Guppedantha Manasu ఫిబ్రవరి 26 ఎపిసోడ్: రిషి-వసుని అలా చూసి ముక్కలైన గౌతమ్ మనసు

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి-వసు ఇద్దరికీ ఒకరిపై మరొకరికి కొండంత ప్రేమ ఉన్నా ఆ విషయంలో ఇద్దరూ బయటపడడం లేదు. ఫిబ్రవరి 26 శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…

FOLLOW US: 

గుప్పెడంత మనసు ఫిబ్రవరి 26 శనివారం ఎపిసోడ్

రిషి-జగతితో ఎపిసోడ్ మొదలైంది. 
మీరు నాకో చిన్న హెల్ప్ చేయాలన్న రిషి...రేపు షార్ట్ ఫిలిం చూసేందుకు మినిస్టర్ గారు వస్తున్నారు, మీడియా కూడా ఉంటుంది అనగానే... అర్థమైంది సార్ నన్ను ఆ ప్రోగ్రామ్ కి రావొద్దంటున్నారా అనగానే...ఈ ప్రోగ్రాం కి రూపకర్త మీరు మిమ్మల్ని రావొద్దని ఎలా అంటానన్న రిషి...కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్  అయిన మహేంద్ర భూషణ్ గారికి మీరు కొంచెం దూరం పాటించాలని చెబుతాడు. మీ వ్యక్తిగత జీవితంలో మీకు చెప్పే అధికారం నాకు లేదు, అది మర్యాద కాదు కానీ కాలేజీ ఫ్యాకల్టీ హెడ్ గా మీరు కాలేజీలో మాత్రం మీరు డాడ్ కి కాస్త దూరాన్ని పాటించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ చాలామంది ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పలేపోతున్నాను, మీ చనువు చాలామందికి ఓ టాపిక్ గా మారకూడదనే ముందు జాగ్రత్తగా చెబుతున్నా అంటాడు. గౌతమ్ అడిగిన దానికి సమాధానం చెప్పలేపోయాను ఇక వేరేవాళ్లతో అడిగించుకోవడం బావోదు, ఈ టాపిక్ లో ఒకరికి సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు అన్నదే నా  ఆలోచన అంటూనే చిన్న రిక్వెస్ట్ అన్న రిషి మాటలకు అడ్డుపడుతూ ఈ విషయం మహేంద్ర సార్ కి చెప్పను సార్ అంటుంది జగతి. 

దేవయాని-ధరణి
కాలేజీ ఫంక్షన్ కి దేవయాని, ధరణి కారులో వెళుతుంటారు. ఏంటి విశేషాలు , నాకు కాలేజీకి రావాలని-ప్రోగ్రామ్స్ చూడాలని ఏమీ ఉండదు కానీ రిషి బాధపడతాడు, నేనొచ్చి మెచ్చుకుంటూనే రిషి హ్యాపీగా ఉంటాడని అంటుంది. ఎందుకు అత్తయ్యగారు గాలిపీల్చినంత ఈజీగా అబద్ధాలాడతారు అనుకుంటుంది ధరణి. ఏంటీ ఏం మాట్లాడవ్ , అక్కడకు వచ్చి ఏమీ మాట్లాడకుండా అలా చూడకు సంతోషంగా ఉండు అని చెబుతుంది. నాలాంటి అత్త నీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పు, కన్నతల్లిలా చూసుకుంటున్నా కదా...అయినా నేనంటే గౌరవమే ఉండదేంటి అని దేవయాని అంటే...మీలాంటి అత్తగారు దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలని బయటకు అనేసి... కన్నతల్లి అనే పదం చాలా గొప్పది ఎంతో అవలీలగా వాడేశారు అని లోపల అనుకుంటుంది. దేవయాని మాత్రం దీన్ని అప్పుడప్పుడు పొగడకపోతే తిరుగుబాటు చేసినా చేస్తుంది అనుకుంటుంది.

Also Read: ఆనంద్ విషయంలో దీప ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది
కాలేజీలో షార్ట్ ఫిలిం ప్రజెంట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుంటాయి. అక్కడకు వచ్చిన గౌతమ్...వసుధార నేనున్నాను కదా నీకెందుకు నాకు చెప్పొచ్చు కదా అంటాడు. మీకు నేను పనెలా చెబుతాను అంటే నన్ను దూరం పెట్టకు అంటాడు. ఇంతకీ షార్ట్ ఫిలింలో మన నటన ఎలా ఉందని అడిగితే కాసేపట్లో స్క్రీన్ పై మీరే చూస్తారుకదా అంటుంది. మహేంద్రసార్, జగతి మేడం మినిస్టర్ దగ్గరకు వెళుతున్నారు వాళ్లకి ఇవ్వడానికి అంటూ పుష్ప బొకే తీసుకెళుతుంటే అందులోంచి ఓ ఫ్లవర్ తీసుకుంటాడు గౌతమ్. బయట కార్లోంచి అప్పుడే దిగుతారు దేవయాని-ధరణి. వాళ్లకి ఎదురుగా నడుచుకుంటూ వస్తారు మహేంద్ర, జగతి. వాళ్లని చూసి కుళ్లుకుంటుంది దేవయాని. మరోవైపు జగతి మాత్రం నేను రాను మహేంద్ర నువ్వెళ్లు అంటుంది. ఏంటి జగతి అన్నిటికీ రిషి అని భయపడతావ్ పర్లేదు రా అని మహేంద్ర అంటే..జగతి వద్దని చెబుతుంటుంది. దేవయాని మాత్రం కళ్లలో నిప్పులు పోసుకుంటుంది. ధరణి సంతోషంగా ఫీలవుతుంది. సరిగ్గా అప్పుడే కార్లోంచి దిగిన రిషి తల్లి, తండ్రి చేతులు పట్టుకుని నడవడం , కార్లో వెళ్లడం చూస్తాడు.

