(Source: ECI/ABP News/ABP Majha)
Hansika's '105 Minutes': హన్సికను గొలుసులుతో బంధించి... తల్లకిందులుగా వేలాడదీసి!
'దేశముదురు' నుంచి 'తెనాలి రామకృష్ణ బిఎ బిల్' వరకూ... తెలుగులో హన్సిక గ్లామర్ హీరోయిన్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఆమెలో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు '105 మినిట్స్' దర్శక-నిర్మాతలు.
హన్సిక... గ్లామర్ హీరోయిన్. దర్శక నిర్మాతలు ఆవిడను అలాగే చూపించారు. గ్లామర్ రోల్స్ ఇచ్చారు. అయితే... అవకాశం రావాలే గానీ తనలో మరో కోణాన్ని కూడా చూపిస్తానని హన్సిక అంటున్నారు. అందుకు '105 మినిట్స్' సినిమాతో కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నారు. సింగిల్ క్యారెక్టర్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. హన్సిక తప్ప సినిమాలో మరొకరు లేదు. సినిమాలో మరో స్పెషాలిటీ ఏంటంటే... సింగిల్ షాట్. సినిమా అంతా ఒక్కటే షాట్‌లో ఉంటుందట. దీపావళి సందర్భంగా సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ చేతుల మీదుగా గ్లింప్స్ విడుదలైంది.
హన్సికను కాళ్లకు గొలుసులు కట్టి బంధించడం... తల్లకిందులుగా వేలాడదీయడం... అద్దాల గదిలో బంధించడం వంటివి చూస్తుంటే... సినిమా కొత్తగా ఉండేలా ఉంది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, ప్రజెంట్ ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని దర్శకుడు రాజు దుస్సా, నిర్మాత బొమ్మక్ శివ చెబుతున్నారు. సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలిపారు.
Here's the glimpse of India's First Single Shot, Single Character film #105Minuttess ⚡ing @ihansika as the lead💥
— KK Senthil Kumar ISC (@DOPSenthilKumar) November 4, 2021
All The Very Best To Team105.
▶️https://t.co/qHN6F3eP9R@rcelluloidoffl @bommakshiva999 @rajudussa105 @durgakishore11 @SamCSmusic @brahmakadali
గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత కె.కె. సెంథిల్ కుమార్ మాట్లాడుతూ "హాలీవుడ్‌లో సింగిల్ షాట్ సినిమాలు ఉన్నాయి. వాటికి నేను ఫ్యాన్. తెలుగులో మనవాళ్లు ఎవరూ ఆ విధంగా ప్రయత్నించడం లేదని అనుకుంటున్నాను. ఈ సమయంలో రాజు '105 మినిట్స్ చేశారు. గ్లింప్స్ చూశా. ఉత్కంఠ కలిగించేలా ఉంది. కథ, కథనాలు అదే విధంగా ఉంటాయని విన్నాను. సింగిల్ షాట్‌లో సినిమా తీయడం ఎంత కష్టమో... ఓ టెక్నీషియన్‌గా నాకు తెలుసు. ఇటువంటి సినిమాలు తీయడం రిస్క్. సినిమా హిట్టయ్యి అందరికీ మంచి పేరు, డబ్బలు తీసుకురావాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.
తొలి సినిమా 'దేశముదురు' నుంచి 'తెనాలి రామకృష్ణ బిఎ బిల్' వరకూ... హన్సిక మోత్వానీ కథానాయికగా నటించిన తెలుగు సినిమాలు చూస్తే ఓ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడూ ప్రయోగాల జోలికి వెళ్లలేదు. కమర్షియల్ కథానాయికగా, అందంగా కనిపించారు. తమిళంలో హారర్ సినిమాలు చేశారు గానీ... తెలుగులో చేయలేదు. నటిగా 50 సినిమాలు పూర్తి చేశాక... ఇప్పుడు ప్రయోగాల బాట పట్టినట్టు ఉన్నారు. '105 మినిట్స్' గ్లింప్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!
Also Read: ఎనిమీ రివ్యూ: ఈ ఎనిమీ.. యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తాడు
Also Read: ఒక్క పాటకు వెయ్యి మందితో... అల్లు అర్జున్ తగ్గేదే లే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి