News
News
X

Ennenno Janmala Bandham July 15th Update: కైలాష్ కి యష్ స్వీట్ కూల్ వార్నింగ్, సారిక కోసం వెతుకులాట- యష్, వేద క్యూట్ రొమాన్స్

వేద నిజాయితీని నిరూపించేందుకు యష్ ప్రయత్నిస్తుంటాడు. అందుకోసం సారికను వెతికి పట్టుకునేందుకు వెళతాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

వేద కారు చెడిపోవడంతో యష్ దాన్ని బాగుచేస్తాడు. ఆ క్షణంలో ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. 'సారీ వేద నా వల్ల నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. కానీ నేను ఎంత బాధ పడుతున్నన్నవ్ నీకు తెలియదు. నీ మీద పడ్డ నిందను నేను నమ్ముతాన, నీ నిజాయితీని నేను సంకిస్తాన అది కలలో కూడా జరగదు. నువ్వు నిర్ధోషివని నేను నా నోటితో చెప్పడం కాదు ఋజువులతో సహా నిరూపిస్తాను. అందరి కళ్ళు తెరిపిస్తాను. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాను. నేను నిన్ను గెలిపిస్తాను అందుకే వెళ్తున్నా' అని యష్ మనసులో అనుకుంటాడు. వేద నిర్దోషి కైలాష్ దోషి అని నిరూపించడానికి ఉన్న ఒకే ఒక ఏఆధారం ఆ సారిక. ఇప్పుడు వెళ్ళి ఆ సారికను పట్టుకుంటే అన్నీ నిజాలు బయటికి వస్తాయి అన్నీ ప్రాబ్లమ్స్ తీరిపోతాయని అనుకుంటాడు. సారిక ఫోటో చూపిస్తూ అందరినీ అడుగుతూ వెతుకుతుంటాడు. సారిక గతంలో ఉన్న ఇంటికి వెళతాడు కానీ అక్కడ ఆమె ఖాళీ చేసి వెళ్లిపోయిందని చెప్తారు. 

ఖుషి అన్నం తిననని మారాం చేస్తుంటుంది. దీనికి అన్నం తినిపించడం నా వల్ల కాదు అని కాంచన మాలినికి చెప్తుంది. అమ్మ తినిపిస్తేనే తింటా లేకపోతే లేదు అని ఖుషి అన్నం విసిరేయడంతో మాలిని కొట్టేందుకు చెయ్యి ఎత్తితే రత్నం ఆపేస్తాడు. అదంతా వేద చూస్తూ ఉంటుంది. ఖుషికి అన్నం తినిపించమ్మా అని రత్నం వేద దగ్గరకి పంపిస్తాడు. వేద ప్రేమగా ఖుషికి అన్నం తినిపిస్తూ పొంగిపోతుంది. ఆ సీన్లో తల్లీబిడ్డల ప్రేమ హృదయాన్ని కట్టిపడేస్తుంది. ఇక కైలాష్ సారికకి ఫోన్ చేస్తాడు. నేను చెప్పేవరకు నువ్వు బయటకి రాకు, నేను చెప్పినట్టే వినాలి తేడా వచ్చిందంటే మీ అమ్మ బెడ్ ఖాళీ అవుతుందని బెదిరిస్తాడు. ఆ మాటలను చాటుగా యష్ వింటాడు. వాడు వెళ్ళగానే యష్ వచ్చి ఫోన్ తీసుకుని చెక్ చేస్తాడు. 

Also Read: అదిరిపోయే సీన్, నిజం తెలుసుకున్న యష్- ఇక కైలాష్ కి దబిడి దిబిడె

తర్వాత ఏమి తెలియనట్టు యష్ కైలాష్ గదిలోకి వస్తాడు. 'నిన్నటి నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్న కానీ మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం చేయలేక రాలేకపోయాను. మీ విషయంలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం నాకు బాధగా అనిపించిది. అందుకే మీ గురించి నిజం అందరికీ తెలియాలి. అసలు మీరెంటో అందరి ముందు నిరూపించాలి. నిరూపిస్తాను. మీ నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేసి మా అక్క కళ్ళు తెరిపిస్తా. మీ గురించి నాకు తెలుసు. అందరూ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా మా అక్క.. అది ఎంత గుడ్డిదంటే మీరు నక్కని చూపించి కుక్క అన్నా నమ్మేస్తుంది. పాపం పిచ్చిది. త్వరలోనే మీ గురించి అందరూ తెలుసుకుంటారు' అని మాట్లాడుతూ స్వీట్ గా కూల్ గా వార్నింగ్ ఇచ్చి ఇవ్వనట్టు అలా ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏదో తేడాగా ఉంది బావ చూపు మాటతీరు తేడాగా ఉంది, సారిక విషయం ఏమైనా తెలిసిపోయిందాని కైలాష్ భయపడతాడు. ఇక వేద యష్ గదికి వస్తుంది. యష్ తో చిలిపిగా పోట్లాడి మరీ తనకి నచ్చిన డ్రెస్ వేద వేస్తుంది. ఆ సీన్లో ఇద్దరి మధ్య ఓ సాంగ్ వేసి అద్భుతంగా చూపించారు. 

Also Read: వసు అనే చిక్కు లెక్కని పరిష్కరించే పనిలో లెక్కల మాస్టారు రిషి, జగతి దెబ్బకు సైలెంటైపోయిన దేవయాని

Published at : 15 Jul 2022 07:17 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial Today Ennenno Janmalabandham Serial July 15th

సంబంధిత కథనాలు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

టాప్ స్టోరీస్

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Election For Congress Chief: కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!

Election For Congress Chief: కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!