Jailer 2 OTT Release Date : జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Jailer 2 OTT Platform : రజనీ కాంత్ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'జైలర్ 2'. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Rajinikanth's Jailer 2 OTT Release Date Locked : తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'జైలర్ 2' (Jailer 2). అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకూ రూ.755 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకోగా... నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 2023లో వచ్చిన 'జైలర్' మూవీకి ఇది సీక్వెల్.
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వం వహించగా... రజనీ కాంత్‌తో (Rajinikanth) పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విద్యా బాలన్, ఎస్.జే. సూర్య, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.
View this post on Instagram
స్టోరీ ఏంటంటే?
ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయ్యిందో అక్కడి నుంచే రెండో పార్ట్ కూడా ప్రారంభమవుతుంది. విగ్రహాల అక్రమ రవాణాలో తన కొడుకు భాగమయ్యాడని తెలుసుకున్న ముత్తువేల్ పాండియన్ (రజనీ కాంత్) అతన్ని చంపేస్తాడు. ఇందులో కీలకమైన వర్మను కూడా చంపిన తర్వాత తన ఫ్యామిలీతో ఓ మారుమూల ప్రాంతంలో సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఇదే టైంలో వర్మను చంపిన వ్యక్తిని పట్టుకునేందుకు కేరళలోని దిలీప్ (సూరజ్ వెంజరమూడు) మనుషులు వెతుకుంటారు.
దిలీప్ వెనుక, విగ్రహాల స్మగ్లింగ్ వెనుక గోవాలోని చక్రి కల్పక్ (మిథున్ చక్రవర్తి) ఫ్యామిలీ ఉందని టైగర్ ముత్తువేల్ తెలుసుకుంటాడు. విగ్రహాలతో కూడిన తమ మూడు కంటైనర్లు ఇవ్వమని లేదంటే కుటుంబాన్ని అంతం చేస్తామని ముత్తువేల్‌కు కల్పక్ ఫ్యామిలీ బోధి కల్పక్ (ఎస్.జె. సూర్య), కుమార్తె కాంత (విద్యా బాలన్) వార్నింగ్ ఇస్తారు. స్నేహితుడు (శివరాజ్ కుమార్) మీద ఎటాక్ చేసి అతని భార్య, పిల్లల్ని బంధిస్తారు. అప్పుడు టైగర్ ముత్తువేల్ పాండ్యన్ ఏం చేశారు? స్నేహితుడి కుటుంబంతో పాటు తన కుటుంబాన్ని ఎలా కాపాడాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Janhvi Kapoor : 'పెద్ది' వివాదం... అచ్చియమ్మ రోల్‌పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























