(Source: ECI/ABP News/ABP Majha)
Brahmamudi June 6th: మళ్ళీ రాహుల్ మాయ మాటలు నమ్మేసిన స్వప్న- అపర్ణని అత్తా అంటూ ఢీ కొడుతున్న కావ్య
స్వప్న, రాహుల్ పెళ్లి ఫిక్స్ అవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రాజ్ బాత్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత పనిమనిషి వచ్చి కావ్యకి మోటార్ చెడిపోయిందని వెళ్లొద్దని చెప్తుంది. కానీ కావ్య చెప్పే లోపే రాజ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక చిక్కింది ఛాన్స్ అనుకుని ఆట ఆడుకుంటుంది. సరే రాత్రి నన్ను తిట్టినందుకు సోరి చెప్పమని అంటుంది. రాజ్ సోరి చెప్పగానే అక్కడే బకెట్ లో పెట్టిన నీళ్ళు తీసుకొచ్చి ఏడిపిస్తుంది. నీ పేరు కళావతి కాదు కొరివి దెయ్యం అని పెట్టాలి కాల్చుకు తింటున్నావ్ కదా అని తిట్టుకుంటాడు. కనకం బాధగా ఉంటే అన్నపూర్ణ వచ్చి పలకరిస్తుంది. రాహుల్ స్వప్న కోసం ఇంటికి వస్తాడు. ఎందుకు వచ్చావాని అప్పు నిలదీస్తుంది. ఈ బియ్యపు పిండి మొహం వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్ని మాటలు అన్నాడో తెలిస్తే మీరు ఇంతకంటే దారుణంగా మాట్లాడతారని అంటుంది. జరిగింది అంతా మర్చిపోండి మిమ్మల్ని క్షమాపణ అడుగుదామని వచ్చానని చెప్తాడు. సరే అడుగు క్షమాపణ అంటుంది. దీంతో అతి కష్టంగా సోరి చెప్తాడు.
Also Read: తనకి అర్జెంట్ గా మనవడిని కనివ్వాలని కోడలికి కండిషన్ పెట్టిన రేవతి- బిత్తరపోయిన ముకుంద
రాహుల్ స్వప్న గదికి వెళ్ళి డ్రామా స్టార్ట్ చేస్తాడు. కావ్య కిచెన్ లో వంట చేస్తూ ఉండగా ధాన్యలక్ష్మి వచ్చి పూజ చేయమని అంటుంది. నీకు ఆ హక్కు ఉందని చెప్పి తీసుకుని వెళ్తుంది. పూజ గదికి కావ్య రావడం చూసి ఎవరిని ఎక్కడికి తీసుకొచ్చావని అపర్ణ అడుగుతుంది. ఇంటి కోడలు పూజ చేయడం ఆనవాయితీ కదా అంటుంది. రాహుల్ తప్పు చేశాడని రుజువు చేసిన తర్వాత కూడా కావ్యని దోషిగా చూడటం కరెక్ట్ కాదు కదా అని లాజిక్ మాట్లాడుతుంది. దీంతో అపర్ణ పక్కకి తప్పుకోవడంతో కావ్య పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. రాహుల్ పెళ్లి ముహూర్తం పెట్టించాలి కావ్య అమ్మానాన్నని కూడా రమ్మని సీతారామయ్య శుభాష్ కి చెప్తాడు. ఒక అనార్థానికి రుద్రాణి కారణం అయితే మరొక దానికి తన కొడుకు కారణమయ్యాడని అపర్ణ తిడుతుంది.
అందరూ వెళ్ళిపోయిన తర్వాత అపర్ణ కావ్యని మాటలు అంటుంది. ఇప్పటివరకు నేను అతిథిలానే ఉన్నాను మీ అబ్బాయి నాకు ఒక పరీక్ష పెట్టారు అందులో పాస్ అయ్యాను ఆ విషయం మీరు జీర్ణం చేసుకోవాలి. నేను మిమ్మల్ని అత్తయ్య అని కూడా పిలుస్తున్నా ఇక అలాగే పిలుస్తాను అందుకు అర్హత ఏముంటుంది, ఇకపై ఈ ఇంటి కష్టసుఖాల్లో పాలు పంచుకునే అర్హత నాకు ఉందని గట్టిగానే సమాధానం ఇస్తుంది. ఎప్పటికీ నిన్ను కోడలిగా ఒప్పుకోనని అపర్ణ అంటుంది. రాహుల్ స్వప్న దగ్గరకి వచ్చి సోరి చెప్తాడు. సోరి చెప్తే అన్నీ పోతాయా అంటుంది. అందుకే నాకు నేను శిక్ష వేసుకున్నా మన పెళ్లి కాగానే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యానని చెప్తాడు. ఇదేంటి రాహుల్ ఇలా మాట్లాడుతున్నాడని అనుకుంటుంది. నా వల్ల నువ్వు ఇబ్బందులు పడటం ఇష్టం లేదు నాకోసం నువ్వు కష్టాలు పడటం చూడలేనని అంటుంది. నీ చెల్లి కావ్య రాజ్ ని రెచ్చగొట్టింది నిజంగా స్వప్న కావాలంటే ఆస్తి వదిలి వెళ్లిపోతాడా అని ఛాలెంజ్ చేసింది. నా బిడ్డని నువ్వు మోస్తున్నావ్ అందుకే ఆస్తి వదిలేసి నీకోసం బయటకి వచ్చేస్తానని మాయమాటలు చెప్తాడు.
Also Read: మూడేళ్ళ తర్వాత రిషి రీ ఎంట్రీ- ఎన్ని చెప్పినా జగతిని క్షమించలేనన్న మహేంద్ర
మా కోసం మీరు విడిపోవడానికి వీల్లేదని పిచ్చిదానిలా రాహుల్ మాటలు నమ్మేస్తుంది. నువ్వు ఆలోచించినట్టు మీ చెల్లి ఆలోచించడం లేదు ఈ విషయం చెప్పి వెళ్దామనే వచ్చానని వెళ్ళిపోతాడు. అలా జరగనివ్వను కావ్య కంటే నేనే బెటర్ అని నిరూపించుకుని అందరినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని స్వప్న అనుకుంటుంది.