గౌతమ్-వసుధార-రిషి
గులాబీ తీసుకున్న గౌతమ్ అది తీసుకెళ్లి ఇది నీ కోసమే అని ఇస్తాడు. ఎందుకు అని అడిగితే....వసుధారా ఎందుకు అని అడిగితే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అర్థం చేసుకోవాలంటాడు. ఆ పువ్వు తీసుకున్న వసుధార నేరుగా రిషి దగ్గరకు వెళ్లి తీసుకోండి సార్ అని ఇస్తుంది. ఈ రోజు ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత గులాబీ చేతికిస్తుంది.  అది చూసి గౌతమ్ , రిషి ఇద్దరూ షాక్ అవుతారు. అమ్మ వసు నేనిచ్చిన ఫ్లవర్ నువ్వు రిషికి ఇస్తావా ఇది అన్యాయం అని గౌతమ్ అనుకుంటే..రిషి హ్యాపీగా ఫీలవుతాడు. జగతి మేడం-మహేంద్ర సార్ మినిస్టర్ గారి దగ్గరకు వెళ్లారంట నువ్వు వెళ్లవా అన్న గౌతమ్ మాటలు విని డిస్ట్రబ్ అయిన రిషి...ఇది పట్టుకోరా అని ఫ్లవర్ గౌతమ్ కి ఇచ్చేసి వెళ్లిపోతాడు. భూమి గుండ్రంగా ఉంటుందంటే ఇదే నేనిచ్చిన రోజా పువ్వు తిరిగి తిరిగి నా దగ్గరకే వచ్చిందేంటి అనుకుంటాడు. 

Also Read:  గౌతమ్ ముందే రిషికి రెడ్ రోజ్ ఇచ్చిన వసు, జగతికి మరో పరీక్ష పెట్టిన రిషి, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
జగతి-మహేంద్రని చూసి కుళ్లుకున్న దేవయానిని చూసి అత్తయ్యగారు ఇంకా షాక్ లోంచి కోలుకున్నట్టు లేరనుకుంటూ లోపలకి వెళదామా అని అడుగుతుంది. వచ్చీ రాగానే నా మూడ్ ఆఫ్ అయింది అనుకుంటూ వెళుతుంది. ఎదురుగా వచ్చిన రిషి లోపలకు రండి అని పిలుస్తాడు. ఏం చెప్పాలి రిషి అసలు రావడమే ఇష్టం లేదంటూ ఏదో మొదలుపెట్టేలోగా ఇప్పుడే వస్తానంటూ, గౌతమ్ ని పిలిచి పెద్దమ్మకి ఏం కావాలో చూసుకో అనేసి వెళ్లిపోతాడు. చూశావా రిషికి నేనంటే ఎంత ప్రేమో అని దేవయాని అంటే ఆ ప్రేమే అందరి కొంప ముంచుతోంది అనుకుంటుంది ధరణి. పెద్దమ్మా రండి అని గౌతమ్ అని పిలిస్తే నువ్వెళ్లు నేనొస్తా అని పంపించేస్తుంది. 

హర్టైన గౌతమ్
స్టేజ్ దగ్గరకు వెళ్లిన రిషి..  మినిస్టర్ గారు వచ్చేసరికి గేట్ దగ్గర కొందరు స్టూడెంట్స్ ని రెడీ చేసి పెట్టు అని పుష్పకి చెబుతాడు. మరోవైపు స్టేజ్ పై ఏర్పాట్లు చేస్తోన్న వసుధార... ఏదో తాడు అందుకునేందుకు వసుధార పైకి ఎగురుతుంటే సడెన్ గా వెళ్లి పైకెత్తుకుంటాడు. అప్పుడే అక్కడకు వచ్చిన గౌతమ్ కి ఆ సీన్ చూసి గుండె పగిలిపోతుంది.  

Published at : 26 Feb 2022 08:53 AM (IST) Tags: Raksha Gowda Mukesh Gowda గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Guppedantha Manasu February 26th Episode 384

సంబంధిత కథనాలు

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు  అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం