అన్వేషించండి

Gruhalakshmi June 9th: రాజ్యలక్ష్మి మాటకి తలొంచిన దివ్య- లాస్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన భాగ్య

నందు కేసు రీ ఓపెన్ చేయించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

బావని దూరం చేసుకోకు దీని వల్ల నీకే లాభం, నీకే మంచి జరుగుతుందని ప్రియ దివ్యని హెచ్చరిస్తుంది. అప్పుడే దీపక్ దివ్యకి ఫోన్ చేస్తాడు. పుట్టింటికి రాకూడదని కండిషన్లు పెట్టారు, సడెన్ గా ఎందుకు అమ్మకి నా మీద ద్వేషం పుట్టుకొచ్చిందని బాధపడుతుంది. ఇప్పుడు నీకు ఏమి చెప్పలేను మీ అమ్మకి నువ్వంటే ప్రాణం తన గురించి కంటే నీ గురించే ఆలోచిస్తుందని చెప్తాడు. నేను చేసిన తప్పు ఏంటో అడిగి చెప్పమని అంటుంది. మీ నాన్న కేసు రీ ఓపెన్ చేయించాము, ఆయన్ని బయటకి తీసుకొచ్చే సాక్ష్యాలు తీసుకురాబోతుందని చెప్పేసరికి సంతోషిస్తుంది. దివ్యతో మాట్లాడితే తనకే ప్రమాదమని తులసి టెన్షన్ పడుతుంది. విక్రమ్, దివ్య ఇద్దరూ ఒకరికొకరు సోరి చెప్పుకుంటారు.

Also Read: కావ్యకి మెహందీ పెట్టిన రాజ్- స్వప్నని కిడ్నాప్ చేసేందుకు రౌడీ ప్రయత్నాలు

ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది, ఏ పని జరగకుండా శని అడ్డం పడుతుంది. డానికి కారణం నువ్వు ఇంట్లో సరైన ముహూర్తానికి అడుగు పెట్టడమే. అరిష్టం పోవాలంటే నీ చేతులతో శాంతి పూజ చేయించాలని విక్రమ్ దివ్యతో చెప్తాడు. ఒకవేళ శాంతి పూజ చేయకపోతే అమ్మ ప్రాణాలకి గండం ఉందని అంటాడు. ఈ పూజ చేయడం వల్ల మీ నాన్నకి కూడా మంచి జరుగుతుందట కేసు నుంచి బయట పడతాడాని చెప్పేసరికి నాకు బాగా బిస్కెట్ వేశారనుకుని పూజ చేసేందుకు ఒప్పుకుంటుంది. దివ్య చేతుల మీదుగా పూజ మొదలవుతుంది. ఏంటి పంతులు వీడియో నా దగ్గర ఉందని తెలిసి కూడా పార్టీ మార్చారా? అని దివ్య మెల్లగా అడుగుతుంది. మాట వినకపోతే ప్రాణం తీస్తానని బెదిరించారు క్షమించమని అడుగుతాడు. పెద్ద కోడలు 101 బిందెలతో అభిషేకం చేయాలని పంతులు చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. చిన్న పిల్ల అన్ని బిందెలు తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు వేరే మార్గం చెప్పమని రాజ్యలక్ష్మి నటిస్తుంది.

ఆ అభిషేకం తను చేస్తానని విక్రమ్ అంటే వద్దని సైగ చేస్తుంది. అలా కుదరదు ఆవిడ చేత్తో చేస్తేనే మంచిదని పంతులు చిలకపలుకులు పలుకుతాడు. అభిషేకం పూర్తయ్యే సరికి కళ్ళు తిరిగి పడుతుందని సంబరపడుతుంది. నాన్న జైలు నుంచి విడుదల కావడం కోసం పూజ చేస్తున్నానని దివ్య అమ్మవారికి మొక్కుకుంటుంది. ఎంత ట్రై చేసినా శేఖర్ జాడ తెలియడం లేదని తులసి కంగారుపడుతుంది. అప్పుడే శేఖర్ తులసికి ఫోన్ చేసి సాక్ష్యం చెప్పడానికి వస్తున్నానని భయపడొద్దని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దివ్య నీళ్ళు మోస్తూ కళ్ళు తిరిగి పడబోతుంటే ప్రియ సాయం చేస్తుంది. దివ్య అమ్మ కోసం ఇంత చేస్తుంటే ఎందుకు తనని బాధపెట్టేలా మాట్లాడానని విక్రమ్ మనసులో బాధపడతాడు. కోర్టులో సీన్ స్టార్ట్ అవుతుంది. తులసి నిన్ను విడిపించడానికి కాదు మరింత కేసులో ఇరికించడానికి ట్రై చేస్తుందని లాస్య హెచ్చరిస్తుంది. నన్ను నమ్ముకో నిన్ను చిటికెలో జైలు నుంచి బయట పడేస్తానని అంటుంది.

Also Read: వేదని ఆదిత్యకి దూరంగా ఉండమన్న మాలిని- కొడుకు మనసులో విషాన్ని నింపుతున్న మాళవిక

నందు బయటకి వెళ్లాడమంటూ జరిగితే నా వేలు పట్టుకుని రావాలని లాస్య బెదిరిస్తుంది. సవతులు ఇద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు. నందు లాస్య మీద ఆవేశంగా అరుస్తాడు. నీతో జీవితం పంచుకునేదే లేదు అవసరం అయితే నీ గొంతు పిసికి చంపేస్తానని ఆవేశపడుతుంటే తులసి ఆపుతుంది. సాక్ష్యం చెప్పడానికి శేఖర్ రాడని తెలిసి కూడా తులసి ఎందుకు ఇంత ధైర్యంగా ఉందని లాస్య మనసులో టెన్షన్ పడుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget