Gruhalakshmi July 15th Update: జైల్లో తులసి, నందుని కాపాడేందుకు ప్రయత్నం- యాక్సిడెంట్ చేసింది నందునే అని సామ్రాట్ కి తెలుస్తుందా?
పాపని కిడ్నాప్ చేసిన కేసులో తులసిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక యాక్సిడెంట్ చేసింది నందు అనే విషయం తులసి కుటుంబ సభ్యులకి చెప్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
తులసి పాపని ఇంటి దగ్గర దింపేందుకు అన్నీ ఇళ్ళు చూపిస్తూ ఇదేనా అని అడుగుతూ ఆటోలో తిరుగుతూ ఉంటుంది. మీ ఇల్లు ఎక్కడో చెప్పమ్మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారని అడుగుతుంది. సామ్రాట్ కూడా పాప కోసం వెతుకుతూ ఉంటాడు. ఊరంతా తిప్పిస్తుంది కానీ పాపకి ఇల్లు మాత్రం గుర్తుకురావడం లేదు నేనేమో డాన్స్ స్కూల్ కి వెళ్ళాలి అని అనుకుంటుంది. పోలీసులు సామ్రాట్ పాపని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరో తెలిసిపోయిందని చెప్పి ఫోన్లో తులసి హనీతో ఉన్న ఫోటో చూపిస్తారు. అర్జెంట్ గా ఆమె ఎవరో తెలుసుకుని ఇంటి మీద ఎటాక్ చెయ్యమని చెప్తాడు. పోలీసులు తులసి ఇంటికి వచ్చి ఇల్లంతా వెతుకుతారు. పరంధామయ్య ఏంటి ఇదంతా అని అడుగుతాడు. తులసి ఎవరు బయటకి పిలవండని అరుస్తాడు. ఈల్లు మొత్తం వెతికాం ఇంట్లో ఎవరు లేరని కానిస్టేబుల్స్ చెప్తారు. పాపని కిడ్నాప్ చేసిన ఆమె ఇంటికి వచ్చాం సార్ ఆమె ఇంట్లో లేదని సామ్రాట్ కి ఫోన్ చేసి చెప్తారు, అయితే ఇంట్లో ఉన్న వాళ్ళనిస్టేషన్ కి తీసుకురండి కిడ్నాపర్ ఎక్కడ ఉన్న వెతుక్కుంటూ వస్తుందని చెప్తాడు. దీంతో పోలీసులు అనసూయ, పరంధామయ్యను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి ఏం జరిగిందని అడుగటంతో దివ్య, అంకిత మొత్తం చెప్తారు.
Also Read: శాడిస్ట్ లా తయారైన శౌర్య - హిమ అనుకుని రౌడీబేబీకి మళ్లీ ఐ లవ్ యూ చెప్పిన డాక్టర్ సాబ్
అంకిత తులసికి ఫోన్ చేసి ఇంట్లో జరిగిందంతా చెప్పడంతో షాక్ అవుతుంది. ఏమైంది ఆంటీ అని హనీ అడుగుతుంది. నిన్ను కిడ్నాప్ చేశామని మీ డాడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట మా వల్లఅని తీసుకెళ్ళి జైల్లో పెట్టారని చెప్తుంది. సారీ ఆంటీ నేను సరదాగా తిరగాలని ఇలా చేశాను మా ఇంటి అడ్రెస్ సరిగా చెప్తాను కానీ నేను ఇలా మిమ్మలని ఊరంతా తిప్పించినట్టు మా డాడీకి చెప్పకండి అని బతిమలాడుతుంది. అలా చెప్తే నన్ను ఎప్పుడు ఇంక బయటకి రానివ్వరని అంటుంది. అందుకు సరే అనడంతో తులసి పప్ని ఇంటి దగ్గరకి తీసుకుని వెళ్తుంది. ఇక సామ్రాట్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. తులసిని వెంటనే తీసుకొచ్చి చావబాదండి అని పోలీసుల మీద అరుస్తాడు. అప్పుడే తులసి పాపని తీసుకుని స్టేషన్ కి వస్తుంది. సామ్రాట్ వెంటనే పోలీస్ దగ్గర నుంచి గన్ తీసుకుని తులసి తలకి పెట్టి హనీని కిడ్నాప్ చేస్తావా అని అడుగుతాడు. నేనేం కిడ్నాప్ చెయ్యలేదు రోడ్డు మీద హాసిని వెళ్తుంటే కారు గుద్ది వెళ్ళిపోయింది నేనే కాపాడి పాపని హాస్పిటల్ కి తీసుకెళ్ళి వైద్యం చేయించానని చెప్తుంది.
Also Read: కైలాష్ కి యష్ స్వీట్ కూల్ వార్నింగ్, సారిక కోసం వెతుకులాట- యష్, వేద క్యూట్ రొమాన్స్
అదేమీ నమ్మని సామ్రాట్ ఆ కారు నెంబర్ చెప్పు అంటే నందు, లాస్య కారులో ఉన్న విషయాన్ని తులసి గుర్తు చేసుకుని చూడలేదని అబద్దం చెప్తుంది. దీంతో నువ్వు చెప్పేవి అన్నీ అబద్ధాలు. మీరు కిడ్నాప్ చేసే గ్యాంగ్ అని తిడతాడు. పాపని ఎవరో తెలియదన్నపుడు పోలీస్ స్టేషన్లో అప్పగించకుండా ఎందుకు షికార్లు చేస్తున్నావ్ అని ప్రశ్నిస్తాడు. ఆమెని తీసుకెళ్ళి లాకప్ లో వేయండి అస్సలు జాలి చూపించొద్దని చెప్తాడు. తప్పు చేస్తున్నారు కావాలంటే నన్ను తీసుకెళ్ళి లోపల వేయండి కానీ మా వల్లఅని మాత్రం వదిలిపెట్టమని అడుగుతుంది కానీ పోలీసులు వినకుండా తులసిని లాకప్ లో పెడతారు. ఇక నందు జరిగిందంతా తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ్ తులసి దగ్గరకి వచ్చి వాళ్ళ అంతు చూస్తానని రగిలిపోతాడు. పాపకి యాక్సిడెంట్ జరిగినప్పుడు నిజంగానే నువ్వు చూశావా అని పరంధామయ్య అడగ్గా చూశానని చెప్తుంది. మరి వాళ్ళ గురించి పోలీసులకి చెప్పమ్మా అని అంటాడు. నేను చెప్తే మీ అబ్బాయిని తెచ్చి లోపల పడేస్తారు, ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు మీ కొడుకే అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడటానికి ఇల్లేదని తులసి ఆర్డర్ వేస్తుంది. బెయిల్ కోసం లాయర్ తో మాట్లాడమని చెప్పి ప్రేమ్ ని పంపించేస్తుంది.
తరువాయి భాగంలో..
నందు, లాస్య సామ్రాట్ ని కలుస్తారు. మా పాపని యాక్సిడెంట్ చేసిన వల్ల గురించి ఏమైనా తెలిసిందా అని ఫోన్లో పోలీసులని సామ్రాట్ అడుగుతాడు. లాకప్లో ఉన్న తులసి కూడా ఏం చెప్పదమా లేదా అని అడుగుతాడు. వాళ్ళకి నేను నరకం చూపిస్తానని అంటాడు. ఆ మాటలు విని నందు ఆశ్చర్యపోతాడు.