Guppedanta Manasu June 6th: కేడీ గ్యాంగ్ మీద కంప్లైంట్ ఇస్తానన్న వసు- తండ్రిని తలుచుకుని బాధపడుతున్న రిషి
Guppedantha Manasu June 6th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీ...ఎండీ సీటుకోసం రిషిని కుట్ర చుట్టూ గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
రిషి దూరం కావాలని వాడి నుదుటి మీద రాత రాసిందే జగతి అలాంటిది తను బాధపడటంలో అర్థం లేదని మహేంద్ర అంటాడు. రిషిని చిన్నప్పటి నుంచి పెంచిన నేను వాడు ఇప్పుడు నా పక్కన లేకపోతే తట్టుకోలేక పోతున్నా ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉన్నానా అనిపిస్తుందని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. రిషి నా కడుపున పుట్టడమే శాపం, తను నన్ను ఇంటికి తీసుకురావడమే శాపమని జగతి బాధగా అంటుంది. ధరణి నాకొక సాయం చెయ్యి ఇంకెప్పుడు ఎవరి తరఫున వకల్తా తీసుకురావద్దని చెప్పేసి వెళ్ళిపోతాడు. చిన్నత్తయ్య మీరు రాకముందు ఆ తండ్రీ కొడుకులు అలాగే ఉన్నారు. కలలో కూడా వాళ్ళు దూరంగా ఉంటారని ఎవరూ ఊహించలేదు. రిషి ఎంత బాధపడుతున్నారో ఎవరికి తెలియదు నా అన్న వాళ్ళు కూడా పక్కన ఎవరూ ఉండరని ధరణి బాధపడుతుంది. అన్నింటికీ తానే కారణమని జగతి కుమిలిపోతుంది.
Also Read: వేడి వేడి నీళ్ళతో అభిమన్యుకి నీలాంబరి పాదపూజ- మాళవిక కోసం సులోచనని తిట్టిన వేద
ధరణి-జగతి: తప్పు చేసింది మీరు కాదు. ఎవరో మీకు తెలుసు నాకు తెలుసు. మిమ్మల్ని కట్టి పడేసిన బంధాలని వదిలించుకుంటేనే అందులో నుంచి బయటకు రండి. మీరు ఇప్పుడు మౌనంగా ఉండటం మంచిది కాదు చిన్నత్తయ్య. ఇప్పుడు నన్ను అందరూ దోషిలా చూస్తున్నారు నేను ఏది చెప్పినా ఎవరూ నమ్మరు. ఇప్పుడు రిషి ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి. వాళ్ళని తీసుకొస్తేనే సమస్యకి పరిష్కారం దొరకుతుంది. నేను అదే ప్రయత్నంలోనే ఉన్నాను కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆచూకీ దొరకడం లేదు. వెతకాలి వాళ్ళని ఇంటికి తీసుకొస్తేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ప్లీజ్ చిన్నత్తయ్య రిషి, వసుధార ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి.
వసుకి ఇన్విజీలేషన్ పడుతుంది. పక్కనే ఉన్న మరొక లెక్చరర్ జాగ్రత్త కేడీ గ్యాంగ్ ఉన్న రూమ్ కి వెళ్తున్నారు జాగ్రత్త వాళ్ళు ఎగ్జామ్ రాయరు అడిగితే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటారని చెప్తుంది. కేడీ గ్యాంగ్ లో ఒకడు ఎగ్జామ్ రాయకుండా ఉంటాడు. ఎందుకు రాయడం లేదని వసు అడిగితే సోది చెప్తాడు. కావాలని అందరూ వసుకి వంకర సమాధానాలు చెప్తారు. ఎగ్జామ్ తర్వాత వసు ప్రిన్సిపాల్ దగ్గరకి వచ్చి పరీక్ష సరిగా రాయలేదని అడిగితే వెటకారంగా ఆన్సర్ ఇస్తున్నారని కంప్లైంట్ ఇవ్వమని అంటుంది. మీరు కొత్తగా చేరారు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. అసలు వాళ్ళని మీరు పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకొమ్మని సలహా ఇస్తాడు. ఈ విషయం మాత్రం ఊరుకే వదిలిపెట్టనని కేడీ బ్యాచ్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఛైర్మన్ కి కంప్లైంట్ ఇస్తానని వసు అంటుంది. కానీ ప్రిన్సిపాల్ మాత్రం ఏమి చేయలేనని చేతులెత్తేస్తాడు. సరే ఛైర్మన్ ని కలిసి కంప్లైంట్ ఇస్తాను వాళ్ళని సస్పెండ్ చేయిస్తానని చెప్పేస్తుంది. ఆ మాటలన్నీ విన్న బాయ్ వచ్చి వసు కంప్లైంట్ ఇస్తానన్న విషయం చెప్తాడు.
Also Read: మళ్ళీ రాహుల్ మాయ మాటలు నమ్మేసిన స్వప్న- అపర్ణని అత్తా అంటూ ఢీ కొడుతున్న కావ్య
పాండ్యన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాడు. రిషి వెళ్లిపోవడానికి రీజన్ ఏంటో చెప్పొచ్చు కదా అని మహేంద్ర ఆలోచిస్తాడు. అందరూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటారు. రిషి జరిగింది తలుచుకుంటాడు. నా అనుకునే మనుషులు నాకు చేసే ద్రోహం మర్చిపోలేకపోతున్నారు. నింద మోయలేకపోతున్నానని బాధపడతాడు. నేను మీకు చెప్పాలని అనుకున్నాను కానీ అప్పుడు మీమీద పూల కుండీ పడబోయింది అందుకే చెప్పకుండా ఆగిపోయాను మేడమ్ చేసింది కరెక్ట్ కాదని తెలిసి కూడా తప్పు చేశామని వసు అనుకుంటుంది. మన మధ్య దాపరికాలు ఉండకూడదని చెప్పాను కానీ నువ్వు ఏదేదో ఆలోచించి నన్ను బతికుండగానే చంపేశారు కదా మేడమ్ అని బాధపడతాడు. వాళ్ళు చేసిన తప్పుకి మిమ్మల్ని బాధపెడుతున్నా నన్ను క్షమించు డాడ్. మీకోసం రావాలని అనిపిస్తుంది కానీ రాలేకపోతున్నా జీవితంలో మిమ్మల్ని చూడలేనని కుమిలిపోతాడు.