IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

Karthika Deepam ఫిబ్రవరి 26 ఎపిసోడ్: ఆనంద్ విషయంలో దీప ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 26 శనివారం 1286 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

‘కార్తీకదీపం’ ఫిబ్రవరి 26 శనివారం ఎపిసోడ్


తాడికొండ నుంచి అప్పారావ్ తీసుకొచ్చిన కోటేష్-శ్రీవల్లి ఫొటో చూసిన దీప... మీరు ఏ పుణ్యలోకాల్లో ఉన్నారో కానీ ఆనంద్ ని మీరు కోరుకున్నట్టే డాక్టర్ ని చేస్తాం అనుకుంటుంది. మోనిత కారు నంబర్ రాసి నీకు దండాలమ్మా, నన్ను క్షమించమ్మా అని కోటేష్ రాసిన నంబర్ మళ్లీ చూస్తుంది.ఈ కార్ నంబర్ ఎందుకు రాసిపెట్టాడు అనుకుంటుంది. ఇంతలో అత్తయ్య వాళ్లకి కాఫీ ఇవ్వాలి అనుకుంట వెళుతుంది. మరోవైపు ఆనంద్ ని ఎత్తుకున్న ఆనందరావు ఈ బాబు గురించి ఏం ఆలోచించావ్ సౌందర్య, అభం శుభం తెలియని పసివాడు ఇక్కడకు వచ్చి చేరాడు అనుకుంటుంది. అదే సమయానికి మోనిత ఎంట్రీ ఇస్తుంది. 

ఉయ్యాల, కొత్త బట్టలు తీసుకొచ్చానంటూ తన స్టైల్లో ఓవర్ యాక్షన్ చేస్తుంది. నోరుమూసుకుని వచ్చిన దారిలోనే వెళ్లిపో అని దీప అంటే... నా కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలియదు,ఈ బిడ్డనే చూసి నా బిడ్డలాగే ఉన్నాడని వచ్చానంటుంది. ఇంతలో మోనిత ఎత్తుకునేందుకు ట్రై చేస్తే దీప అడ్డుకుంటుంది. వీడు మా వాడు నువ్వు చేయి వేయకు అని హెచ్చరిస్తుంది. మర్యాదగా బయటకు వెళ్లు అని సౌందర్య హెచ్చరించడంతో...ఎవరో తెలియని వాళ్లని తెచ్చుకుని నా బిడ్డ అంటున్నారు, నేను మీకు ఇచ్చిన వారసుడిని వదిలేసి ఎవరిమీదో ఇంత ప్రేమ చూపిస్తున్నారే అని మొదలెడుతుంది. నా బిడ్డను వెతకండి, తీసుకురండి లేదంటే ఈ బిడ్డని నా కిచ్చేయండంటుంది. మోనిత అని గట్టిగా అరిచిన మోనిత ఈ బిడ్డలో నా బిడ్డను చూసుకుంటున్నా ఆ తర్వాత నువ్వు రమ్మన్నా రాను, నా కార్తీకే నాకోసం వచ్చేసా చేస్తానంటుంది.  ఇంతలో మోనిత చేయపట్టి బయటకు లాగిపడేసి తలుపేస్తుంది దీప.  బాయ్ ఆనందరావు గారు డాడీ వాళ్ల దగ్గర హ్యాపీగా ఉండండి అమ్మ త్వరలోనే మీ దగ్గరకు వస్తుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. 

Also Read: గౌతమ్ ముందే రిషికి రెడ్ రోజ్ ఇచ్చిన వసు, జగతికి మరో పరీక్ష పెట్టిన రిషి, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
అప్పుడే ఇంట్లోకి వచ్చిన శౌర్య, హిమ..బాబాయ్ మాకు బట్టలు కొనిచ్చాడని చూపిస్తారు. అమ్మ ఏది అని అడిగితే కూరగాయలు కొనేందుకు వెళ్లిందని చెబుతుంది సౌందర్య. తమ్ముడు వచ్చాక మాకు ఆనందం పెరిగిపోయిందంటారు. తమ్ముడు ఏడి అంటే...మీ అమ్మ బాబుని బయటకు తీసుకెళ్లిందని చెబుతుంది. ఇంటి ముందు మోనిత ఆంటీ కనిపించింది, కోపంగా వెళుతోంది ఏంటి, మోనిత ఆంటీ మనింటికి ఎప్పుడు వచ్చినా మూడ్ ఆఫ్ లో వెళుతుందేంటి, అసలు ఎందుకు వచ్చినట్టు అని క్వశ్చన్ చేస్తుంది. వాళ్ల నాన్న సర్జరీ చేశారు కదా అందుకే మాట్లాడేందుకు వచ్చింది, మనపై కోపం ఎందుకు ఉంటుందని హిమని అక్కడినుంచి పంపించేస్తుంది. 

