News
News
X

Guppedantha Manasu October 27th Update: తండ్రికోసం అల్లాడిపోతున్న రిషి, పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోనంటూ దేవయానికి వసు వార్నింగ్

Guppedantha Manasu October 27th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  October 27th Today Episode 592)

తండ్రిని తలుచుకుంటూ బాధపడతాడు రిషి. వసుధార ఓదార్చుతుంది. నాతో మాట్లాడనంత తప్పు ఏం చేశానంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత అలా వసుభుజంపై వాలి బాధగా ఉండిపోతాడు. ఇదంతా మేడపై నుంచి చూసిన దేవయాని షాక్ అవుతుంది. 
రిషి: మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్ పోస్ట్ పోన్ చేయమని మెయిల్ లో అడిగారంటే అక్కడ నన్ను చూడాలనే కదా.. నా మోహం చూసేందుకు కూడా డాడ్ ఇష్టపడడం లేదంటే...
వసు: మీరు బాధపడుతుంటే నేను చూడలేను లోపలకు వెళదాం పదండి..బయట చలిగా ఉంది..
రిషి: ఇక్కడే నేను డాడ్ చాలాసార్లు ఇలాగే కూర్చుని బోల్డన్ని కబుర్లు చెప్పుకున్నాం..కాసేపు నేను ఇక్కడే ఉంటాను నువ్వెళ్లు
వసు: మహేంద్ సార్ వస్తారు..త్వరలోనే మిమ్మల్ని కలుస్తారు..
రిషి: నువ్వెళ్లు వసుధారా కాసేపు ఇక్కడే ఉంటాను
వసు: త్వరగా వచ్చేయండి సార్...
వెళ్లిపోతున్న వసుని చూసి..నువ్వుకూడా తోడుగా లేకపోతే ఏమైపోయేవాడనికి అనుకుంటాడు రిషి..

Also Read: జగతి-మహేంద్రను వెనకేసుకొచ్చిన రిషి, మరింత రెచ్చగొట్టిన దేవయాని

లోపలకు వెళ్లిన వసు చేయిపట్టుకుని పక్కకు లాగుతుంది దేవయాని..నువ్వేం చేస్తున్నావో తెలుసా.. ఓ పరాయి మగాడితో..
వసు: ఆగండి మేడం..రిషి సార్ పరాయివాడు కాదు నావాడు
దేవయాని: మీకు పెళ్లైందా..ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావ్..నా ప్లేస్ లో ఇంకొకరు ఉంటే వేరే రకంగా ఉండేది
వసు: కాస్త ఆపుతారా..నాక్కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి..మీ ప్లేస్ లో ఇంకొకరు ఉంటే రిషి సార్ ని అర్థంచేసుకునేవారు, ఆయన ముందు పదేపదే మహేంద్ర సార్, జగతి మేడంని తిడుతున్నారు.. రిషి సార్ రమ్మంటేనే వచ్చాను, రమ్మనకపోయినా వస్తాను..మీ పెత్తనం నాపై కాదు... 
దేవయాని: నీకింత ధైర్యం వచ్చిందా
వసు: మీరు భయపడితే భయపడడానికి ధరణి మేడంని కాదు, ఒకప్పడి జగతి మేడంని కాదు.. ఎవ్వరికీ భయపడను.. తండ్రీ కొడుకుల బంధాన్ని ఎలా కలపాలో నాకు తెలుసు...మీరెళ్లి గోరువెచ్చటి పాలు తాగి పడుకోండి..మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అనవసర విషయాల్లో కలగజేసుకుని మీ పెద్దరికాన్ని తగ్గించుకోవద్దు... నన్ను కంట్రోల్ చేయాలని అస్సలు చూడొద్దు..
దేవయాని..నా గురించి నీకు పూర్తిగా తెలియదు వసుధారా..దీనికి నువ్వు వందరెట్లు చెల్లించాల్సి ఉంటుంది.

News Reels

Also Read: వంటలక్క-డాక్టర్ బాబుకి ఇదే చివరిరాత్రి కానుందా, శౌర్యకి తల్లిదండ్రులను దూరం చేసిన ఇంద్రుడు

రూమ్ కి వెళ్లిన రిషి తండ్రి ఆలోచనల్లోనే ఉంటాడు.. అటు వసుధార కూడా ఇదే ఆలోచనల్లో ఉంటుంది. ఈ సంఘర్షణ మొత్తం రిషిసార్-మహేంద్ర సార్ బంధాన్ని దూరం చేస్తుందా అనుకుంటుంది. రూమ్ లోంచి బయటకు వచ్చిన రిషి..నన్ను వదిలి ఎలా వెళ్లారు డాడ్ అని ఆలోచిస్తాడు..రిషి సార్ ఏం చేస్తున్నారో అనుకుంటూ వసుధార డోర్ తీసేందుకు నిల్చుంటుంది. అదే సమయంలో రిషి కూడా వసుధార అయినా ప్రశాంతంగా పడుకుందా లేదంటే నా గురించి ఆలోచిస్తోందా అనుకుంటూ వసు రూమ్ వరకూ వచ్చి వెనక్కు తిరిగి వెళ్లిపోతాడు.. అది గమనించిన వసుధార ఇక్కడి వరకూ వచ్చి మాట్లాడకుండా వెళ్లిపోతున్నారేంటో అనుకుంటుంది..

