News
News
X

Ennenno Janmalabandham July 14th Update: అదిరిపోయే సీన్, నిజం తెలుసుకున్న యష్- ఇక కైలాష్ కి దబిడి దిబిడె

మాళవిక బారి నుంచి ఖుషి ని వేద కాపాడుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

వేద తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని బాధపడుతూ ఏడుస్తుంది. నువ్వు నీ కూతుర్ని మాళవిక బారి నుంచి కాపాడుకున్నావ్ కదమ్మా ఇంక ఎందుకు ఏడుస్తున్నావ్ అని వేద తండ్రి  అడుగుతాడు. ఖుషి కోసమే మళ్ళీ ఆ గడప తొక్కాను, కానీ ఆ రోజు ఆ ఇంట్లో జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నాను చాలా బాధగా ఉందని అంటుంది. బాధపడాల్సింది నువ్వు కాదు..  ఆ ఇంటి వాళ్ళకి అడుగడుగునా కష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి దేవతలా కాపాడుకున్నావ్ అలాంటి నిన్ను వదులుకున్నందుకు వాళ్ళు బాధ పడాలి నువ్వు కాదని సులోచన ధైర్యం చెప్తుంది. ఈరోజు నువ్వు చేసిన పనికి నీ తల్లిగా నేను గర్వపడుతున్నాను నీ స్థానంలో నేను ఉన్న కూడా ఇదే పని చేసి ఉండేదాన్ని. ఈరోజు నీ బిడ్డ కోసం నీ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి నీ కూతుర్ని కాపాడుకున్నావ్ ఒక తల్లిగా ఏం చేయాలో అదే చేశావ్ నాకు చాలా సంతోషంగా ఉందని సులోచన వేదని మెచ్చుకుంటుంది. 

Also Read: క్లైమాక్స్ కి చేరుతున్న 'కార్తీకదీపం', వీడిపోతున్న చిక్కుముడులు - హిమ-శౌర్య విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నడాక్టర్ సాబ్

యష్ తన గదిలోకి వచ్చి వేద ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నది సంఘటన గుర్తు చేసుకుని కుమిలిపోతాడు. ఇంత చేసిన వదినకి థాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేస్తావా అని వసంత్ వచ్చి యష్ ని నిలదీస్తాడు. ఖుషిని నీ దగ్గర నుంచి వెళ్ళకుండా కాపాడుకుంది అలాంటి వదినకి నువ్వు చేసేది ఇదేనా అని అరుస్తాడు. అంత మంచి భార్యకి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా భర్తగా నువ్వు జీరో అని అంటాడు. ఆ మాటకి యష్ కోపంగా వసంత్ కాలర్ పట్టుకుంటాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా అని వేద నన్ను అడిగింది  కానీ నేను కనీసం వేద మొహం కూడా చూడలేదు రా ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఫేస్ చేయాలి అని వసంత్ ముందు తన బాధ వెళ్లగక్కుతాడు. వేద తప్పు చెయ్యడం ఏంటి, తన కారెక్టర్ ఏంటో అందరికంటే నాకే బాగా తెలుసు తాను ఎప్పటికీ తప్పు చేయదు అని యష్ అంటాడు.

'ఆ కైలాష్ గాడిని ఏం చేయను నా చేతులు కట్టేసినట్టు అయింది అదే పరాయివాడు అయితే నా భార్యని టచ్ చేసినందుకు ఈ పాటికి వాడి చేతులు నరికేసేవాడిని కానీ వాడు నా అక్క మొగుడు. తన భర్త నిర్దోషి అని నమ్ముతుంది. వాడంటే మా అక్కకి ప్రాణం. తన నమ్మకం అబద్ధం అని మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. దాని కోసమే నా ప్రయత్నం, మా అక్క మనసు నొప్పించకుండా వాడి తప్పు ఎట్టి చూపించాలనే నా తాపత్రయం అదే నేను చేస్తున్నాను' అని చెప్తాడు. నాకు ఇప్పటికప్పుడు వేద దగ్గరకి వెళ్ళి సారీ చెప్పి నాదగ్గరకి వచ్చేయ్ అని అడగాలని ఉంది కానీ అది చేస్తే అంత కన్న అన్యాయం ఉండదు అప్పుడు వేదకి ద్రోహం చేసినట్టు అవుతుందని అంటాడు. 'నా భార్యని నిప్పుల్లో దూకమనే భర్తని కాదు రా నేను నా భార్య కోసం నేను నిప్పుల్లో దూకే భర్తని. కానీ నా బాధ అంతా ఒక్కటే వేద కూడా నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయింది. అందుకే వేద మీద నాకు కోపం. నా వేద ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను తప్పు చేసిన వాడి తాట తీస్తాను. ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఉంది ఏమి చేయలేక కాదు వాడిని గమనిస్తూనే ఉన్నాను. నా భార్య ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి నాకు ఒక దారి దొరికింది'  అని యష్ అంటాడు. 

