Guppedantha Manasu October 28th Update: రిషి కన్నీళ్లు చూసి కరిగిపోయిన వసు, ఈగో మాస్టర్ ముందు దేవయానిని బుక్ చేసిన వసుధార
Guppedantha Manasu October 28th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu October 28th Today Episode 593)
రిషి.. గౌతమ్ గదిలో కూర్చుని ఎందుకురా నాకే ఇలా జరుగుతుంది నా జీవితంలో మా డాడ్ కన్న నాకు ఎవరు ఎక్కువ కాదు. ఒక రెండు అక్షరాలు నా చిన్ననాటి సంతోషాన్ని పోగొట్టాయి. చిన్నప్పుడు ఆ రెండు అక్షరాల కోసం నేను ఎంతో తపన పడ్డాను కానీ దొరకలేదు ఇప్పుడు అవే రెండు అక్షరాలు నన్ను వాళ్లకి దూరం చేశాయి. నా జీవితంలో ప్రతి ఒక దశలో ఏదో ఒకటి కోల్పోతూనే ఉన్నాను ఇంక నా జీవితంలో కోల్పోవడానికి ఏం మిగిలింది.. వసుధార తన ప్రేమ...అది కూడా అనేలోగా వసుధార వచ్చి రిషి నోటికి చేయి అడ్డం పెడుతుంది... ( వసు రావడంతో రిషికి తనే గొప్ప ఊరట అనుకుని అక్కడి నుంచి గౌతమ్ వెళ్లిపోతాడు)
వసు: సార్ ఇంకెప్పుడూ ఆ మాట అనొద్దు సార్..కన్నీళ్లు తుడుస్తూ నేను మీ నీడ సార్ నేను ఎక్కడికి వెళ్ళను మీతోనే ఉంటాను, మిమ్మల్ని విడిచి నేనెక్కడికి వెళతాను సార్..రిషిధార బంధం నిలిచిపోతుంది.. మీరంటే నేను నేనంటే మీరు..మీరు ఇంకోసారి ఇలా అంటే ఈ వసుధార తుదిశ్వాస వదులుతుంది..
రిషి: ఏం మాట్లాడుతున్నావ్ వసుధారా..ఇలా మాట్లాడి నన్ను ఇంకా ఎందుకు బాధపడెతాడు...నువ్వు నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నావు కదా మరి ఆ ఒక్క విషయం దగ్గర ఎందుకు అలా మొండి పట్టు పడుతున్నావు ఒకప్పటి రిషిలా కాకుండా నేను కొన్ని మెట్లు దిగాను కదా అది కూడా డాడ్ మీద ప్రేమతో నన్ను ఇంకా అని అనే లోగా..
రిషి: మీ పొగరుకు బుద్ధి లేదు సార్ ...లెండి..మీ గదిలోకి వెళదాం మనశ్సాంతిగా నిద్రపోండి
రిషిని తన గదిలో కూర్చోబెట్టి మెట్ల దగ్గర కూర్చొని బాధపడుతుంది వసు. మరోవైపు గదిలో కూర్చున్న రిషి కూడా బాధపడతాడు.
