News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Brahmamudi June9th: కావ్యకి మెహందీ పెట్టిన రాజ్- స్వప్నని కిడ్నాప్ చేసేందుకు రౌడీ ప్రయత్నాలు

స్వప్న, రాహుల్ పెళ్లి ఫిక్స్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

రాహుల్ ఒక రౌడీ దగ్గరకి వస్తాడు. వాడికి స్వప్న ఫోటో చూపించగానే జున్ను ముక్కలాగా భలే ఉందని సొల్లు కారుస్తాడు. అది నాకు కాబోయే పెళ్ళాం నా దగ్గర నుంచి ఎత్తుకొచ్చి నువ్వే పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. ఎవరైనా డబ్బు దానం చేస్తారు కానీ మీరు ఈ దేవకన్యని కూడా దానం చేస్తున్నారని అంటాడు. దాన్ని కిడ్నాప్ చేస్తే రూ.10 లక్షలు ఇస్తానని బేరం కుదుర్చుకుంటాడు. వీడు ఏంటి మరి ఎక్కువ ఊహించుకుంటున్నాడు. నాకు దాని దరిద్రం వదిలిపోతే బాగుండని మనసులో అనుకుంటాడు. రేపే నా పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి, నువ్వు ఇంటికి వచ్చేలా నేను చేస్తాను వచ్చి కిడ్నాప్ చేయమని చెప్తాడు. కావ్య అందరి ముందు నన్ను ఇరికించావు కదా ఇప్పుడు ఈ పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తానని అనుకుంటాడు.

Also Read: వేదని ఆదిత్యకి దూరంగా ఉండమన్న మాలిని- కొడుకు మనసులో విషాన్ని నింపుతున్న మాళవిక

రాజ్ కింద నేల మీద పడుకునేసరికి మెడ పట్టేస్తుంది. ఇప్పుడు రాహుల్ పెళ్లికి పనులు ఎలా చేయాలని అనుకుంటూ ఉండగా కావ్య వస్తుంది. పెళ్లికి కావాల్సిన లిస్ట్ రాసి అమ్మమ్మగారు మీకు ఇవ్వమన్నారని చీటీ ఇవ్వబోతుంటే మెడ పట్టేసి అటు తిరిగి ఉంటాడు. కాసేపు ఆడుకుంటుంది. కావ్య గట్టిగా అరిచేసరికి ఏమైందని ధాన్యలక్ష్మి పరుగున వస్తుంది. మా ఆయనకి మెడ పట్టేసిందని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్తుంది. మళ్ళీ కాసేపటికి కళ్యాణ్ వస్తాడు. తనకి మెడ పట్టేసిందని హరి కథ చెప్పినట్టు చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి రాజ్ కి కోపం వస్తుంది. బెడ్ మీద కూర్చోబెట్టి రాజ్ కి మెడ సరి చేస్తుంది. అన్నయ్య మీద ప్రతీకార చర్య ఏమైనా చేపట్టావా అని కళ్యాణ్ కావాలని రాజ్ కావ్య పట్ల చేసిన పనులన్నీ చెప్తాడు. రేయ్ నువ్వు తమ్ముడివా లేదంటే శత్రువువా నా తల కళావతి చేతిలో ఉందని మర్చిపోయావా అంటాడు. కావ్య ఒక్కసారిగా మెడ తిప్పేసి సరిచేస్తుంది. పెళ్లికి కావాల్సిన పనులన్నీ హడావుడిగా చేస్తూ ఉంటారు.

Also Read: శేఖర్ కిడ్నాప్, క్లైమాక్స్ కి చేరిన లాస్య కథ- దివ్య మీద రాజ్యలక్ష్మి ఫైనల్ ఎటాక్

పెళ్లి ఏర్పాట్లు జరగడం చూసి రుద్రాణి రగిలిపోతుంది. ఈ పెళ్లి ఎలా ఆపాలో ఆలోచించు. నీ పెళ్లి ఎలా జరగాలని ఆశ పడ్డాను కానీ ఇలా అడుక్కుతినే వాళ్ళతో జరుగుతుందని అసలు ఊహించలేదని అంటుంది. ఈ పెళ్లి జరగదని తల్లితో అంటాడు. ఇలా చూసుకుంటానని చెప్పి స్వప్నని తగులుకున్నావని తిడుతుంది. ఏదో ఒకటి చేసి పెళ్లి జరగకుండా చూడమని చెప్తుంది. అటు రుద్రాణి వెళ్లిపోగానే కావ్య వస్తుంది. ఈసారి పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నావా? అలాంటివి ట్రై చేయకు. అసలు నీకు మా అక్కని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు కానీ తప్పడం లేదు. ప్రతి సారి రాజ్ నిన్ను క్షమిస్తాడాని అనుకోకని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అసలు మీ అక్క పెళ్లి పీటలు ఎక్కితేనే కదా పెళ్లి జరగడానికని అనుకుంటాడు. కనకం ఇంట్లో అందరూ పెళ్లికి వెళ్లేందుకు రెడీ అవుతారు. మీనాక్షి వచ్చి పెళ్లికి వెళ్ళడానికి కారు తీసుకొచ్చానని అంటుంది.

Published at : 09 Jun 2023 09:13 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial June9th Episode

ఇవి కూడా చూడండి

Nayanthara: వామ్మో లేడీ సూపర్ స్టార్, 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ అంత తీసుకుంటుందా?

Nayanthara: వామ్మో లేడీ సూపర్ స్టార్, 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ అంత తీసుకుంటుందా?

Ram Charan: ఇండస్ట్రీలో రామ్ చరణ్‌కు 16 ఏళ్లు పూర్తి - స్పెషల్‌గా విష్ చేసిన ఉపాసన

Ram Charan: ఇండస్ట్రీలో రామ్ చరణ్‌కు 16 ఏళ్లు పూర్తి - స్పెషల్‌గా విష్ చేసిన ఉపాసన

వీరాభిమాని మృతి - ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన సూర్య

వీరాభిమాని మృతి - ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన సూర్య

Kiran Abbavaram: సొంతింటి కలను నెరవేర్చుకున్న కిరణ్ అబ్బవరం - కొత్త ఇంట్లో సందడి చూశారా?

Kiran Abbavaram: సొంతింటి కలను నెరవేర్చుకున్న కిరణ్ అబ్బవరం - కొత్త ఇంట్లో సందడి చూశారా?

'ఆర్.ఆర్.ఆర్, 'పుష్ప' సినిమాల్లో ఏముందని చూడటానికి? బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా షాకింగ్ కామెంట్స్

'ఆర్.ఆర్.ఆర్, 'పుష్ప' సినిమాల్లో ఏముందని చూడటానికి? బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా షాకింగ్ కామెంట్స్

టాప్ స్టోరీస్

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్

Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్