Karthika Deepam October 27th Update: వంటలక్క-డాక్టర్ బాబుకి ఇదే చివరిరాత్రి కానుందా, శౌర్యకి తల్లిదండ్రులను దూరం చేసిన ఇంద్రుడు
కార్తీకదీపం అక్టోబరు 27 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam October 27th Episode 1494 (కార్తీకదీపం అక్టోబరు 27 ఎపిసోడ్)
శౌర్యని వెతుక్కుంటూ వస్తాడు కార్తీక్...అటు ఇంద్రుడు కూడా శౌర్య గురించి ఆలోచిస్తాడు. కొత్తబట్టలు కొనాలంటే డబ్బులు కావాలి ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఓ పర్స్ కొట్టేసేందుకు ప్రయత్నించగా దీప వచ్చి పట్టుకుట్టుంది. నీకు ఇదేం బుద్ధి అని దీప అంటే...ఈ జేబుదొంగ ముందే తెలుసా అని కార్తీక్ అంటాడు. నేను దొంగతనాలు మానేశానని ఇంద్రుడు బతిమలాడుతాడు. నిన్ను పట్టించడానికి రాలేదులే అని చెప్పి..గతంలో శౌర్యతో మాట్లాడిన విషయం గుర్తుచేస్తుంది దీప. పాప పెద్దమనిషి అయింది..రేపు స్నానం చేయిస్తున్నాం అని ఇంద్రుడు చెబుతాడు. రేపు ఫంక్షన్ కోసం చేతిలో డబ్బుల్లేవని ఈ దొంగతనం చేయాలి అనుకున్నానని ఇంద్రుడు చెబుతాడు.
మరోవైపు మోనిత ఆలోచనలో పడుతుంది. ప్రియమణి నిజంగా కనిపించిందా..మొత్తం చెప్పేసిందా..కార్తీక్ కి అంతా తెలిసే దాచుతున్నాడా అనుకుంటుంది. ఇంతలో వాల్తేరు వాణి ఎంట్రీ ఇస్తుంది. నువ్వెందుకు ఇక్కడకు వచ్చావని మోనిత కంగారుపడుతుండగా..మీ ఆయన -దీప మేడం బయటకు వెళ్లారని చెబుతుంది. దుర్గ కూడా బయటకు వెళ్లాడని చెబుతారు. ఇందాక రోడ్డుమీద పోలీసులను చూసి భయపడి దాక్కున్నాడు..మీరే పోలీసులకు ఫోన్ చేసిఉంటే పనైపోయేది కదా అని వాల్తేరు వాణి అంటుంది. అవన్నీ నేను చేశానని చెప్పిన మోనిత..నువ్వు చేయాల్సింది చేయి అంటుంది..
Also Read: మోనితకి కౌంట్ డౌన్, వాణిపై దుర్గకు అనుమానం - ఇంద్రుడితో కలసి శౌర్య దగ్గరకు బయలుదేరిన కార్తీక్, దీప
దీప-కార్తీక్ ఇద్దరూ కలసి...అమ్మాయికి బట్టలు, నగలు కొనిస్తారు. ఇంద్రుడు టెన్షన్ పడుతుండడం చూసి ఇకపై దొంగతనం చేయొద్దంటాడు. పాపని చూడడానికి మీ ఇంటికి వస్తానంటుంది. వంటలక్క-డాక్టర్ బాబు అంటే వీళ్లే జ్వాలమ్మ అమ్మానాన్నలా బతికే ఉన్నారా..జ్వాలమ్మ నా దగ్గరే ఉందని తెలుసా అందుకే ఈ బట్టలు నగలు కొనిచ్చారా అని ఆలోచిస్తాడు ఇంద్రుడు. ఈ రోజు వద్దులెండి సార్..పాపకి స్నానం చేయిస్తున్నాం ఫంక్షన్ కూడా రేపే...రేపు వద్దురుగాని అని మాట దాటేస్తాడు. కార్తీక్ మాత్రం ఇతనేదో తేడాగా ఉన్నాడు అనుకుంటూ...ఎందుకులే ఇబ్బంది పెట్టడం అనేసి నీ ఫోన్లో పాప ఫొటో చూపించు అంటాడు కార్తీక్. కన్నింగ్ ప్లాన్ వేసిన ఇంద్రుడు..జ్వాలమ్మ ఫొటో చూపిస్తే వచ్చి తీసుకెళ్లిపోతారని ఆలోచించి..శౌర్య ఫొటోస్ అన్నీ డిలీట్ చేసి ఫొటోస్ లేవని చెప్పేస్తాడు... ఎవరికి వాళ్లు వెళ్లిపోతారు..
Also Read: జగతి-మహేంద్రను వెనకేసుకొచ్చిన రిషి, మరింత రెచ్చగొట్టిన దేవయాని
మరోవైపు శౌర్య..తల్లిదండ్రులను గుర్తుచేసుకుని ఏడుస్తుంటుంది. పిన్ని చంద్రమ్మ ఓదార్చుతుంది. మరోవైపు ఇంద్రుడు ... శౌర్యని దత్తత తీసుకున్న విషయం గుర్తుచేసుకుంటాడు. మా అమ్మని వంటలక్క, మా నాన్నని డాక్టర్ బాబు అని పిలుస్తారని శౌర్య చెప్పినది గుర్తుచేసుకుంటాడు..
రేపటి ( శుక్రవారం) ఎపిసోడ్ లో
ఈ పిండివంటలన్నీ ఎందుకని కార్తీక్ అడిగితే..శౌర్య కోసమే అంటుంది. నాక్కూడా శౌర్యని చూడాలని ఉందంటాడు కార్తీక్. మరోవైపు వంటలక్కని లేపేసేందుకు మోనిత స్కెచ్ వేసింది.. వాల్తేరు వాణి దీపని సజీవంగా తగలబెట్టేసే పనిలో ఉంది