By: ABP Desam | Updated at : 04 Nov 2021 04:24 PM (IST)
'పుష్ప' పాట చిత్రీకరణలో అల్లు అర్జున్
'పుష్ప: ద రైజ్' సాంగ్స్ పిక్చరైజేషన్ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత మాత్రం 'తగ్గదే లే' అంటున్నారు. సాధారణంగా తన సినిమాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ పిక్చరైజేషన్ విషయంలో అల్లు అర్జున్ కేర్ తీసుకుంటారు. డ్రస్సింగ్ దగ్గర నుండి డాన్స్ స్టెప్స్ వరకూ చాలా కొత్తగా ఉండేలా ట్రై చేస్తారు. ఇప్పుడు 'పుష్ప'తో పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేసిన సంగతి తెలిసిందే. అందుకని, మరింత ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు.
ప్రస్తుతం 'పుష్ప'లో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. అక్షరాలా వెయ్యి మంది డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులతో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. వెండితెరపై ఈ పాట అభిమానులకు పండగలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పాటలో అల్లు అర్జున్ 'AAI 666' బండి డ్రైవ్ చేస్తూ కనిపించారు. 'AA' అంటే అల్లు అర్జున్ అని కూడా అనుకోవచ్చు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో సాంగ్ పిక్చరైజేషన్ కోసం స్పెషల్ సెట్ వేశారని టాక్. రాయలసీమ వాతావరం తలపించేలా ఆర్ట్ డైరెక్టర్లు మౌనిక, రామకృష్ణ సెట్స్ రూపొందించారట. దర్శకుడు సుకుమార్ లాస్ట్ సినిమా 'రంగస్థలం'కు సైతం వాళ్లిద్దరూ ఆర్ట్ డైరెక్టర్లుగా పని చేశారు.
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో... ఆయన సరసన శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్న నటిస్తున్నారు. ఇప్పటివరకూ సినిమాలో మూడు పాటలను విడుదల చేశారు. 'దాక్కో దాక్కో మేక...'లో ఫిలాసఫీ వినిపిస్తే... 'శ్రీవల్లీ' పాట కథానాయికను కథానాయకుడు వర్ణిస్తూ సాగింది. హీరోను తన భర్తగా ఊహించుకుంటూ హీరోయిన్ పాడే పాటగా 'సామి సామి' ఉంది. డిసెంబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది. హిందీ వెర్షన్ విడుదల విషయంలో సమస్యలు తలెత్తాయని వదంతులు వినిపిస్తున్నాయి. దీనిపై సినిమా యూనిట్ పెదవి విప్పడం లేదు.
Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!
Also Read: ఎనిమీ రివ్యూ: ఈ ఎనిమీ.. యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తాడు
Also Read: హన్సికను గొలుసులుతో బంధించి... తల్లకిందులుగా వేలాడదీసి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Pathaan BO Collections, Day 5: ఐదు రోజుల్లో రూ.500 కోట్లు అవుట్ - కొత్త రికార్డులు రాస్తున్న పఠాన్!
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం
Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!