అన్వేషించండి

Brahmamudi June 8th: రాహుల్ ప్లాన్ తిప్పికొట్టి కావ్య తన అక్క పెళ్లి జరిపిస్తుందా?

స్వప్న, రాహుల్ పెళ్లి ఫిక్స్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కనకం వాళ్ళని రుద్రాణి అవమానించబోతుంటే కావ్య గట్టిగానే బదులిస్తుంది. రుద్రాణి నువ్వు మహా ఇల్లాలివి నుదుటిన బొట్టు ఉంటుంది కానీ మెడలో తాళి ఉండదు. మీ ఆయన ఎక్కడ ఉన్నాడని మేము అడిగామా? నీ కొడుకులాంటి కొడుకు నాకు ఉంటే నడిరోడ్డు మీద నిలబెట్టి కాళ్ళు చేతులు విరగ్గొట్టి అమ్మేసే వాడినని మీనాక్షి తిడుతుంది. ఇలాంటి అలాగాజనంతో నేను వియ్యం అందుకోవాలా? నెవర్ లగ్నాలు పెట్టుకునేదే లేదు వెళ్లిపోండి ఇక్కడి నుంచి కోర్టుకి ఎక్కండి అక్కడ చూసుకుంటాను. రాహుల్ మంచి లాయర్ తో మాట్లాడు వీళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టి లోపల వేయిస్తానని రుద్రాణి సీరియస్ అవుతుంది.

రాజ్: అత్తా ఎవరు ఎవరి మీద చీటింగ్ కేసు పెడతారు. ఈ కళావతికి ముసుగు వేసి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి జరిపించినందుకు మొదట నేను నీమీద పెట్టాలి చీటింగ్ కేసు. పీటల మీద పెళ్లి కూతుర్ని లేవదీసుకుని వెళ్లినందుకు నేను నీ కొడుకు మీద పెట్టాలి చీటింగ్ కేసు. ఈ ఇంట్లో ఎవరు నోరు విప్పినా నీ మర్యాద పోతుంది. రేయ్ నువ్వు ఎక్కడికి లేచావ్ చేసిందంతా చేసి కూర్చో. ఎవరు కాదన్నా అవునన్నా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో ఉన్న ఒకతను ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని మోసం చేశాడని రుజువు అయ్యింది కాబట్టి పెళ్లి జరిగి తీరుతుంది.

Also Read: యష్, వేద సంతోషం చూసి రగిలిపోతున్న మాళవిక- కూతురి జీవితం గురించి భయపడుతున్న సులోచన

సీతారామయ్య: ఈ పెళ్లి జరిగి తీరుతుంది.

ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉందని పంతులు చెప్తాడు. తమకి కష్టమని కనకం అంటుంది. కానీ మీనాక్షి మాత్రం పెళ్లికి కావాల్సినవన్నీ తను తీసుకొస్తామని చెప్తుంది. మా ఇంట్లో మా మనవడిగా పెరిగిన రాహుల్ పెళ్లి మా ఖర్చులతో జరిపిస్తామని ఇంద్రాదేవి అంటుంది. తమకు చేతనైనంత వరకు జరిపిస్తామని కృష్ణమూర్తి చెప్తాడు. కానీ ఒక షరతు పెళ్లి సింపుల్ గా ఈ ఇంట్లోనే జరగాలి. లేదంటే మీడియా వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు. వీళ్ళు పెళ్ళికి ముందే తొందర పడినట్టు బయట పడుతుందని అపర్ణ చెప్తుంది. కావ్య కూడా నా పెళ్ళిలో జరిగినట్టే ఈ పెళ్ళిలో కూడా గొడవలు జరుగుతాయని అంటుంది. స్వప్న మాత్రం కావ్యని అపార్థం చేసుకుని మనసులో తిట్టుకుంటుంది.

స్వప్న నాకు ఆస్తి రాదని తెలిసినా కూడా పెళ్లికి సిద్ధమయింది. కానీ ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని రాహుల్ అనుకుంటాడు. కళ్యాణ్ కి ధాన్యలక్ష్మి ఫోన్ చేసి రాహుల్ కి పెళ్లి ముహూర్తం పెట్టారని ఎల్లుండేనని చెప్పేసరికి సంతోషపడతాడు. వెంటనే అప్పుని ఎత్తుకుని గాల్లో గీరగిరా తిప్పేసి వదిన అనుకున్నది సాధించేసిందని సంబరపడతాడు. స్వప్న పెళ్లి చేయడం కోసం ఇల్లు తాకట్టు పెడదామని కాగితాలు తీసుకురమ్మని కృష్ణమూర్తి చెప్తాడు. కానీ కనకం ఇప్పటికే తాకట్టు పెట్టిన విషయం గుర్తుకు వచ్చి భయపడుతుంది. ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెడితే ఉండటానికి నిలువ నీడ కూడా ఉండకుండ పోతుందని కవర్ చేసేందుకు ట్రై చేస్తుంది.

Also Read: కేడీ గ్యాంగ్ మీద కంప్లైంట్ ఇస్తానన్న వసు- తండ్రిని తలుచుకుని బాధపడుతున్న రిషి

కావ్య కాలికి పట్టీలు పెట్టుకుని కావాలని గోల గోల చేస్తూ నడుస్తుంది. రాజ్ ఒప్పుకోకపోయినా కూడా కావ్య బెడ్ మీదే పడుకుంటానని అంటుంది. కానీ రాజ్ మాత్రం ఈ బెడ్ నాదని గొడవ చేస్తాడు. అయినా కావ్య ఏ మాత్రం తగ్గకుండా పడుకుంటుంది. పడుకోమని అంటే నీ పక్కన నేను పడుకునే ప్రసక్తే లేదని వెళ్ళి నేల మీద చాప వేసుకుని పడుకుంటాడు. అది చూసి కావ్య బాధగా తను కూడా కింద పడుకుంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Embed widget