Guppedantha Manasu October 26th Update: జగతి-మహేంద్రను వెనకేసుకొచ్చిన రిషి, మరింత రెచ్చగొట్టిన దేవయాని
Guppedantha Manasu October 26th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu October 26th Today Episode 589)
గౌతమ్ ఇంటికెళ్లిన రిషి..తండ్రి గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతాడు. డాడ్ ఎదురుగా వెళ్లి సారీ చెప్తా డాడ్ కూల్ అయిపోతారు..తనది చిన్న పిల్లల మనస్తత్ అంటాడు. ఈ మాటలు విన్న మహేంద్ర..నేనే రాక్షసుడిని అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారని వసు అడిగితే..రిషి కూడా అదే మాట అంటాడు. నువ్వు టెన్షన్లో ఉంటే నేను జోక్స్ వేస్తుంటానా నాక్కూడా టెన్షన్ ఉంటుంది కదా అని కవర్ చేస్తాడు గౌతమ్. అప్పుడు రిషి..డాడ్ నా పక్కనే ఉన్నట్టుంది అంటాడు. నిజంగా నీకు తెలిస్తే ఎక్కడున్నారో చెప్పు డాడ్ లేకుండా ఉండలేకపోతున్నాను అంటాడు రిషి. అక్కడి నుంచి వెళుతూ కూడా నిజంగా డాడ్ నా చుట్టుపక్కల ఉన్నట్టే అనిపిస్తోంది అంటాడు. ఆ మాటలు విని గౌతమ్ బాధపడతాడు.
రిషి వెళ్లాక జగతి-మహేంద్ర దగ్గరకు వచ్చిన గౌతమ్
గౌతమ్: రేపు అన్ని సమస్యలు సర్దుకున్న తర్వాత నేనే మిమ్మల్ని మా ఇంట్లో ఉంచాను అని రిషికి తెలిస్తే ఏమవుతుంది అంకుల్ నాకు భయంగా ఉందని బాధపడతాడు.
మహేంద్ర: నువ్వు ఎంత గొప్ప వాడివి గౌతమ్ నీ స్నేహితుడు గురించి అంత బాగా ఆలోచిస్తున్నావు. నాకు కూడా రిషి వదిలి ఉండాలని లేదు తన మాటలు వింటే బాధగా ఉంది కానీ మేము అనుకున్న పని జరగాలంటే ఇదొకటే సరైన మార్గం
గౌతమ్ ని గట్టిగా హత్తుకున్న మహేంద్ర..నా తరపున రిషికి ఇవ్వు అని చెబుతాడు...
Also Read: మోనితకి కౌంట్ డౌన్, వాణిపై దుర్గకు అనుమానం - ఇంద్రుడితో కలసి శౌర్య దగ్గరకు బయలుదేరిన కార్తీక్, దీప
రిషి తన రూమ్ లో కూర్చిని ఆలోచిస్తుంటాడు అక్కడకు వసు వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావ్ అని రిషి అడిగితే.. మీరు కూర్చున్న కుర్చీ సార్...మీరెప్పుడూ దానిమీద కూర్చుంటారు నాకు జెలసీ గా ఉంది అనగానే వసుని కూర్చోబెడతాడు రిషి. అప్పుడు కాలు బెణకడంతో మర్దన చేస్తాడు
రిషి: ఏమైనా తిన్నావా
వసు: మీరు తినలేదు కదా సార్ అందుకే ఇంట్లో ఎవరూ తినలేదు
రిషి: నువ్వు నాకోసం ఇక్కడికి వచ్చావు. నాకోసం పస్తులు ఉండడం ఎందుకు వెళ్లి తిను
అక్కడి నుంచి వెళుతూ...కింద భోజనం పెడుతున్నాను మీరుకూడా కిందకు వస్తారని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన గౌతమ్.. ధరణిని కలుస్తాడు. ఇంట్లో ఎవ్వరూ లేరా అని అడిగితే ఎవరి గదిలో వాళ్ళు కూర్చుని మౌనంగా ఉన్నారని చెబుతుంది ధరణి.
గౌతమ్ : రిషి ఏమైనా తిన్నాడా
ధరణి: లేదు
గౌతమ్: వెళ్లి దేవయాని పెద్దమ్మకి చెప్తే అప్పుడు రిషి భోజనం చేస్తాడు కదా అనే లోగా రిషి అక్కడికి వస్తాడు.
రిషి: గౌతమ్ డాడ్ గురించి ఏమైనా తెలిసిందా
గౌతమ్: ఇంకా తెలియలేదు (మనసులో మాత్రం నన్ను క్షమించరా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది )అని అనుకుంటాడు.
అప్పుడు గౌతమ్..మహేంద్ర ఇచ్చిన హగ్ గుర్తుచేసుకుంటూ రిషిని హగ్ చేసుకుంటాడు.
దేవయాని: ఏంటి రిషి నువ్వు ఇలా ఉండడం ఏంటి జగతికి అయితే బుద్ధి లేదు మహేంద్ర కి ఏమైంది తనకైనా తెలియాలి కదా
రిషి:డాడ్ ని ఏం అనొద్దు పెద్దమ్మ
దేవయాని: అయినా మహేంద్ర కి జగతి వచ్చిన తర్వాత నీ మీద దృష్టి తగ్గింది. జగతి మీదే పెరుగుతున్నట్టు ఉంది
రిషి: దాంట్లో తప్పేముంది పెద్దమ్మ. డాడ్ కి నేను కొడుకు అవ్వకముందే మేడం భార్య అయ్యారు. భార్య స్థానం భార్యదే కదా అయినా వాళ్ల గురించి మనం ఇలా మాట్లాడుకోకూడదు
ఇది విను వసుధార మనసులో ఎంతో ఆనందపడుతుంది.
గౌతమ్: కరెక్ట్ గా చెప్పావు రిషి చాలా బాగా చెప్పావు
అప్పుడు దేవయాని మనసులో ,మహేంద్ర వాళ్ళు ఇంటి నుంచి వదిలిపోయినా రిషి మనసు నుంచి వెళ్లట్లేదు ఏంటి అని అనుకుంటుంది. ఇంతలో వసుని చూసి..నువ్వు ఇంక బయలుదేరచ్చు కదా అనగానే... వసుధార ఇక్కడే ఉంటుంది అని రిషి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
Also Read: అజ్ఞాతవాసం చేస్తోన్న జగతి-మహేంద్ర, దేవయానికి షాకిచ్చి రిషిని ఆలోచనలో పడేసిన వసు
వసు-రిషి
ఇంటి బయట సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి బాధపడుతూ ఉండగా ...మహేంద్ర సార్ మాత్రం మిమ్మల్ని వదిలి ఎన్ని రోజులు ఉంటారు తప్పకుండా వస్తారని ధైర్యం చెబుతుంది. ఇంతలో మినిస్టర్ పీఏ దగ్గర్నుంచి రిషికి ఫోన్ వస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి అందరికీ మెయిల్స్ పెట్టారు కదా....జగతి మేడం, మహేంద్ర సార్ లు రాను అని చెప్పారు అని రిషికి మినిస్టర్ గారి పిఏ చెప్తాడు.
ఎపిసోడ్ ముగిసింది