News
News
X

Guppedantha Manasu July 16th Update: వసుని అవమానించిన సాక్షి, సపోర్ట్ చేసిన రిషి- సాక్షి, దేవయానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిపడేసిన జగతి

రిషి లవ్ రిజెక్ట్ చేసిన దగ్గర నుంచి వసు మనసులో ప్రేమ మొదలవుతుంది. ఎలాగైనా రిషికి దగ్గర అవ్వాలని తెగ ప్రయత్నిస్తుంది. మరో వైపు సాక్షి కూడా రిషికి దగ్గర కావాలని ట్రై చేస్తుంది.

FOLLOW US: 

రిషితో కలిసి తాగుదామని సాక్షి కాఫీ తీసుకుని వస్తుంది. అక్కడే ఉన్న గౌతమ్ సాక్షి తెచ్చిన కాఫీ తీసుకుని థాంక్స్ చెప్పడంతో ఛా.. ఈ గౌతమ్ వల్ల ప్లాన్ అంతా చెడిపోయిందని తిట్టుకుంటుంది. సాక్షి నువ్వు కాఫీ తీసుకురావడం ఏంటని రిషి అంటాడు. అందులో తప్పేంటి రిషి అందరిలా నేను ఫోజ్ లు కొట్టను ఫ్రెండ్లీగా ఉంటానని చెప్పి రిషి దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తుంది. సరిగా అప్పుడే అక్కడికి వసు వస్తుంది. కాఫీ తాగావా అని గౌతమ్ అడుగుతాడు. సాక్షి చేతిలో కాఫీ ట్రే చూసి తాగాలనే ఉంది తల పగిలిపోతుందని చెప్తుంది. అవునా అయితే ఈ కాఫీని షేర్ చేసుకుందామని రిషి అంటాడు. ఆ మాటకి సాక్షి బిత్తరపోతుంది. 

రిషి: వసుధార కప్ లో తాగుతావా లేదా సాసర్ లో తాగుతావా.. 

సాక్షి: నేను కప్ లో తాగుతాను రిషి

రిషి: అదేంటి సాక్షి నువ్వు మా గెస్ట్ వి నీకు కప్ లో సాసర్ లో ఇస్తే ఏం బాగుంటుంది చెప్పు. నువ్వు అడిగినా నేను ఇవ్వను 

వసు: అవును సర్ నేను సాక్షి మేడమ్ కి స్పెషల్ గా అరేంజ్ చేస్తాను అని చెప్పి లటక్కన రిషి దగ్గరకి వెళ్ళి కాఫీ కప్ అందుకుని తాగేస్తుంది. 

గౌతమ్: రేయ్ రిషి నీకు సాసర్ లో కాఫీ తాగడం వచ్చా అన్నీ ఆడగ్గానే గతంలో రిషి, వసు రెస్టారెంట్లో సాసర్ లో తాగడం గుర్తు చేసుకుని నేర్చుకున్నానని చెప్తాడు.  

వసు: కాఫీ సూపర్.. సాక్షి గారు మీరే కలిపారా అంటుంది. వెంటనే రిషి కూడా అవును సాక్షి కాఫీ చాలా బాగుందని అంటాడు.

కాఫీ నేను తెస్తే వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటున్నారా, దీన్ని ఎలాగైనా ఇరికించాలని సాక్షి మనసులో అనుకుంటుంది. వసుధార నీ డ్రెస్స్ లు ఏంటి ఎప్పుడు ఒకేలాగా అనిపిస్తాయని అంటుంది. ఆ మాటకి వసు ఫీల్ అవుతుంది. నేను ఎప్పుడు ఒకేలాగా ఉండే డ్రెస్స్లు వాడతాను అందుకే ఇలా ఉంటాయని చెప్తుంది. ఉన్నావే మూడు, నాలుగు డ్రెస్స్ లు అయ్యి ఉంటాయని వసు చిన్నబుచ్చుకునేలా మాట్లాడుతుంది. ఆ మాటకి రిషి కూడా బాధగా వసుని కింద నుంచి పై దాకా చూస్తాడు. 

