Karthika Deepam October 26th Update: మోనితకి కౌంట్ డౌన్, వాణిపై దుర్గకు అనుమానం - ఇంద్రుడితో కలసి శౌర్య దగ్గరకు బయలుదేరిన కార్తీక్, దీప
కార్తీకదీపం అక్టోబరు 26 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam October 26th Episode 1493 (కార్తీకదీపం అక్టోబరు 26 ఎపిసోడ్)
దుర్గ ఇడ్లీ తిందామనుకుంటే వాణి ఇడ్లీని కింద పడేస్తుంది. నువ్వు తినకపోతే నేను తినొద్దా అని దుర్గ అనడంతో కార్తీక్ అన్నయ్య వచ్చారు కదా అన్నయ్యతో కలసి తింటే బావుంటుందని అంటుంది. సరే అని కార్తీక్ ప్లేట్ తీసుకుని తినడం మొదలెట్టేసరికి మళ్లీ ఆపిన వాణి..ముందు నీళ్లు తాగండి అంటుంది. ఆ తర్వాత తిందాం అని కార్తీక్ మొదలెట్టేసరికి మోనిత ఎంట్రీ ఇచ్చి కార్తీక్ చేతిలో ప్లేట్ విసిరికొడుతుంది. ఇక వాల్తేరు వాణి ఓవరాక్షన్ మొదలెడుతుంది. మోనిత-వాణి ఇద్దరూ కొట్టుకునేందుకు దిగుతారు. కార్తీక్, దీప, దుర్గ ఆపుతారు. కార్తీక్ రా అని మోనిత లాక్కెళ్లిపోతుంది. కార్తీక్ సార్ ముందు ఏమీ అనొద్దని దుర్గ చెప్పడంతో...నాతో పెట్టుకుంటే వదిలేది లేదంటుంది. మనసులో మాత్రం హమ్మయ్య సమయానికి మోనిత వచ్చి కార్తీక్ సార్ టిఫిన్ తినకుండా ఆపిందనుకుంటుంది.
మరోవైపు ఆటో క్లీన్ చేస్తూ...చంద్రమ్మా జ్వాల ఇంకారాలేదంటని అడుగుతాడు ఇంద్రుడు. ఇందాకే స్నానం చేసింది కదా అంటే మళ్ళీ చేసింది అర్థం చేసుకో పెద్దమనిషి అయిందని చంద్రమ్మ చెబుతుంది. కొనాల్సినవన్నీ లిస్ట్ రాసి ఇస్తుంది. మరోవైపు దీప -కార్తీక్ శౌర్య గురించి ఆలోచిస్తారు. ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు, ఈ వయసులోనే నువ్వు ఇలా బతకాల్సి వస్తుంది అందరూ ఉన్న ఒంటరిగా ఉన్నట్టున్నావు నీకేంటమ్మా ఈ కర్మ. అయినా నువ్వు ఒక్కదానివే ఉన్నావా లేక ఎవరైనా చూసుకుంటున్నారా అసలు బాగోగులు ఏంటి. అయినా ఇదంతా మోనిత వల్లే జరిగింది అని ఇద్దరు మనసులో అనుకుంటారు. ఈ మోనితని ఎలాగైనా తన గుట్టు తనంతట తానే బయటకు విప్పేలా చేయాలి కచ్చితంగా దాని పని పడతాను అని కోపంగా అనుకుంటాడు. అదే సమయంలో దీప కూడా...నా కళ్ళముందే నా మొగుడు చెయ్యి పట్టుకుని వెళ్తుంటే నేనెందుకు ఊరుకోవాలి అనుకుంటుంది.
మోనిత హాల్లో కూర్చుంటూ సరైన సమయానికి వాణి మెసేజ్ పెట్టింది కనుక సరిపోయింది లేకపోతే కార్తీక్ ఏమయి ఉండేవాడు. ఈ మాత్రం నేను చేయలేకా ఏంటి...నా చేతికి మట్టి అంటుకోకూడదని దాన్ని పెట్టాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో కార్తీక్ వచ్చి ప్రియమణి ఎవరు అని అడుగుతాడు.
మోనిత: షాక్ అయ్యి నాకు తెలియదు కార్తీక్ అని నెమ్మదిగా అంటుంది
కార్తీక్ : నిజంగా నీకు తెలీదా
మోనిత: గతంలో ప్రియమణి గురించి గుర్తుతెచ్చుకుంటుంది. లేదు కాబట్టి నాకు అలా ఎవరూ తెలీదు అని అంటుంది.
