అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Karthika Deepam October 28th Update:మోనిత కుట్రకు మరోసారి దీప బలి, తనలో రాక్షసుడిని బయటకు తీసిన కార్తీక్

కార్తీకదీపం అక్టోబరు 28 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam October 28th Episode 1495 (కార్తీకదీపం అక్టోబరు 28 ఎపిసోడ్)

వంటలక్క, డాక్టర్ బాబు కనిపించడంతో..ఇంద్రుడు వారినుంచి తప్పించుకుని వచ్చేసి జ్వాలమ్మ అమ్మా-నాన్న బతికే ఉన్నారు. మా బిడ్డ పోయిన తర్వాత దేవుడు మాకు ఇచ్చిన వరం అనుకున్నాం. జ్వాలమ్మ తన అమ్మా నాన్నలను వెతుకుతుంటే వాళ్ళు చనిపోయారనే ధైర్యంతో ఉన్నాను కానీ వాళ్ళు ఇప్పుడు కచ్చితంగా జ్వాలమ్మ వాళ్ళ అమ్మ నాన్నలాగే ఉన్నారు. వాళ్లకి తెలిస్తే జ్వాలమ్మను తీసుకెళ్లిపోతారు..నాకు పాపం వచ్చినా సరే పాపను మాత్రం ఇవ్వనని కన్నీళ్లు పెట్టుకుంటాడు. 

ఆ తర్వాత సీన్ లో దీప, కార్తిక్ కార్లో వెళ్తూ ఉండగా ఆ పాప శౌర్య ఏమో అని నాకు చాలా నమ్మకంగా ఉంది అంటుంది. అవును వంటలక్క అన్న కార్తీక్ ఏదో సంకోచంలో ఉండగా ఎందుకలా ఉన్నారని అడుగుతుంది
కార్తీక్: నువ్వే శౌర్య తల్లివని తెలిసిపోతే...నీకు ఇస్తారని గ్యారంటీ ఏంటి
దీప: మీరు అలా అంటే భయం వేస్తోంది డాక్టర్ బాబు..ఇప్పటికే ఓ బంధం కోసం పోరాటం చేస్తున్నాను..ఇప్పుడు శౌర్యని కూడా దూరం చేస్తే తట్టుకోలేను
కార్తీక్: శౌర్య ఏమీ చిన్నపిల్లకాదు కదా..నిన్ను చూడగానే వచ్చేస్తుంది
దీప: వాళ్లు ఇవ్వరనే అనుమానం ఎందుకొచ్చింది
కార్తీక్: ఆ పాప వాళ్ల కన్నబిడ్డ అయిఉండొచ్చు లేదంటే శౌర్యని కన్నబిడ్డలా చూసుకుని ఉండొచ్చు..నువ్వు శౌర్య తల్లివని తెలిస్తే నీకు చూపించకుండా తీసుకెళ్లిపోయే అవకాశం ఉంది కదా..రేపు వెళదాం..అక్కడున్నది శౌర్య అయితే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు..అప్పుడు కార్తీక్ మనసులో, విడిపోయిన మన కుటుంబం అంతా కలవాలి దీప అనుకుంటాడు

ఆ తర్వాత సీన్ లో మోనిత... కావేరికి ఫోన్ చేసి, ఆ వాణి ని నువ్వు చెప్పావని ఇక్కడికి తీసుకొని వచ్చాను అది ఇప్పటికి వచ్చి ఏ పని కూడా చేయలేదు అని అంటుంది. దానికి కావేరి, అక్కడున్నది వాల్తేరు వాణి నువ్వేం కంగారు పడొద్దు. నీటిగా పనిని పూర్తి చేసేస్తుంది అంటుంది. ఏమో కావేరి నాకు చాలా టెన్షన్ గా ఉంది అని మోనిత అంటుంది. టెన్షన్ ఎందుకు అని పక్కనుంచి కార్తీక్ వస్తాడు. కార్తీక్ ని గమనించిన మోనిత వెంటనే ఫోన్ కట్ చేసి ఇలా అడ్డంగా దొరికిపోయానేంట్రా బాబు అని మనసులో అనుకుంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావో అని కార్తీక్ అడిగితే..కావేరితో మాట్లాడుతున్నాను అంటుంది.
కార్తీక్: ఇప్పుడు ఎందుకు కావేరితో మాటలు ఏ పనులు లేవు కదా
మోనిత: దుర్గతో మాట్లాడితే ఇంకోలా అర్థం చేసుకుంటావు. కావేరితో మాట్లాడిన కూడా అలాగే అర్థం చేసుకుంటున్నావా. నువ్వు దీపతో బయటికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత నేను నిన్ను ప్రశ్నించక ముందే నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా
కార్తీక్: మొగుడు ఎదురుగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ...
మోనిత: కార్తీక్...అని అరుస్తుంది నేను ఏ తప్పు చేయలేదు.
కార్తీక్: దుర్గతో నేను విన్నది అబద్ధం అని ప్రూవ్ చేయి..నీ ఎదురుగానే దుర్గను నరుకుతాను
మోనిత: మళ్లీ పాత ఫొటో చూపించి మోనిత డ్రామా చేస్తుంది.. ఫొటో చూసి అయినా నన్ను నమ్ము అంటాడు...
కార్తీక్: ఇంతలో దీపతో కలసిఉన్న ( గతంలో వారణాసి పంపినది) ఫొటో చూపించి..నేను దీపా కూడా అలాగే ఫొటో దిగాం కదా అప్పుడు వంటలక్క కూడా నా భార్య అవ్వాలి కదా..
ఇంతలో దుర్గ రావడంతో...మేం సీరియస్ డిస్కషన్లో ఉన్నాం నువ్వెళ్లు అని చెప్పడంతో దుర్గ వెళ్లిపోతాడు..
అనవసరంగా నన్నుగానీ, దీపను కానీ మాటలంటే ఊరుకోనని హెచ్చరిస్తాడు