Also Read: మోనిత కుట్రకు మరోసారి దీప బలి, తనలో రాక్షసుడిని బయటకు తీసిన కార్తీక్
అటు జగతి-మహేంద్ర కూడా బాధపడుతుంటారు. ఆ తర్వాత రోజు ఉదయం ధరణి వంటగదిలో ఉండగా దేవయాని అక్కడికి వచ్చి రిషికి కాఫీ ఇచ్చావా అని అడుగుతుంది. లేదు అత్తయ్య అని ధరణి అనడంతో ఇంట్లో అసలు ఏం జరుగుతోంది ధరణి... రిషికి కాఫీ ఇవ్వకుండా ఏ పనులు ఉంటాయి ఆ జగతి మహీంద్రలు ఎలాగా రిషిని పట్టించుకోరు నేనైనా పట్టించుకోవాలి కదా అని అరుస్తుంది. ఇంతలో రిషి అక్కడికి వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాడు. రిషి రావడం గమనించిన దేవయాని నేను నీకు కాఫీ పెడుతున్నాను రిషి అని కాఫీ పెట్టి ఇస్తుంది. పెద్దమ్మ వాసుధార కాఫీ తాగిందా అని అనగా లేదు రిషి ఇంకా కిందకి రాలేదు అని ధరణి అంటుంది. అయితే నేను వెళ్లి కాఫీ ఇస్తాను అని రిషి అంటాడు. నువ్వు వెళ్ళడమేంటి రిషి అని దేవయాని అడగగా...వసుధార కూడా మన ఇంటి మనిషే కదా పెద్దమ్మ ఇందులో తప్పేముందని చెప్పి కాఫీ తీసుకెళ్తాడు. అప్పుడు ధరణి దేవయానితో...మనం అనుకున్నవన్నీ అవుతాయని ఆశించకూడదు కదా అత్తయ్య గారు కొన్ని కొన్ని జరగవు అని అంటుంది.
ఆ తర్వాత సీన్లో వసు జగతితో మాట్లాడుతూ ఉంటుంది. మేడం మీరు ఇలాగ వదిలేసి వెళ్లిపోవడం న్యాయమా. మీకు నిజంగా నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి మొన్న చీర కట్టలేనప్పుడు కొట్టినట్టే కొట్టండి నేను భరిస్తాను కానీ ఇలా వెళ్ళిపోవద్దు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి ఎవరితో మాట్లాడుతున్నావు అని అనగా జగతి మేడం ఇక్కడే ఉన్నట్టు ఊహించుకున్నానా! మేడమ్ కి మెయిల్ చేశాను మేడం తో మాట్లాడినట్టు ఊహించుకుంటున్నాను అని అనుకుంటుంది. అప్పుడు రిషి కప్ ఆ, సాసర్ ఆ అని అడగగా, ఏదో ఒకటి సార్ ఏదైనా పర్లేదు అని అడ్జస్ట్ అవుతాను ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోని అని వసు అంటుంది. చిన్న చిన్న విషయాల్లో అలా ఉంటావుగాని ఎందుకు వసుధారా ఆ ఒక్క విషయంలో అడ్జస్ట్ అవ్వవు అని రిషి అడుగుతాడు. దానికి వసు, మనం ఒకటి అనుకుంటే జీవితాంతం అదే మనకు శాశ్వతం కానక్కర్లేదు సార్ అభిప్రాయాలు మారుతాయి మీ విషయంలో కూడా మారొచ్చేమో అని అంటుంది. అప్పుడు రిషి నన్ను ఎందుకు ఇంత గౌరవిస్తావని అడిగితే..సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటుంది.
Also Read: తండ్రికోసం అల్లాడిపోతున్న రిషి, పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోనంటూ దేవయానికి వసు వార్నింగ్
తర్వాత వసు బ్యాగ్ పట్టుకొని కిందకు వెళ్తున్నప్పుడు దేవయాని ఆపి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావా క్షేమంగా వెళ్ళు జాగ్రత్త ఆరోగ్యం అని అంటుంది. మేడం నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే చూడడానికి మీరు ఆశగా ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను ఇంటి నుంచి వెళ్లడం లేదు రిషి సార్ ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్తాను. రిషి సార్ వెళ్ళమన్నా కూడా నాకు నచ్చితేనే వెళ్తాను అని వసు అంటుంది. ఆ మాటలకు దేవయాని కోప్పడగా అదే సమయంలో రిషి వచ్చి ఏమైంది పెద్దమ్మ వసుధార ని ఏదో అంటున్నట్టున్నారు అని అంటాడు. దానికి వసు, ఏం లేదు సార్ నేను ఇక్కడ ఉండడం మేడంకి చాలా నచ్చుతుంది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని నన్ను అభినందిస్తున్నారు అని అనగా దేవయాని ఇంకేం చేయలేక బుర్ర ఊపుతుంది.
ఎపిసోడ్ ముగిసింది...