కార్తీక్ : తను ఇందాక కనిపించింది నీ దగ్గర పని చేసిందట అడిగితే మన ఇద్దరికీ పెళ్లి ఎప్పుడు అయింది అని అడుగుతోంది
మోనిత: ప్రియమణి ఇక్కడ ఉండడం ఏంటి అనుకున్న మోనిత..నా దగ్గర చాలా మంది పనిచేస్తుంటారు కార్తీక్..ప్రతిఒక్కరి పేరు గుర్తుపెట్టుకోలేను కదా అంటుంది
కార్తీక్: దానికి దీప ఎవరో తెలుసా
మోనిత: తను ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు తనకి దీప తెలుసా లేదా అనేది నాకేం తెలుసు
కార్తీక్ : భలే తెలివిగా సమాధానం ఇస్తున్నావు మోనిత అనుకుని...అయితే మన బిడ్డ విషయం ఏంటి మనకు ఎప్పుడు పెళ్లయింది మోనిత? ఆనంద్ ని చూస్తుంటే సంవత్సరం పిల్లాడిలా ఉన్నాడు. అంటే మనకు పెళ్ళై సంవత్సరం న్నర లేక రెండు సంవత్సరాలు అయి ఉండొచ్చు కదా మరి మన వయసును చూస్తే ఏ పదో 12 ఏళ్ల పిల్లలు ఉండేటట్టు ఉంది కదా అంటాడు
మోనిత: భయపడుతూ ప్రతి ఒక్కరూ 21 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలని లేదు కదా కార్తీక్. మనం వెయిట్ చేసి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం
కార్తీక్: నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు మోనిత. నువ్వు చెప్పిన గతానికి నాకు ఇక్కడ తెలుస్తున్న నిజాలకి ఎటువంటి సంబంధం లేదు. నిజంగా నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావని తెలిసిందా నాలో ఉన్న రాక్షసుడిని చూస్తావు
ఆ తర్వాత సీన్లో దుర్గా-వాణి రోడ్ మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అప్పుడు వాణి దుర్గతో, నీకు దీప వదిన ఎప్పటినుంచి తెలుసని అడిగితే..తెలుసు పాపం చాలా కష్టపడింది మొన్న మొన్నే మళ్ళీ కనిపించింది. సంతోషంగా ఉన్నారు అనుకుంటే ఇంత జరిగింది అని అంటాడు. అప్పుడు వాణి మనసులో, వీడిని బుట్టలోకి దించాలి నా పని సులువుగా అవుతుంది అని అనుకుంటూ మొన్న వెళ్లిన రెస్టారెంట్ కి మళ్ళీ వెళ్దామా అని అడుగుతుంది. అదే సమయంలో అటువైపుకి ఇద్దరు పోలీసులు వస్తారు. పోలీసులను చూసిన దుర్గ ఒక వైపు పారిపోతే వాణి ఇంకోవైపు పారిపోతుంది.
Also Read: అజ్ఞాతవాసం చేస్తోన్న జగతి-మహేంద్ర, దేవయానికి షాకిచ్చి రిషిని ఆలోచనలో పడేసిన వసు
పోలీసులు వెళ్లిపోవడంతో... దుర్గ మనసులో....నేను దాక్కున్నానంటే ఒక అర్థం ఉంనది అది ఎందుకు దాక్కుంది అనుకుంటూ వాణి దగ్గరికి వెళ్లి నువ్వు ఎందుకు దాక్కున్నావ్ అని అడుగుతాడు. ఏమీ లేదు నాకు పోలీసులుంటే చిన్న భయం మనం తినడానికి వెళ్దాం అనుకున్నాం కదా వెళ్దామా అని వాణి అనగా, ఇదేదో దాస్తుంది అనుమానస్పదంగా ఉందనుకుంటాడు.
ఆ తర్వాత సీన్లో చంద్రమ్మ ఇంద్రుడు దగ్గరకు వెళ్లి, రేపే జ్వాలమ్మకి స్నానం తను గొప్ప ఇంట్లో పుట్టిన బిడ్డ కదా మనం చేయగలిగింది ఏమైనా చేయాలి చిన్న ఫంక్షన్ లాంటిది ఏమైనా చేయాలి అని అంటుంది. దానికి ఇంద్రుడు, మరి డబ్బులు ఎక్కడివి ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అనగా, నా దగ్గర ఉన్నాయి కదా పుట్టింటి నుంచి తెచ్చినవి అంటుంది చంద్రమ్మ. దానికి ఇంద్రుడు, వద్దు అవి మనం వ్యాపారం పెట్టి జ్వాలమ్మ భవిష్యత్తును మెరుగుపరచడానికి కదా దాని నుంచి రూపాయి కూడా తీయొద్దు నేను ఎలాగైనా డబ్బు ఏర్పాట్లు చూస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
కార్తీక్....శౌర్య వినాయకుడు బొమ్మలు అమ్మిన స్థలం దగ్గరికి వచ్చి.. వినాయకుడి బొమ్మలమ్మినట్టే దీపావళి క్రాకర్స్ కూడా అమ్మడానికి వస్తారు అనుకుంటూ అక్కడ ఉన్న అతని ఇక్కడ దీపావళికి క్రాకర్స్ ఎక్కడ అమ్ముతారు అని అడుగుతాడు. అదే సమయంలో ఇంద్రుడు తన ఆటో ఎదురుగా నిల్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు జ్వాలమ్మ కి ఫంక్షన్ పెట్టాలి డబ్బులు లేవు కొట్టేద్దాం అంటే జ్వాలమ్మ ఒట్టేయించుకుంది అనుకుంటాడు
ఎపిసోడ్ ముగిసింది..
రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
మనం ఎప్పటి నుంచో వెతుకుతున్నది ఇతన్నే అంటుంది దీప..ఇంద్రుడిని చూపిస్తూ. వంటలక్క, డాక్టర్ బాబు వీళ్లే జ్వాలమ్మ అమ్మానాన్నలా అనుకుంటాడు ఇంద్రుడు. పెద్దమనిషి అయిందని ఇంద్రుడు చెప్పడంతో పాపని చూసేందుకు దీప,కార్తీక్ బయలుదేరుతారు...