మరోవైపు గౌతమ్..ఫోన్లో తన తల్లితో మాట్లాడతాడు.. అదంతా విన్న రిషి దిగాలుగా అలాగే కూర్చుంటాడు.. ఏమైందిరా అంటూ వచ్చి కూర్చున్న గౌతమ్.. అమ్మరా చెప్పిందే చెబుతోందని అంటాడు. విన్నానురా అని ఎమోషనల్ అవుతాడు.. నువ్వు అమ్మతో మాట్లాడుకుంటే ఇంకా వినాలనిపించింది చెప్పురా ఇంకా అమ్మ ఏమంటోంది..
గౌతమ్: ఒకేమాటని మళ్లీ మళ్లీ చెబుతుందని..అయినా నేనేమైనా చిన్నపిల్లాడినా
రిషి: అలాంటి మాట నేను ఒక్కసారి కూడా వినలేదు..జీవితం అంటేనే విచిత్రం కదరా..లేనివాటి గురించి ఎక్కువ బాధ కదరా ,పుస్తకాల్లోనే కొన్ని ప్రేమల గురించి చదువుకోవడానికి మించిన విషాదం ఏముంటుంది..చిన్నప్పుడు ఓ ప్రేమ లేదు, ఇప్పుడు నాన్న కూడా..
గౌతమ్: అంకుల్ వచ్చేస్తారురా..
రిషి: ఇంకెప్పుడురా..డాడ్ చిన్నప్పుడు నాతో దాగుడుమూతలు ఆడేవారు..ఇంకా ఆట మర్చిపోలేదన్నమాట.. గౌతమ్.. లేట్ గా ఇంటికి వస్తే బెడ్ షీట్ కప్పుకున్నానో లేదో అని కప్పివెళతారే మరి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు..ఇప్పుడు నన్ను వదిలి ఎలా వెళ్లగలిగారు...
గౌతమ్: ఏంటిది..నిజం తెలిసి కూడా రిషికి చెప్పలేను..వీడి బాధను చూస్తూ ఉండలేనని అనుకుంటాడు... అరేయ్ వాళ్లు ఎక్కడున్నా బాగానే ఉంటారు నీకోసం వచ్చేస్తారు...
రిషి: వాళ్లు కావాలనే దొరక్కుండా ఉంటున్నారు...నేను చేసిన తప్పేంటి..నాకైనా ఎవరున్నారు డాడీ తప్ప.. అందరూ కోపం ఎక్కువ అంటారుకానీ ఆ కోపం వెనుకున్న కొండత ప్రేమను ఎందుకు అర్థం చేసుకోరు
గౌతమ్: మేం అందరం ఉన్నాంకదరా..
రిషి: అందరూ ఉండడం అంటే ఆల్బమ్ లో గ్రూప్ ఫొటో చూసి మురిసిపోవడం కాదు..పక్కనుండాలి..కోపం వస్తే అరవాలి, ప్రేమ ఉంటే చూపించాలి, అలగాలి,అరవాలి, నవ్వాలి..అదే కదరా.. కానీ ఇప్పుడేంటో దూరంగా వెళ్లిపోయారు... డాడ్ కోసం కొంతలో కొంత తగ్గానుకదా నాపై తనకెందుకు కోపం..అయినా నన్నెవరూ కరెక్ట్ గా అర్థంచేసుకోరేంటో..నేను ఎవర్ని ఎక్కువగా ప్రేమిస్తే వాళ్లనుంచి నేను దూరం అయిపోతుంటాను..
గౌతమ్: ఎవరూ దూరం అవలేదురా...
రిషి: ఇంకేంట్రా గౌతమ్ మరి..డాడ్ నన్ను వదిలి ఎలా వెళ్లగలిగారు..
గౌతమ్: బాధపడకురా ప్లీజ్..నీకేం చెప్పాలో నాకేం అర్థంకావడంలేదు..ఒక్కోసారి ఎంత ప్రేమఉన్నా పరిస్థితుల వల్ల దానికి వ్యతిరేకంగా మసులుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రేమ ఉన్నా చూపించలేని పరిస్థితి రావొచ్చు..ఎవరికి తెలుసు
రిషి: నీకన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావ్
గౌతమ్: సమస్యలు-పరిస్థితిలు వీటి గురించి చెబుతున్నాను..ఒక్కోసారి మనకు ఎదుటివాళ్ల పరిస్థితి తెలియదు కదా..
రిషి: నా పరిస్థితేంటో నీకు తెలుసుకదా... నన్నెవరూ అర్థం చేసుకోరేంటని ఆలోచించాను కానీ ఆ తప్పు మొత్తం నాదేనేమో అనిపిస్తోంది..
రిషి-గౌతమ్ మాటలు రూమ్ బయట నిల్చుని విన్న వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది...

Published at : 27 Oct 2022 10:29 AM (IST) Tags: Guppedantha Manasu Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy Guppedantha Manasu October 27th Guppedantha Manasu Today Episode 592

సంబంధిత కథనాలు

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

Prabhas: ప్రభాస్ తో తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చర్చలు, భారీ బడ్జెట్ మూవీకి శ్రీకారం!

Prabhas: ప్రభాస్ తో తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చర్చలు, భారీ బడ్జెట్ మూవీకి శ్రీకారం!

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

Vikram Gokhale: సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత, విషాదంలో బాలీవుడ్ !

Vikram Gokhale: సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత, విషాదంలో బాలీవుడ్ !

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

టాప్ స్టోరీస్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

Sanju Samson Dropped: ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే సంజూపై వేటు! పంతే ముద్దు!

Sanju Samson Dropped: ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే సంజూపై వేటు! పంతే ముద్దు!