ఇక అభిమన్యు యష్ జడ్జ్ కి దొరికిపోయి ఉంటాడని సంబరపడుతుంటాడు. నీ ఆయువుపట్టు నీ కూతురే తనని నీ దగ్గర లేకుండా చేస్తా అని అనుకుంటూ ఉండగా మాళవిక ఎంట్రీ ఇస్తుంది. ఖుషి ఎక్కడా అని అడుగుతాడు. ఆ వేద మళ్ళీ మనకి షాక్ ఇచ్చింది. యష్ జుట్టు నా చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయింది. చివరి నిమిషంలో ఆ వేద వచ్చి అంతా చెడగొట్టిందని చెప్తుంది. దాంతో అభి గట్టిగా అరుస్తాడు. ఏదో ఒక రోజు వల్ల బండారం బయటపడుతుంది అది మన వల్లే జరుగుతుందని అంటాడు. కైలాష్ వేద ఫోటో చూస్తూ ఉండగా అక్కడకి యష్ కోపంగా వస్తాడు. ఆ సీన్ అదిరిపోతుంది. యష్ ని చూసి కైలాష్ వణికిపోతాడు. సారిక నీకు తెలుసా అంటే తెలుసని కైలాష్ చెప్తాడు. ఎలా తెలుసని యష్ అడిగేసరికి కైలాష్ నీళ్ళు నములుతాడు. చెల్లెమ్మ పరిచయం చేసిందని చెప్తాడు. పెరట్లో పెరిగింది తులసి మొక్క కాదు కలుపు మొక్క అని తెలిసాక ఉంచకూడదు తుంచేయ్యాలి అని యష్ అంటుంటే కైలాష్ బిత్తరపోతాడు. ఏంటి యశోధర్ చూపుల్లో తేడా, మాటల్లో తేడా కొంపతీసి నా గురించి ఏమైనా తెలిసిందా తెలిసే ఛాన్స్ లేదు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలని కైలాష్ అనుకుంటాడు.  

Also Read: తులసి తలకి గన్, కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న అనసూయ, పరంధామయ్య

యష్ వెళ్లిపోగానే కైలాష్ సారికకి ఫోన్ చేస్తాడు. అంతా నేను చెప్పినట్టే చేశావ్ కదా అని అడుగుతాడు చేశానని చెప్తుంది. ఎవరైనా మన విషయం గురించి అడిగారా అని కైలాష్ సారికను అడగ్గా ఆడగలేదని బదులిస్తుంది. మరి మా బావ సారిక గురించి ఎందుకు అడిగాడు నా మీద అనుమానంతో అడిగాడా లేక ఊరికే అడిగాడా అని ఆలోచిస్తాడు. అదంతా చాటుగా యష్ విని రగిలిపోతాడు.  

తరువాయి భాగంలో.. 

యష్ సారికను కలుస్తాడు. అసలేం జరిగింది, ఆ కైలాష్ కి నీకు ఏంటి సంబంధం అని అడుగుతాడు. ఒక దుర్మార్గుడు నన్ను లొంగదీసుకున్నాడు అతడు ఎవరో కాదు మీ సిస్టర్ భర్త కైలాష్. నాకు న్యాయం చేయడానికి నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లింది వేద మేడమ్ కానీ నేను ఆఖరి నిమిషంలో మాట మార్చి వేద మేడమ్ ని ఇరికించాను. ఆ కైలాష్ మా అమ్మని చంపేస్తానని బెదిరించాడు అందుకే ఇదంతా చేయాల్సి వచ్చిందని చెప్తుంది. 

 

 

Published at : 14 Jul 2022 07:45 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial Today Ennenno Janmalabandham Serial July 14th

సంబంధిత కథనాలు

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

టాప్ స్టోరీస్

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?