Nayanthara Meets TN CM: సీఎంను కలిసిన నయనతార, విఘ్నేష్ శివన్
నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి.. తమ పెళ్లికి ఆహ్వానించారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. తన ప్రియుడు, డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో నయన్ కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటివరకు నయన్, విఘ్నేష్‌లు తమ పెళ్లి గురించి బహిరంగంగా ప్రకటించలేదు. అయితే, అప్పుడప్పుడు చిన్న చిన్న హింట్స్ ఇస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. వారిద్దరూ తిరుపతిలో నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలని తొలుత భావించారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అనుమతి ఇవ్వలేదని తెలిసింది. దీంతో వారు తమ పెళ్లి వేదికను మహాబలిపురానికి షిఫ్ట్ చేశారు.
నయనతార, విఘ్నేష్ శివన్‌లు శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశారు. తమ శుభలేఖను సీఎంకు అందించి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్టాలిన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నయన్, విఘ్నేష్‌లకు ఆయన కుమారుడు, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కూడా శుభాకాంక్షలు తెలిజేశారు. ఉదయనిధి, నయనతార కలిసి గతంలో ‘శీనుగాడి లవ్ స్టోరీ’ (తమిళంలో ‘ఇదు కతిర్వేలన్ కాదల్’) సినిమాలో నటించారు.
Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
నయన్, విఘ్నేష్‌లు సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో గతేడాది ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని విఘ్నేష్ తల్లిదండ్రులు వారిని కోరారు. అయితే, టీటీడీ ఇందుకు అనుమతించలేదు. సెలబ్రిటీ కావడంలో సెక్యూరిటీ సమస్యలు వస్తాయనే కారణంతోపాటు, నయనతార వేరే మతానికి చెందినది కావడంతో అనుమతి లభించలేదని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో నయన్-విఘ్నేష్‌లు తమ పెళ్లి వేదికను మహాబలిపురంలోని మహాబ్ హోటల్‌కు మార్చుకున్నారు. ఈ నెల 9న హిందూ సాంప్రదాయంలో వీరి పెళ్లి జరగనుంది. జూన్ 8న రిసెప్షన్ జరగనున్నట్లు సమాచారం. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిసింది.
Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
View this post on Instagram