Guppedantha Manasu December 10th Update: జగతి-వసుని టార్గెట్ చేసిన కాలేజ్ స్టాఫ్, కూల్ చేస్తున్న రిషి, అవకాశాన్ని వాడుకుంటున్న దేవయాని
Guppedantha Manasu December 10th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు డిసెంబరు 10 ఎపిసోడ్ ( Guppedantha Manasu December 10th Update Today Episode 630)
జగతి-మహేంద్ర:వనభోజనాల్లో జరిగిన విషయం మొత్తం మహేంద్రకు చెబుతుంది జగతి. వసుధార ని నేను వాళ్ళ ఊరికి వెళ్లమని చెప్పాను మహేంద్ర అనడంతో వసుధార వెళితే ఎలా జగతి అంటాడు. మహేంద్ర వెళ్లి మళ్లీ తిరిగి ఈ ఇంటికి రావాలి. వాళ్ళిద్దరూ ఎప్పటికీ అధికారంగా కలిసి ఉండాలి అంటే వారిద్దరూ ఇంట్లోనే ఉండాలి అంటే మనం ఏం చేయాలో మొదట అది ఆలోచించు అంటుంది . వాళ్ళిద్దర్నీ మూడుముళ్ల బంధంతో ఒకటి చేయాలి అందుకు ఏం చేయాలో ఆలోచించు మహేంద్ర అని అంటుంది.
మరుసటి రోజు ఉదయం కాలేజీలో మీటింగ్ అరెంజ్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి పొగుడుతాడు రిషి. ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి దేశం అంతటా మంచి స్పందన లభిస్తుంటూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటారు.
ఫణీంద్ర: వసుధార నేను మొన్న మొన్న ఇద్దరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులను కలిసి వచ్చాను వాళ్ళందరి నెంబర్స్ నీకు ఇస్తాను వారికి నువ్వు ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు డీటెయిల్స్ గురించి మెయిల్ చేయాలి
వసు: సరే సార్
రిషి: అందరు మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో మంచిగా పని చేయాలి
ఆ తర్వాత కాలేజీ స్టాప్ అక్కడినుంచి వెళ్తూ జగతి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు. ఆ మాటలు వింటుంది వసుధార
వసుధార: జగతి మేడం గురించి అలా మాట్లాడటం నాకు నచ్చలేదు... మేడం చాలా జీనియస్.. యాక్సిడెంట్ అయింది అన్న విషయం తెలుసా. ఒకరు మనమధ్య లేనప్పుడు వారి గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు . మీరు మాట్లాడుకున్న మాటలు నేను పూర్తిగా వినలేదు కానీ మీరు ఏం మాట్లాడారో అంచనా వేయగలను
మేడం: మేం ఏం మాట్లాడుకున్నాడో తెలియకుండా మాకు సలహాలు ఎలా ఇస్తావు వసుధార
వసు: సలహాలు ఇవ్వడం లేదు మేడం జగతి మేడం గురించి మీరు ఆలోచించే విధానం తప్పంటున్నాను
అప్పుడు వసు గురించి కూడా తప్పుగా మాట్లాడి వెళ్లిపోతారు
Also Read: చంద్రమ్మకి డబ్బులిచ్చి పంపించేసిన కార్తీక్,దీపలో మొదలైన అనుమానం
మహేంద్ర-ఫణీంద్ర-రిషి ముగ్గురూ కూర్చుని మాట్లాడుకుంటారు. మహేంద్ర హెల్త్ గురించి రిషికి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఇంతలో ఇంటి నుంచి క్యారేజ్ రావడంతో రిషి డైనింగ్ హాల్లో పెట్టమని చెప్పి వసుధార ని అక్కడికి పంపిస్తాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి కాలేజీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు వసుధార జరిగిన విషయాలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసింది సార్ అని అనడంతో నువ్వు ఏ మూడ్ లో ఎక్కడ ఉంటావో నాకు కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది వసుధార అంటాడు రిషి.
రిషి: ఏంటి డల్ గా ఉన్నావు
వసు: ఏం లేదు సార్ అనేస్తుంది...లెక్చరర్ మేడమ్ వాళ్ళు అన్న మాటలు రిషి సార్ కి చెబితే బాధపడతాడు వద్దులే అని అనుకుంటుంది
రిషి: ఇష్టం లేకపోతే వదిలెయ్
వసు:తన క్లాసు రూమ్ లో తన జ్ఞాపకాలను రిషి షేర్ చేసుకుంటూ ఉంటుంది..
రిషి: వసు ఏదో మాట్లాడుతుందని గమనించిన రిషి...ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకోవద్దు నువ్వు కరెక్ట్ గా ఉండు చాలు
ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
Also Read: రిషిని ఆలోచనలో పడేసిన వసుధార ప్రవర్తన, వసుని ఇంటికి వెళ్లమని చెప్పిన జగతి
మరొకవైపు జగతి కోసం ఇద్దరు ఇంటికి రావడంతో దేవయాని వాళ్లకి మర్యాదలు చేస్తూ..జగతిపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుంది.
జగతి గురించి మాట్లాడుతూనే..వాళ్లు వసుధార గురించి చెడుగా మాట్లాడడంతో ఇదేదో కలిసొచ్చే టాపిక్ లా ఉందే అనుకుంటుంది దేవయాని. ధరణి వచ్చి కాఫీ ఇచ్చి వెళ్లి...వంటగదిలోంచి చాటుగా వాళ్ల మాటలు వింటుంది. వాళ్లిద్దరూ దేవాయానిని పొగుడుతూ ఉంటే దేవయాని మురిసిపోతుంటుంది. ఆ తర్వాత ధరణిని పిలిచి..వీళ్లని జగతి రూమ్ కి తీసుకెళ్లు అని చెప్పి..వెళ్లేముందు నన్ను కలవండి అంటుంది.