Also Read: తండ్రికోసం అల్లాడిపోతున్న రిషి, పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోనంటూ దేవయానికి వసు వార్నింగ్

ఇంకా ఇంద్రుడు రాలేదని వేచి చూస్తుంది చంద్రమ్మ. ఇంతలో ఇంద్రుడు అక్కడికి బాధగా వస్తాడు. జ్వాలమ్మ ఎలా ఉందని అడిగితే వాళ్ల అమ్మను తలుచుకుని ఏడుస్తోంది అంటుంది. ఆ మాట విని ఇంద్రుడు కూడా బాధపడతాడు. ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి ఏమైనా కొను అని చంద్రమ్మ చెబితే..దీప-కార్తీక్ కొనిచ్చిన నగలు, డబ్బులు, చీరలు చంద్రమ్మకి ఇస్తాడు.ఇన్ని డబ్బులు ఎక్కడివి గండ దొంగతనం చేసావా అని అడగగా, నీ మీద ఒట్టు చంద్రమ్మ దొంగతనం చేయలేదు ఏ తప్పుడు పని చేయలేదు నేను తర్వాత వస్తాను అని ఆటోలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంద్రుడు. నా దగ్గర నుంచి గండ ఏదో దాస్తున్నాడు అని చంద్రమ్మ అనుకుంటుంది. 

మరోవైపు దీప...శౌర్యని చూస్తానన్న ఆనందంలో పిండివంటలు చేస్తుంటుంది. శౌర్యను చూస్తే డాక్టర్ బాబుకి కూడా గతం గుర్తొస్తుంది అని అనుకుంటుంది. ఇంతలో వాణి అక్కడికి వచ్చి ఇన్ని పిండి వంటలు చేస్తున్నావెందుకు వదిన అని అంటుంది.
అప్పుడు దీప నా కూతురిని చూడడానికి వెళ్తున్నాను కానీ తన పుష్పవతి అయింది అని జరిగిన విషయం అంతా చెప్తుంది. ఇంతలో దుర్గ స్వీట్లు పట్టుకొని వచ్చి, దీపమ్మ ఇప్పుడే మోనిత ఇంటికెళ్ళి వస్తున్నాను కార్తీక్ సార్ మోనిత ని రఫ్ ఆడిస్తున్నారు అని అంటాడు. ఎందుకు దుర్గ నాకు చెప్పలేదు. నేను కూడా చూసేదాన్ని కదా అని దీప అంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇలాంటివి చాలా ఉంటాయి దీపమ్మ ఎదురుచూడు అని అంటాడు దుర్గ. ఈ మాటలని వాణి వింటుంది. అదే రోజు రాత్రి అందరూ పడుకున్నప్పుడు మోనితకు జరిగిన విషయం అంతా చెప్తుంది వాణి. వాళ్లు శౌర్యని కలవకూడదు.శౌర్య ని కలిస్తే సగంలో ఆగిపోయిన వాళ్ళ జీవితం తిరిగి ప్రారంభమవుతుంది. ఆనందంగా గడుస్తుంది అనుకునే నా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది అని అంటుంది మోనిత...ఎపిసోడ్ ముగిసింది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget