Devatha Jul 16th Update: ఆదిత్యపై గెలిచిన మాధవ, దేవి వెళ్లిపోవడంతో కుమిలిపోయిన ఆదిత్య- నిజం ఎప్పటికైనా చెప్తానంటూ మాధవకి రాధ సవాల్
ఆదిత్య దగ్గర నుంచి దేవిని ఎలాగైనా రప్పించి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాలని మాధవ కుట్ర పన్నుతాడు. అందుకు సత్యని పావుగా ఉపయోగించుకున్నాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
బోనాల పండక్కి ఇంటికి తీసుకొద్దామని అనుకుంటే నేను రాను నాన్న అని నా మొహం మీదే చెప్పేసింది. మాట్లాడకుండా వచ్చేశాను. పండగ సత్య ఎవరి ఇళ్ళల్లో బోనాలు వాళ్ళు ఎత్తుకుంటారు. భార్య పిల్లలు బోనాలు ఎత్తుకుంటుంటే ఆ ఇంటి యజమాని చూసి సంతోషిస్తాడు. కానీ నా ఇంటి బిడ్డ ఎవరో ఇంట్లో బోనం ఎత్తింది. కనీసం పండగ పూట మా ఇంట్లో మాతో పాటు భోజనం చేస్తే సంతోషిస్తాను. కానీ నాకు ఆ అదృష్ఠం కూడా ఇచ్చేలా లేరు. నీకు తెలియదు సత్య నా కూతుర్లే నా ప్రాణం, ప్రపంచం. వాళ్ళని కనీసం కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా మీరు లేకుండా చేశారు. చూడకుండా ఉండలేక అప్పటికి మీ ఇంటికి వచ్చాను. నన్ను చూసైనా నా కూతురు నా ఇంటికి వస్తుందని. కానీ తనతో రానని చెప్పించారు. ఎప్పటిలాగా ఎదురు తిరిగి మాట్లాడి తీసుకొద్దామని అనుకుంటే నా కూతురు మీద ప్రేమతో నేను మాట్లాడే మాటలు ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అనే భయంతో అక్కడినే ఆగిపోయాను' అని బాధపడుతునట్టు నటిస్తూ మాట్లాడతాడు. ఆ మాటలన్నీ దేవి వింటుంది. మీరు ఇంతలా బాధపడతారని అనుకోలేదు బావగారు అని సత్య అంటుంది. తండ్రినమ్మ బాధ లేకుండా ఎలా ఉంటుందని కల్లబొల్లి మాటలు చెప్తాడు. నువ్వే ఎలాగైనా చెప్పి నా కూతుర్ని నాతో పంపిస్తావా అని మాధవ సత్యని అడుగుతాడు. ఆదిత్యతో మాట్లాడి నేను ఒప్పించి పంపిస్తానని సత్య చెప్తుంది. ఇక మాధవ రాక్షసంగా నవ్వుకుంటాడు.
ఇక దేవి మాధవ మాటలన్నీ విని ఒక చోట బాధగా నిల్చుని ఉంటే అక్కడికి ఆదిత్య వచ్చి ఏమైందని అడుగుతాడు. ఇక దేవిని వల్ల ఇంటికి పంపిచేద్దామని సత్య ఆదిత్యతో చెప్తుంది. పండగ పూట తమ బిడ్డ ఇంట్లో ఉండాలని అనుకుంటారు అలాగే దేవి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా భాధ పడుతుంటారని అంటుంది. చెస్ పోటీలు అయిపోయిన తర్వాత పంపిద్దామని అందరూ చెప్పిన సత్య మాత్రం దేవి వాళ్ళ ఇంట్లో అందరూ బాధపడతారు అని చెప్తుంది. ఇందాక దేవిని చూడగానే వాళ్ళ ముఖాలు వెలిగిపోయాయని అది గమనించారా అంటే దేవి తన ఇంట్లో కాకుండా వేరే వాళ్ళ ఇంట్లో బోనం ఎత్తితే లోలోపల ఎంత బాధ పడతారని అంటుంది. ఇక దేవి కూడా నేను మా ఇంటికి పోతాను అని మాధవ దగ్గరకి వెళ్ళిపోతుంది. మన ఇంటికి పోదామని చెప్పి వెళ్ళిపోతుంది. మాధవ తానే గెలిచాను అన్నట్లుగా ఆదిత్య వైపు గర్వంగా చూస్తాడు. దేవిని మాధవ తీసుకుని వెళ్ళిపోవడంతో రుక్మిణి, ఆదిత్య బాధ పడతారు.
Also Read: రిషి-వసు క్యూట్ రొమాన్స్ , దేవయాని-సాక్షి కాఫీ ప్లాన్ తిప్పికొట్టిన గౌతమ్
'గుడిలో నీ కళ్ల ముందే మాధవ సారు నా బిడ్డని దూరం చేయడానికి ఎన్ని కథలు పడుతున్నాడో నువ్వు చూస్తూనే ఉన్నావ్ కదా. నా పెనిమిటి మంచిగా ఉండాలి, నా బిడ్డ వాళ్ళ దగ్గరకి చేరాలని ఆశపడుతున్నా కానీ అందుకు మాధవ సారు అడ్డుపడుతూనే ఉన్నాడు. అలా అని నేను చూస్తూనే ఉంటే నా బిడ్డ వాళ్ళ నాయనకి దూరం అవుతుంది. అలా కాకూడదు దేవిని ఎలాగైనా వాళ్ళ నాయన దగ్గరకి చేరేలా చూస్తాను. నేను అనుకునేది జరిగేటట్టు చూడు తల్లి' అని రుక్మిణి మొక్కుకుంటుంది. ఇక ఆదిత్య ఒక్కడే చెస్ ఆడుకుంటూ దేవిని గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. 'నా ఆనందాన్ని బలవంతంగా లాక్కుని పోతున్నా అది నా రక్తం అని చెప్పలేకపోతున్న. దేవి నా ఇంట్లో నా కళ్ల ముందు తిరుగుతూ ఉంటే ఎంత బాగుందో ఇప్పుడు తను లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయింది' అని మనసులోనే మథనపడతాడు. ఆదిత్య బాధని గమనించిన సత్య దేవి గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు ఆ మాధవ నీతో ఎప్పుడు గొడవ పెట్టుకునేందుకే చూస్తాడు. కానీ నువ్వు మాత్రం ఎందుకు దేవి కోసం ఆరాటపడతావ్ అని అడుగుతుంది. ఎందుకంటే దేవి నా బిడ్డ కాబట్టి అని ఆదిత్య కోపంగా అరవడంతో ఆ మాటకి సత్య షాక్ అవుతూ ఏంటి అని అంటుంది. అదే నా బిడ్డ లాగా చూసుకుంటున్న అందుకే దేవి నాకు ఎప్పుడు పరాయి బిడ్డగా అనిపించదని కవర్ చేస్తాడు.
Also Read: జైల్లో తులసి, నందుని కాపాడేందుకు ప్రయత్నం- యాక్సిడెంట్ చేసింది నందునే అని సామ్రాట్ కి తెలుస్తుందా?
మరోవైపు మాధవ దేవిని తీసుకుని ఇంటికి వచ్చిన సంఘటన గుర్తు చేసుకుని రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మాధవ వచ్చి గుడిలో అలా చేశానని బాగా ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. నేను అలా చేయకపోతే నువ్వు ఏం చేసేదానివో నాకు తెలియదు అనుకున్నవా. దేవిని ఆ అదిత్యకి దక్కేల చెయ్యాలని చూస్తున్నావ్ అంతే కదా అని అంటాడు. అంటే చాటుగా చేరి మా మాటలు వింటున్నవా అని రుక్మిణి కోప్పడుతుంది. విన్నాను కాబట్టే జాగ్రత్త పడ్డాను. 'నువ్వు నాకు దూరం కాకుండా ఉండాలంటే వినాలి కదా. అందుకే నేను నీ నీడలా నీ వెంటే ఉన్నాను, అన్నీ విన్నాను. దేవిని నా నుంచి దూరం చెయ్యాలని నీ ఆలోచన నేను వినగానే నేను కూడా షాక్ అయ్యాను. మంచివాడిని నాతో ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావ్' అని మాధవ అడుగుతాడు. ఆ మాటలకి రుక్మిణి కోపంగా ఏంది సారు మీ మంచితనం పెనిమిటిని, పెండ్లాన్ని ఒకటి కాకుండా చూస్తున్నావ్ అదా నీ మంచితనం. నీడ ఇచ్చిన ఇల్లు కదా ఎవరు బాధపడకుండా చూసుకోవాలని అనుకోవడం నేను చేసిన తప్పా అని కోపంగా అరుస్తుంది. మీరు మీరు ఒక్కటి అయిపోతే మరీ నేను నా కూతురు ఏమవాలని అంటాడు. 'నిజం నేను ఎక్కడో చెప్తానో అని గీ పొద్దు నా బిడ్డని తీసుకొచ్చారు. ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా నేను నిజం చెప్పేది చెప్పేదే. నా బిడ్డకి ఆ ఆఫీసర్ సారె మీ నాయన అని చెప్తా. రేపు నా బిడ్డ వాళ్ళ నాయన తోనే పోటీలకి పోతుంది అది నువ్వు ఎలా ఆపుతావో చూస్తా' అని సవాల్ చేసి వెళ్ళిపోతుంది.