tx7mq3zQOD
— Swara Bhasker (@ReallySwara) January 7, 2022
Also Read:'బంగార్రాజు' కష్టాలు.. చెప్పిన టైంకి వస్తాడా..?
Also Read: షూటింగ్ క్యాన్సిల్.. ఇంట్లోనే చిల్ అవుతోన్న రౌడీ హీరో..
Also Read: క్లాసులు షురూ.. ధనుష్ 'సార్' ఆన్ డ్యూటీ..
Also Read: కోవిడ్ పాజిటివ్ వైఫ్.. నితిన్ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేశాడో చూశారా..?
Also Read: 'హృదయమా' ఫస్ట్ సింగిల్.. రిలీజ్ చేసిన మహేష్ బాబు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
వరంగల్
రైతు దేశం
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement