By: ABP Desam | Updated at : 05 Jun 2022 02:50 PM (IST)
కావాలనే గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తుంటా
మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ కి భారీ క్రేజ్ ఉంది. 'రాజారాణి' సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసినప్పుడు ఆమె క్యూట్ లుక్స్ కి, పెర్ఫార్మన్స్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆమె టాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా..? అని ఆసక్తిగా ఎదురుచూశారు. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే తన మాతృభాషలో కూడా నజ్రియా పెద్దగా సినిమాలు చేయడం లేదు. అప్పుడెప్పుడో 2014లో సినిమాలు చేసిన ఆ తరువాత నాలుగేళ్లు ఎక్కడా కనిపించలేదు.
2018లో ఓ సినిమా చేసి మరో రెండేళ్లు గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు 2022లో మళ్లీ సినిమా చేస్తోంది. నజ్రియా ఇలా లాంగ్ గ్యాప్స్ ఎందుకు తీసుకుంటుందో తాజాగా వెల్లడించింది. ఓ సినిమా పూర్తయిన తరువాత కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని అనుకుంటుందట నజ్రియా. అది కాస్తా రెండేళ్లు అయిపోతుందని చెప్పింది.
చాలా కథలు రిజెక్ట్ చేస్తానని అనుకుంటారని.. కానీ అందులో నిజం లేదని చెప్పింది. కొంతమంది దర్శకుడు వచ్చి స్క్రిప్టులు చెబుతుంటారని.. ఆ సమయంలో తను సినిమాలు చేసే మూడ్ లో ఉండనని.. కొన్ని సార్లు ట్రావెలింగ్ లో ఉంటానని చెప్పుకొచ్చింది. పెర్సనల్ లైఫ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తానని.. అందుకే తక్కువగా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది.
స్క్రిప్ట్స్ విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటానని.. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే తనకు కథలు వినిపిస్తారని నజ్రియా తెలిపింది. అందుకే తన కెరీర్ లో గ్యాప్స్ ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఎన్ని బ్రేక్స్ తీసుకున్నా.. తనను ఇష్టపడే వారు ఇంకా ఉన్నారని.. అది తన అదృష్టమని చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల్లో 'అంటే సుందరానికి' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ బ్యూటీ. నాని హీరోగా నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Bigg Boss 7 Telugu: శివాజీకి వార్నింగ్ ఇచ్చిన అమర్ - నేను కెప్టెన్ అంటూ అరుపులు, ప్రేక్షకులకు సహన పరీక్ష
Brahmamudi December 8th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్ : నిమ్మచెట్టు బతికుంటేనే దోషం పోయినట్లు అని చెప్పిన పంతులు - కనకం షాకింగ్ ప్లాన్
Bigg Boss 7 Telugu: టాస్కులో ఫిజికల్ అయిన శోభా, యావర్! ఛీ, తూ అంటూ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు
Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌ను కొరికిన అమర్ - చెప్పుతో కొడతానంటూ సైగలు, చివరికి..
Nindu Noorella Saavasam December 8th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: నిజం తెలుసుకుని నిర్గాంతపోయిన కాళీ - హాస్పిటల్లోకి ప్రవేశించిన ఘోర!
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
/body>