Ennenno Janmalabandham June 9th: వేదని ఆదిత్యకి దూరంగా ఉండమన్న మాలిని- కొడుకు మనసులో విషాన్ని నింపుతున్న మాళవిక
మాళవికని వేద తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఖుషి అన్నం తినకుండా ఆమ్లెట్ కావాలని గొడవ చేస్తుంది. వేద తీసుకొచ్చి ఖుషికి ఇవ్వకుండా ఆదిత్యకి ఇస్తుంది. నాకు ఇష్టం లేనిది నేను తిననని కోపంగా చెప్తాడు. వీడకి ఆమ్లెట్ తినడం ఇష్టం లేదా వేద ఇవ్వడం నచ్చడం లేదా ఏంటని మాలిని మనసులో అనుకుంటుంది. తానే మనవడికి తినిపిస్తుంది. వేద అంటే ఆదిత్యకి నచ్చడం లేదు ఈ విషయం తనకి అర్థం అయ్యేలా చెప్పాలని డిసైడ్ అవుతుంది. నా మనవడు రాక రాక నా ఇంటికి వచ్చాడు. వాడు ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని మాలిని టెన్షన్ పడుతుంది. నువ్వు వాళ్ళని బాగా చూసుకుంటున్నావ్. కానీ ఆదిత్య నిన్ను సవతి తల్లిలాగానే చూస్తున్నాడు. నువ్వు దగ్గరకి రాగానే ఇబ్బంది పడుతున్నాడు. వాడు ఇక్కడే ఉండాలంటే తన ఇష్టప్రకారం నడుచుకోవాలని మాలిని చెప్తుంది. అంటే ఆదిత్యకి దూరంగా ఉండాలి అంతే కదా ఉంటానని వేద కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
Also Read: శేఖర్ కిడ్నాప్, క్లైమాక్స్ కి చేరిన లాస్య కథ- దివ్య మీద రాజ్యలక్ష్మి ఫైనల్ ఎటాక్
ఆదిత్య నిద్రపోతూ మాళవిక మాటలు గుర్తు చేసుకుంటాడు. అందరూ మనల్ని అసహ్యించుకుంటున్నారు. ఎప్పుడు వెళ్లిపోతామా అని ఎదురు చూస్తున్నారని అంటుంది. వేద ఆంటీ కూడా బాగానే చూసుకుంటున్నారు కదా మనల్ని ఇంట్లోనే ఉండమని చెప్తున్నారు కదా అని ఆదిత్య చెప్తాడు. అదంతా అబద్ధం మనల్ని వాళ్ళ కుటుంబంలో భాగం అనుకుంటున్నారు అది నువ్వు అర్థం చేసుకో. వాళ్ళంతా ఒకటి మనం ఒకటి మనల్ని కలవనివ్వరు. వేద ప్రేమ నటన. తను మన మీద ప్రేమ ఉన్నట్టు నటించి మనకి దక్కాల్సిన ప్రేమ దక్కకుండ చేస్తుంది. ఖుషి నా కూతురే కదా కానీ అమ్మ అని నాదగ్గరకి వచ్చిందా? ఈ ఇంట్లో మనకి దక్కాల్సినది ఏది దక్కనివ్వడం లేదు. ఆ బాధ తట్టుకోలేక తాగుతున్నానని ఆదిత్య మైండ్ పాడు చేస్తుంది. డాక్యుమెంట్స్ చింపేసి దాన్ని అతికించమని నీలాంబరి ఖైలాష్ కి ఇస్తుంది. తను దగ్గరకి వచ్చి నేను చెప్పింది ఏం చేశావాని అంటే అతికించానని చెప్పి తీసి తనకి ఇస్తాడు. నువ్వు సూపర్ బ్రదర్ అని అది చూసి ఖైలాష్ ని మెచ్చుకుంటుంది. బాబోయ్ ఇంకేం చెప్పి ప్రాణాలు తీస్తుందో ఏంటోనని కంగారుపడతాడు.
Also Read: రాహుల్ ప్లాన్ తిప్పికొట్టి కావ్య తన అక్క పెళ్లి జరిపిస్తుందా?
యష్ కోసం వేద ఎదురుచూస్తూ ఉండగా తాగేసి ఇంటికి వస్తాడు. తాగొచ్చినందుకు వేద యష్ కి క్లాస్ పీకుతుంది. నేను కొంచెం తాగానని యష్ అబద్ధం చెప్తాడు. సరే అయితే అని ఒక గీత గీసి దాని మీద స్ట్రైట్ గా నడవమని చెప్తుంది. యష్ దాని మీద తప్ప మిగతా అంతటా కాలు వేసి వయ్యారంగా నడుస్తాడు.తర్వాత బుక్ ఇచ్చి చదవమంటుంది. అది చదవడం కోసం కళ్ళ జోడు పెట్టుకునే సరికి బుక్ కాకుండా వేరేది చూస్తాడు.