Mahesh Babu: 'మేజర్' సినిమాపై బన్నీ ప్రశంసలు - మహేష్ బాబు రియాక్షన్
'మేజర్' సినిమా చూసిన సామాన్య ప్రేక్షకులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఆయన పాత్రలో అడివి శేష్ కనిపించరు. శశికిరణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.
ఈ సినిమా చూసిన సామాన్య ప్రేక్షకులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా యూనిట్ ని పొగుడుతూ ట్విట్టర్ వేదికగా కొన్ని కామెంట్స్ చేశారు. మనసుని హత్తుకునేలా సినిమా తీశారని.. మ్యాన్ ఆఫ్ ది షో అడివి శేష్ అంటూ ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇది చూసిన మహేష్ బాబు.. అల్లు అర్జున్ కి రిప్లై ఇస్తూ.. 'మేజర్ లాంటి యంగ్ టీమ్ ని ప్రోత్సహించడం అభినందనీయం. ఈ సినిమా మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది' అంటూ బదులిచ్చారు. అల్లు అర్జున్ తో పాటు సల్మాన్ ఖాన్, నాని లాంటి హీరోలు కూడా ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. ఈ సినిమాను మహేష్ బాబుతో పాటు సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మించాయి. అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు.
Also Read: సీఎంను కలిసిన నయనతార, విఘ్నేష్ శివన్
Also Read: కావాలనే గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తుంటా - నజ్రియా కామెంట్స్
Thank you @alluarjun! Your words will surely encourage the young team of #Major. Happy to know that you loved the film ♥️ https://t.co/UVLHEQygcg
— Mahesh Babu (@urstrulyMahesh) June 5, 2022
View this post on Instagram