ఇక జగతి దేవయాని దగ్గరకి వచ్చి గుడ్ మార్నింగ్ అక్కయ్య అంటుంది. ఏంటి పొద్దున్నే నాకు క్లాస్ ఇవ్వడానికి వచ్చావా అంటుంది. కరెక్ట్ గా చెప్పారు నేను క్లాస్ ఇవ్వడానికే వచ్చాను అక్కయ్య అంటుంది. అప్పుడే సాక్షి రిషి గది దగ్గర నుంచి కిందకు వస్తుంది. 

Also Read: తులసి మీద సామ్రాట్ మరో నింద- నందు, లాస్యకి చీవాట్లు పెట్టిన తులసి

జగతి: ఏంటి సాక్షి ఏం చేస్తున్నావ్ 

దేవయాని: జగతి సాక్షిని ఏం అంటున్నావ్ తనకి ఏమి తెలియదు. 

జగతి: నేను అదే అంటున్న అక్కయ్య, తనకి ఏం తెలియదు మీరు తనని పొల్యూట్ చెయ్యొద్దు 

సాక్షి: ఆంటీ ఏమంటున్నారు మీరు, దేవయాని ఆంటీ నన్ను పొల్యూట్ చెయ్యడం ఏంటి నేనేమి చిన్న పిల్లని కాదు కదా ఆంటీ అని అంటుంది. 

జగతి: నువ్వుచిన్న పిల్లవి కాదు సాక్షి కానీ సాధ్యాసాధ్యాలు చూసి మసులుకోవాలి. కాలేజీకి వస్తున్నావ్, ఇంటికి వస్తున్నావ్ నాకేం ప్రాబ్లెమ్ లేదు. కానీ కొత్త కొత్త ఆలోచనలు పన్నాగాలు పన్నితే నేను చూస్తూ ఊరుకొను ఇప్పుడే చెప్తున్నాను వార్నింగ్ ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ జగతి అని దేవయాని అనడంతో అక్కయ్య నేను మీకంటే గట్టిగా అరవగలను నిజానికి అబద్ధం కంటే ఎక్కువ గొంతు ఉంటుంది. కానీ మీలా నేను అరవను. మీకు అర్థం అయ్యేలా చెప్తా వినండి. సాక్షిని మీరు ఉద్దరిస్తున్నారని అనుకుంటున్నారు కానీ తనని మీరు చెడగొడుతున్నారు. సాక్షి నువ్వు బాగా విను నీ జీవితం నీ ఆలోచనలు నీ ఇష్టప్రకారం సాగాలి. జీవితంలో ఒకటి అనుకుంటాం అసాధ్యం అని తెలిసినప్పుడు దారి మళ్లించి ముందుకు వెళ్లిపోవాళి అంతే కానీ మొండిగా ప్రవర్తించకూడదు. చేసేవన్నీ చేసి మీకేం తెలియదని రిషిని నమ్మించగలరేమో కానీ నన్ను కాదు. జరిగినవన్నీ రిషికి చెప్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి.  లైబ్రరీలో ఏం చేశారు, అభినందన సభలో ఏం ప్లాన్ చేశారు, అసలు ఏం సాధించాలని అనుకుంటున్నారు. రిషి మనసుని కష్టపెట్టే పని ఏదైనా చేస్తే జరిగినవన్నీ డైరెక్ట్ గా వెళ్ళి రిషికి చెప్తాను. అప్పుడు సాక్షి మొహం చూడటం కాదు సాక్షి అనే పేరే వినడానికి కూడా ఇష్టపడడు అని గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. 

ఇదే విషయం గురించి జగతి ఆలోచిస్తుంటే మహేంద్ర ఏమైందని అడుగుతాడు. దేవయాని అక్కయ్య చాలా కోపంగా ఉన్నారు, రిషి వసులని చూసి రగిలిపోతున్నారు. ఏం చేస్తుందో ఎక్కడ కొత్త సమస్యలు తెస్తుందో రిషి మనసుని గాయపరుస్తుందో అని భయమేస్తుందని చెప్తుంది. జరిగేవన్ని చెప్పి నిన్ను టెన్షన్ పెట్టలేనని జగతి మనసులో అనుకుంటుంది. ఇక కాలేజీలో వసు, జగతి మాట్లాడుకుంటూ ఉండగా సాక్షి అక్కడికి వస్తుంది.