కూరగాయలు కొనేందుకు వెళ్లిన దీప...నా బిడ్డను వెతకండి, తీసుకురండి లేదంటే ఈ బిడ్డని నా కిచ్చేయండి అన్న మోనిత మాటల్ని గుర్తుచేసుకుంటుంది. ఏరా ఆనంద్ నిన్ను ఎలా ఇస్తాను, నువ్వు మాలో ఒకడివి నువ్వు మా ప్రాణం కదా అనుకుంటూ వెళుతూ అక్కడ పక్కనే ఆగిఉన్న కారు నంబర్ చూస్తుంది.(కారు నంబర్ రాసి- నీకు దండాలమ్మా నన్ను క్షమించమ్మా) అని రాసిపెట్టినది గుర్తుచేసుకుని కోటేష్ కి ఈ కారుకి ఏంటి సంబంధం, ఈ నంబర్ పక్కనే నన్ను క్షణించమ్మా అని ఎందుకు రాశాడు, అసలు పేరు రాయకుండా కారు నంబర్ ఎందుకు రాశాడని డౌట్ పడుతుంది. లక్ష్మణ్ కనిపించడంతో ఈ కారు ఎవరిది అని అడిగితే మోనిత మేడంది అని సమాధానం ఇవ్వడంతో దీప షాక్ అవుతుంది. అప్పట్లో  బాబు గురించి కోటేష్ ని క్వశ్చన్స్ వేసిన విషయం గుర్తుచేసుకుంటుంది. వీడు మోనిత కొడుకా అని అప్పుడే దీపకి డౌట్ వచ్చేస్తుంది. రత్నసీత సాయంతో వీడియో ఫుటేజ్ దొరికింది అప్పటికానీ మోనిత ఇంటినుంచి వెళ్లేలేదని సౌందర్య చెప్పిన మాటలు గుర్తొచ్చి అలా నడుచుకుంటూ వెళ్లిపోతుంది. 

Also Read: కార్తీక్, పిల్లలకు నిజం తెలిసేలోగా మోనిత ఆటకి దీప చెక్ పెట్టబోతోందా, కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
రీ ఎంట్రీ ఇస్తాను గుర్తుపెట్టుకోండి, మెంటల్ గా ప్రిపేర్ అయిపోయిండి, బిడ్డతో వస్తాను, ఐ లవ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ, నా బాబుని వెతికి తెచ్చి ఇస్తే అన్నీ వదిలేస్తా అన్న మోనిత మాటలన్నీ గుర్తుచేసుకుంటుంది. మోనిత కొడుకుని కోటేష్ ఎత్తుకొచ్చాడా, మోనిత కొడుకుతో ఇప్పటి వరకూ అనుబంధం పెంచుకున్నామా, ఎంట్రా ఆనంద్ ఇది బాధపడుతుంది. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లిన దీప...రత్నసీతను కలుస్తుంది. సీసీ ఫుటేజ్ లో కోటేష్ ఉంటే ఆనంద్ మోనిత కొడుకే డౌట్ లేదనుకుంటూనే వెళ్లి రత్నసీతను నాకో సాయం చేయిపెట్టు అని అడుగుతుంది. దీప చేతిలో ఉన్న బాబుని చూసి ఎవరని అడిగితే ఆ తర్వాత చెబుతా అంటుంది. మోనిత కొడుకుని ఎత్తుకెళ్లిన సీసీ ఫుటేజ్ నా దగ్గర లేదని చెప్పినా...దీప బతిమలాడుతుంది. సీసీ ఫుటేజ్ ఎవ్వరికీ ఇవ్వొద్దని మోనిత మేడం చెప్పింది..ఇప్పుడు దీపక్క వచ్చి అడుగుతోంది ఏం చేయాలో అని మనసులోనే అనుకుంటుంది రత్నసీత. ఆ వీడియో నా దగ్గర డిలీట్ అయింది దీపక్కా అని అబద్ధం చెబుతుంది. అంతలోనే ఏమనుకుంటుందో ఏమో..దీపక్కా నా దగ్గర ఆ వీడియో ఉంది, వాళ్లంతా బందోబస్తు డ్యూటీకి వెళ్లారంటూ కోటేష్ మోనిత బాబుని ఎత్తుకెళ్లిన వీడియో చూపిస్తుంది. మోనిత మేడం ఈ వీడియోని మీకు, కార్తీక్ సార్ కి చూపించొద్దని చెప్పింది. మీపై ఉన్న ప్రేమతో ఈ వీడియో చూపించాను, ఎవ్వరికీ చెప్పొద్దంటుంది రత్నసీత.

సోమవారం ఎపిసోడ్ లో
ఈ బిడ్డ మోనిత బిడ్డ అని డాక్టర్ బాబుకి ఎలా చెప్పాలి, పిల్లలకు ఏం చెప్పాలని బాధ పడుతుంది దీప. వీడు చేసిన తప్పేంటి, వీడి ద్వారా మనకి పెద్ద సమస్య ఎదురైంది కదా అత్తయ్య అన్న దీప వైపు షాక్ అయి చూస్తుంది సౌందర్య. ఈ బాబు మోనిత కొడుకు అని మీకు తెలుసనే విషయం నాకు తెలుసు అంటుంది దీప. 

Published at : 26 Feb 2022 07:21 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala premi viswanath karthika deepam latest episode Sobha Shetty కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Vantalakka కార్తీకదీపం Karthika Deepam 25th February Episode 1285 Karthika Deepam 26th February Episode 1286

సంబంధిత కథనాలు

Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!

Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!

Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !

Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్

F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్

O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!

O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్

Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్

YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

YSRCP Rajyasabha Equation :   వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ?  రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్

Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్