News
News
X

Gruhalakshmi July 16th Update: తులసి మీద సామ్రాట్ మరో నింద- నందు, లాస్యకి చీవాట్లు పెట్టిన తులసి

పాపని కిడ్నాప్ చేసిన కేసులో ఇరుక్కున తులసిని పోలీసులు లాకప్లో పెడతారు. ఇక పాపకి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది నందు అనే విషయం తులసి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

తులసి మీద నువ్వు అంతగా కోప్పడకుండా ఉండాల్సింది అని సామ్రాట్ తో అతని బాబాయి అంటాడు. డబ్బు మనుషులన్నా, డబ్బు కోసం ఎటువంటి పని చేయడానికైనా వెనకాడని వాళ్ళంటే నాకెంత అసహ్యమో నీకు తెలుసు కదా బాబాయ్ అని సామ్రాట్ అంటాడు. ఎప్పుడో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని లోకాన్ని అదే కళ్ళతో చూడకని సలహా ఇస్తాడు. తులసి ఇలా మోసం చెయ్యకూడదు కొంగుచాపి అడిగి ఉంటే లక్షలు భిక్షంగా వేసేవాడిని. నా హనీని ఎత్తుకుపోయింది తన అంతు చూసేదాక వదలని అంటాడు. వాళ్ళ మాటలు హనీ వింటుంది. తులసి ఆంటీ చాలా మంచిది, నన్ను కిడ్నాప్ చేయలేదని చెప్పి జరిగిందంతా హనీ సామ్రాట్ వాళ్ళ బాబాయికి చెప్తుంది. నువ్వు చేసింది చిన్న తప్పు కాదమ్మా, చాలా పెద్ద తప్పు సాయం చేసిన మంచి మనిషిని బాధపడేలా చేశావ్ వల్ల ఫ్యామిలీ కష్టపడేలా చేశావని అంటాడు. నాన్నకి భయపడి అలా చేశాను తులసి ఆంటీకి ఏమి కాకూడదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి తాతయ్య అని హనీ అడుగుతుంది.   

బెయిల్ కోసం ఎంత ప్రయత్నించిన దొరకలేదని ప్రేమ్ వచ్చి చెప్తాడు. సామ్రాట్ కి వ్యతిరేకంగా కేసు తీసుకోవడానికి లాయర్లు భయపడుతున్నారని చెప్తాడు. తెల్లారితే మనల్ని కోర్ట్ కి తీసుకెళ్తారని పరంధామయ్య బాధపడతాడు. మనకి శిక్ష పడుతుంద తప్పించుకునే మార్గమే లేదా అని అనసూయ భయపడుతుంది. అప్పుడే సామ్రాట్ వల్ల బాబాయ్ పోలీసులకి ఫోన్ చేసి కేసు వాపస్ తీసుకుంటున్నాం తులసి వాళ్ళని రిలీజ్ చెయ్యమని చెప్తాడు. దీంతో పోలీసులు వాళ్ళని విడిచిపెడతారు. సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తులసితో మాట్లాడతాడు. జరిగిందంతా హనీ నాకు చెప్పింది. లోకం తెలియని ఓ చిన్న పిల్ల మాటలకు కట్టుబడి జైల్లో ఉండటానికి కూడా సిద్ధపడ్డ నీ వ్యక్తిత్వం ఎంటో అర్థమైందని అంటాడు. మా హనీని యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కనిపడిన తెలిసినా మాకు చెప్పమ్మా అని అడుగుతాడు. 

Also Read: అదిత్యపై గెలిచిన మాధవ, దేవి వెళ్లిపోవడంతో కుమిలిపోయిన ఆదిత్య- నిజం ఎప్పటికైనా చెప్తానంటూ మాధవకి రాధ సవాల్

