Guppedantha Manasu ఫిబ్రవరి 25 ఎపిసోడ్: గౌతమ్ ముందే రిషికి రెడ్ రోజ్ ఇచ్చిన వసు, జగతికి మరో పరీక్ష పెట్టిన రిషి, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి-వసు ఇద్దరికీ ఒకరిపై మరొకరికి కొండంత ప్రేమ ఉన్నా ఆ విషయంలో ఇద్దరూ బయటపడడం లేదు. ఫిబ్రవరి 25 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
గుప్పెడంత మనసు ఫిబ్రవరి 25 శుక్రవారం ఎపిసోడ్
గౌతమ్ ని తప్పించుకుని వసుధారని తీసుకుని బైక్ పై స్టూడియోకి వెళ్లిపోతాడు రిషి. గౌతమ్ సార్ ని అలా వదిలేసి రావడం అని వసు మొదలెట్టగానే, అది పద్ధతి కాదు, మర్యాద కాదు అంటావా వాడు వద్దనే కదా బైక్ పై వచ్చింది అని రిషి కౌంటర్ ఇస్తాడు. గౌతమ్ సార్ ఉంటే జోక్స్ వేస్తారంటుంది వసుధార. అవునా...జోక్స్ బుక్స్ కొనిస్తాను ఓ బ్యాగ్ లో వేసుకుని చదువుకో అంటాడు రిషి. సీరియస్ సింహం అని మనసులో వసు అనుకున్న మాటని కనిపెట్టేసిన రిషి..సీరియస్ సింహం జోక్స్ ఎలా చెబుతాడు అనుకుంటున్నావా అని అడిగేస్తాడు. ఇందాక క్లాస్ రూమ్ లో మీరే నా ప్రాబ్లెమ్ అన్నావ్ ఎందుకు అని అడుగుతాడు. వసు ఆలోచనలో ఉండగా...ఆలోచించి చెబితే అబద్ధాలు చెబుతారట అంటాడు. ఏంటో సార్ నిద్ర అస్సలు పట్టలేదు, మీగురించే ఆలోచిస్తూ అనగానే.. నా గురించి ఆలోచించడానికి ఏముంటుంది అని రిషి...ఏముంటుంది అంటే ఏం చెబుతాం అలా అవీ-ఇవీ అన్నీ ఆలోచిస్తూ ఉండిపోయాను. కాల్ చేద్దామనుకున్నా అని వసు అంటే.. చేయలేదేంటో అని అడిగి..నేను కూడా నీకు కాల్ చేద్దాం అనుకున్నా అని చెబుతాడు. ఒకేసారి ఇద్దరం ఇలా అనుకోవడం బావుంది కదా అంటుంది వసుధార.
Also Read: కార్తీక్, పిల్లలకు నిజం తెలిసేలోగా మోనిత ఆటకి దీప చెక్ పెట్టబోతోందా, కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
అటు మహేంద్రతో కార్లో వెళుతున్న గౌతమ్...రిషికి కాల్ చేస్తాడు. వీడిని వదిలేసి వచ్చినా వదలడం లేదనుకుంటూ కట్ చేసిన రిషి..ఎవరని వసు అడిగితే వేస్ట్ కాల్ అంటాడు. వెంటనే వసు ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయొద్దని చెప్పేలోగా కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో వసుధార ..మీ ఎండీగారు అక్కడున్నారా అని అడిగితే స్పీకర్ ఆన్ చేయి అంటాడు రిషి. ఏంటిరా నన్ను వదిలేసి నా బైక్ పై వెళతారా అని అడిగితే పెట్రోల్ కొట్టిస్తానులే అంటాడు. ఇందాక నా కాల్ ఎందుకు కట్ చేశావ్ అని అడిగితే... వెంటనే వసుధార ఇందాక మీకు కాల్ వస్తే వేస్ట్ కాల్ అన్నారని అనేస్తుంది... ఇది విన్న గౌతమ్ నేను హర్ట్ రా అని ఫీలైపోతాడు. ఎందుకురా ఏడుస్తావ్, డాడ్ కి నిన్ను పికప్ చేసుకోమని చెప్పానని కాల్ కట్ చేస్తాడు రిషి. మనం ఇక్కడకు ఎందుకొచ్చినట్టు అడిగిన వసుతో..నీకో విషయం చెబుదామని తీసుకొచ్చా అంటాడు. ఏంటి అంటే..ఆలోచించుకోవడానికి టైమ్ ఇవ్వు అనగానే.. ఆలోచించుకుని చెబితే అబద్ధం అవుతుందని మీరే చెప్పారుగా అంటుంది. ఏంటో చెప్పండి అనగానే మర్చిపోయా అనేస్తాడు.