సాక్షి: మీ అబ్బాయిని నాకు ఇవ్వండి ఆంటీ, కాలేజీ ఎండీని వసుధారకి వదిలేయండి. ఎవరికి కావలసింది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. వసుధారకి కాలేజీ ఎండీతో మాత్రమే పని ఉంది, నాకు కాలేజీ అయిపోయిన తర్వాత కాలేజీ ముందు రిషి కావాలి..  

జగతి: ఇదే సాక్షి నీకు వద్దని చెప్పింది. మనకి ఏది సరైందో మనం ఎదుటి వాళ్ళకి సరైన వాళ్ళం కాదో లేదో తెలుసుకోవడం మన విజ్ఞత సాక్షి. రిషి నిన్ను వద్దన్నాడు, అయిన నువ్వు రిషి వెంట పడుతున్నావ్ నువ్వు ఇలా చేయడానికి కారణం ఎవరో నాకు తెలుసు, నీ వెనక ఎవరున్నారో కూడా నాకు తెలుసు కానీ ఇలా నీ టైమ్ వృదా చేసుకోవద్దని చెప్తుంది. నా వెనక ఎవరున్నారని సాక్షి అడుగుతుంది. నీ వెనుక ఎవరున్నారో నీకు తెలుసు నాకు తెలుసు అని జగతి అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: అదిత్యపై గెలిచిన మాధవ, దేవి వెళ్లిపోవడంతో కుమిలిపోయిన ఆదిత్య- నిజం ఎప్పటికైనా చెప్తానంటూ మాధవకి రాధ సవాల్

తరువాయి భాగంలో.. 

ఇక సాక్షి అన్న మాటలకి బాధపడిన మన మిస్టర్ ఇగో వసు కోసం కొన్ని డ్రెస్సులు తెచ్చి టేబుల్ మీద పెట్టుకుని చూస్తూ ఉంటాడు. వసుధార రియాక్షన్ ఎలా ఉంటుందో వీటిని చూసి ఏమంటుందో అని ఆలోచిస్తుండగా అక్కడికి వసు వస్తుంది. డ్రెస్సులు చూసి ఏంటి సర్ ఇవి అని అడుగుతుంది. ఇవి నీ కోసమే నేను ఏం చేసిన ఆలోచించి చేస్తానని అంటాడు. ఇప్పుడు నా డ్రెస్సింగ్ బాగోలేదని ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నారా అని సీరియస్ అవుతుంది. అప్పుడే సాక్షి వచ్చి వాటిని చూసి ఈవెంటీ అని అడుగుతుంది. వసుధార కోసం తెప్పించనని చెప్పడంతో వసు కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తావ రిషి అని సాక్షి రగిలిపోతుంది. వసుధార వీటిని తీసుకుందా రిషి అని వెటకారంగా అడుగుతుంది.  

Published at : 16 Jul 2022 02:54 PM (IST) Tags: Guppedantha Manasu Guppedantha Manasu serial Guppedantha Manasu Serial Today Episode Guppedantha Manasu Serial Today Episode Written Update Guppedantha Manasu Serial July 16th

సంబంధిత కథనాలు

Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ

Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ

Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్

Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్

Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్:  డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

Independence Day 2022 : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Independence Day 2022 : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Tejaswi Madivada Shocking Comments : అడల్ట్ కంటెంట్ చేయడంలో తప్పేముంది? - తేజస్వి షాకింగ్ కామెంట్స్

Tejaswi Madivada Shocking Comments : అడల్ట్ కంటెంట్ చేయడంలో తప్పేముంది? - తేజస్వి షాకింగ్ కామెంట్స్

టాప్ స్టోరీస్

KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?

KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?

India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ

India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ

Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!

Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!

PM Modi Speech Highlights: ఈ మార్గం చాలా కఠినం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం - గెలిచి చూపించాం: మోదీ

PM Modi Speech Highlights: ఈ మార్గం చాలా కఠినం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం - గెలిచి చూపించాం: మోదీ