ఇక తులసి నందు ఇంటికి వస్తుంది. అయిన దానికి కాని దానికి మా ఇంటి మీద పడి గొడవ చెయ్యడం మీ ఆయనకి అలవాటు కదా. ఇప్పుడు నేను నిలాదీద్దామని వచ్చానని తులసి అంటుంది. నందు ఏం తప్పు చేశాడని లాస్య అంటే యాక్సిడెంట్ చెయ్యడం తప్పు కాదా, దెబ్బలు తగిలి స్పృహ తప్పి పడిపోయిన పసిపిల్లని వదిలి వెళ్ళడం తప్పు కాదా. ఆ పాపకి ఏమైందో ఎలా ఉందో తెలుసుకోకపోవడం తప్పు కాదా అని నిలదీస్తుంది. ఆ మాటలకి నందు బాధగా తలదించుకుంటాడు. రోడ్డు మీద మీరు యాక్సిడెంట్ చెయ్యడం నేను కళ్ళారా చూశాను అందుకు సాక్షిని నేనే అని పోలీసులకు చెప్తాను. పాపని కిడ్నాప్ చేశానని కేసు పెట్టారు. నాతో పాటు మీ అమ్మానాన్నలని కూడా జైల్లో పెట్టారు. తప్పు చేసిన మీరు దర్జాగా తిరుగుంటే మేము మాత్రం నిందలు పడుతూ తలెత్తుకుని తిరగలేకపోతున్నామని తులసి ఆవేశంగా మాట్లాడుతుంది. పాప క్షేమంగా ఉంది కాబట్టి మిమ్మల్ని వదిలేశాను లేదంటే మా స్థానంలో మీరు స్టేషన్లో ఉండేవాళ్లు అని అరిచి వెళ్ళిపోతుంది. ఇదంతా నీ వల్లే అని నందు లాస్య మీద విరుచుకుపడతాడు. ఎవరేలా పోతే నీకెందుకు రేపు సామ్రాట్ కి సబ్మిట్ చేసే ప్రొజెక్ట్ సంగతి చూడమని లాస్య చెప్తుంది. 

Also Read: రిషి-వసు క్యూట్ రొమాన్స్ , దేవయాని-సాక్షి కాఫీ ప్లాన్ తిప్పికొట్టిన గౌతమ్

ప్రేమ్ పాటల పోటీలో గెలిచిన ప్రైజ్ మనీ చెక్ ని తల్లి చేతిలో పెడతాడు. మ్యూజిక్ స్కూల్ కోసం ఉపయోగించుకోమని చెప్తాడు. అది చూసి తులసి ఎమోషనల్ అవుతుంది. స్కూల్ కి వేరే దారి చూసుకున్నాను నువ్వు ఈ డబ్బుతో మ్యూజిక్ ఆల్బమ్ చెయ్యమని చెప్తుంది. నందు, లాస్య సామ్రాట్ ని కలుస్తారు. అప్పుడే సామ్రాట్ కి పోలీసులు ఫోన్ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ చూసాము కానీ ఎటువంటి క్లూ దొరకలేదని అంటాడు. లాకప్లో ఉన్న తులసి కూడా ఏం చెప్పలేదా అని అనడంతో తులసిని వదిలిపెట్టమని మీరే చెప్పారు కదా సార్ అని పోలీసు అంటాడు. ఆ మాటకి సామ్రాట్ సీరియస్ అవుతాడు. మీ బాబాయ్ ఫోన్ చేసి విడిచిపెట్టమని చెప్పారని పోలీస్ చెప్తాడు. అప్పుడే యాక్సిడెంట్ చేసింది సామ్రాట్ వాళ్ళ పాపకని నందుకి అర్థం అవుతుంది. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలా వాళ్ళకి నరకం చూపించాలని సామ్రాట్ అంటాడు. ఆ మాటలకి నందు టెన్షన్ పడతాడు. నందు పడే టెన్షన్ చూస్తే యాక్సిడెంట్ చేసింది నందు అనే అనుమానం వస్తుందేమో అని లాస్య మనసులో అనుకుంటుంటే మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారని సామ్రాట్ అడుగుతాడు. ఏమి లేదని లాస్య కవర్ చేస్తుంది. ఇక సామ్రాట్ నందుని తన కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్ గా అపాయింట్ చేస్తాడు.  నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నచ్చదు సిన్సియర్ గా ఉండాలని సామ్రాట్ నందుతో చెప్తాడు. 

తరువాయి భాగంలో.. 

తులసి ఇంటికి సామ్రాట్ హనీని తీసుకుని వస్తాడు. పాపని కిడ్నాప్ చేసిన మనిషికి గొలుసు దొంగతనం చెయ్యడం ఒక లెక్క అని సామ్రాట్ తులసి మీద అరుస్తాడు. గొలుసు కోసం ఇల్లంతా వెతకమని పని వాళ్ళకి చెప్తాడు. తులసి వాళ్ళు ఏమి అర్థంకాక నిలబడి చూస్తూ ఉంటారు. 

Published at : 16 Jul 2022 08:39 AM (IST) Tags: Gruhalakshmi serial Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial July 16th

సంబంధిత కథనాలు

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్  పెంచేస్తున్న రాశీ ఖన్నా