పెద్దమ్మా మీరు నన్ను దీవించండి, మీ హ్యాండ్ మంచిది...రిషి మీవల్ల ఇంత గొప్పవాడయ్యాడని పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటాడు గౌతమ్. నేను హీరో అయ్యానని చెబుతాడు గౌతమ్. ఇంతకీ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు..వసుధార అని చెబుతాడు గౌతమ్. అసలు సూచన అనే కాన్సెప్ట్ అదిరిపోయింది, జగతి మేడం బుర్రే బుర్ర..అసలు జగతి మేడం చెప్పిన కాన్సెప్ట్ రిషికి కూడా బాగా నచ్చిందన్న గౌతమ్ మాటలు విని.. ఎవరినో పొగుడుతున్నావ్ అంటూ ఎంట్రీ ఇస్తాడు మహేంద్ర. జగతి మేడం కాన్సెప్ట్ గురించి పెద్దమ్మకి చెబుతున్నా అంటాడు గౌతమ్. అలాంటివి చెప్పాలి గౌతమ్ మేం కూడా వింటాం చెప్పు అని కావాలాని రెచ్చగొడతాడు మహేంద్ర. జగతి మేడం రాసినంత బాగా నేను చెప్పేలేను కానీ పెద్దమ్మా జగతి మేడం సూపరో సూపర్ అంటూ పొగిడేస్తాడు. దేవయాని కక్కలేక మింగలేక కాసేపు అలాగి ఉండిపోయి..ఆపు గౌతమ్ అని ఫైర్ అవుతుంది. గౌతమ్ నీకొక విషయం చెబుదామని మరిచిపోయాను, ఈ షార్ట్ ఫిలింకోసం మినిస్టర్ గారిని పిలవడానికి జగతి వెళుతోందనగానే దేవయాని అవాక్కవుతుంది. మీరు వెళ్లరా అంకుల్ అని గౌతమ్ అడిగితే... నేను వెళ్లకపోవచ్చు, వెళితే రిషి-జగతి కలసి వెళ్లొచ్చు అని షాకిస్తాడు. ఇవ్వన్నీ ఇక్కడెందుకు చెబుతున్నావ్ అని దేవయాని అడగ్గా...గౌతమ్ కి తెలియదని చెబుతున్నా అనేసి..ధరణి వదినగారికి కాఫీ ఏదైనా ఇవ్వమ్మా అనేసి వెళ్లిపోతాడు. దేవయాని గుడ్లు ఉరిమి చూస్తుండిపోతుంది.
Also Read: గౌతమ్ ముందు రిషిని బుక్ చేసిన వసుధార, గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్
జగతి-మహేంద్ర కలసి రిషి వెనుక ఏదో ప్లాన్ చేస్తున్నారు. చిన్నతనంలో జరిగినవి మరిపించేసి జగతి ఈ ఇంట్లోకి శాశ్వతంగా వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది..అంటే అందుకోసం రిషిని వాడుకుంటోందా అని తిట్టుకుంటుంది. అంతలో అక్కడకు రిషి రావడంతో..రారా ఇప్పటివరకూ కాలేజీ విషయాలే మాట్లాడుకుంటున్నాం అని గౌతమ్ అంటాడు. ఇంట్లో కాలేజీ విషయాలు ఎందుకు, అయినా పెద్దమ్మ దగ్గర ఇవన్నీ చెబుతావ్ ఎందుకు, ఆవిడకి బోర్ కొట్టించకు అని ఫైర్ అవుతాడు. రిషి నువ్వు పూర్తి అంచనాలు దాటిపోతున్నావ్, నిన్ను ఎలా మార్చాలో నాకు తెలుసు అనుకుంటుంది. ఏం మాట్లాడరేంటి పెద్దమ్మ, ఒంట్లో బాలేదా అంటే బాగానే ఉన్నా అంటుంది. డాడ్ ఇంట్లోనే ఉన్నారా అంటే..అదేంటో విచిత్రం ఇంట్లోనే ఉన్నాడు అని రిప్లై ఇస్తుంది దేవయాని. గౌతమ్ ని తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోతాడు. జగతి పేరు వింటేనే భగ్గున మండిపడేవాడు...నిన్ను పాత రిషిలా త్వరలోనే మార్చేస్తాను అనుకుంటుంది.
రిషి లోపలకు రావొచ్చా అని అడుగుతుంది ధరణి. చిన మావయ్యగారిని కలిశావా అని ధరణి అడిగితే..లేదు వదినా కాసేపు ఆగి కలుద్దాం అనుకుంటున్నా అంటాడు. కాలేజీలో షార్ట్ ఫిలిం బావుందని గౌతమ్-చినమావయ్యగారు అంటున్నారు బెస్ట్ ఆఫ్ లక్ రిషి అని ధరణి అంటే..థ్యాంక్యూ చెబుతాడు. మీతో ఓ విషయం మాట్లాడాలి వదినా, సలహా కావాలి అంటాడు. ఏంటో చెప్పు అన్న ధరణితో.. నసిగి నసిగి ఓ విషయంలో ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నానంటాడు. వసుధార విషయమే అయి ఉంటుందనుకున్న ధరణి..నన్ను అడగడానికి ఇంత మొహమాట పడుతున్నావేంటి అంటుంది. ఏం లేదులే వదినా ఇంకెప్పుడైనా అడుగుతాను అనేస్తాడు. సరే నీ ఇష్టం..కానీ మనసులో బరువుని ఎక్కువ రోజులు మోయొద్దు అంటారు, ఎక్కడోచోట ఆ బరువుని దించేసుకోవాలి అనేసి వెళ్లిపోతుంది. అసలు నా మనసులో ఏముందో నాకే క్లారిటీ లేదు అనుకుంటాడు రిషి. వసుధారతో ఇలాగే ఏం మాట్లాడలేకపోయాను, అసలు నాకు ఏమైందనుకుంటాడు.
ఎపిసోడ్ ముగిసింది.
రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
వసుధార ఇది నీ కోసమే అని గులాబీ ఇస్తాడు గౌతమ్. కొంచెం దూరంలో ఉన్న రిషి అలా చూస్తూ నిల్చుంటాడు. గౌతమ్ నుంచి గులాబీ తీసుకున్న వసుధార తీసుకెళ్లి ఈ రోజు ప్రోగ్రాం సక్సెస్ కావాలంటూ రిషికి ఇస్తుంది. అది చూసి గౌతమ్ షాక్ అవుతాడు. మరోవైపు జగతిని పర్సనల్ గా కలసిన రిషి మీరు నాకో ఫేవర్ చేయాలని అడుగుతాడు. షార్ట్ ఫిలిం చూసేందుకు మినిస్టర్ గారు వస్తున్నారు మహేంద్ర భూషణ్ గారికి కాస్త దూరం పాటించండని అడుగుతాడు.