News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Krishna Mukunda Murari June 5th: తనకి అర్జెంట్ గా మనవడిని కనివ్వాలని కోడలికి కండిషన్ పెట్టిన రేవతి- బిత్తరపోయిన ముకుంద

మురారీ, కృష్ణ గురించి ముకుంద రేవతికి అసలు విషయం చెప్పేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

రేవతి ముకుంద మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి  మనసు మార్చకపోతే రాను రాను ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. ప్రేమ ఉన్మాదంగా మారుతుంది. అక్క ఆశ్రమం నుంచి తిరిగి వచ్చే లోపు ముకుంద సమస్యకి ఒక పరిష్కారం చూడాలి. అసలు విషయం తెలియని అక్క ముకుంద ఇక్కడే ఉండాలని శాసిస్తే ఏమి చేయాలని రేవతి భయపడుతుంది. మురారీ, కృష్ణ కారులో వెళ్తూ ఉంటారు. మురారీ కోపంగా ఉండేసరికి అసలు ఏంటి మీరు మీ సంగతి ఏంటని కృష్ణ అరుస్తుంది. తను కోపంగా చూసేసరికి భయపడుతుంది. ఎన్నడూ లేనిది ఏంటి ఇలా అరుస్తున్నారని అడుగుతుంది.

ముకుంద ఒక పుస్తకంలో ఐలవ్యూ మురారీ అని రాస్తూ ఉండగా రేవతి వస్తుంది. తనని చూసి ముకుంద కంగారుగా బుక్ మూసేసి దాచి పెడుతుంది. ఏంటది అంటే నా పాత జ్ఞాపకమని చెప్తుంది. రేవతి అందులో ఈ ఇంటి పరువు కూడా ఉండవచ్చని రేవతి కోపంగా ఆ బుక్ లాక్కుని చూస్తుంది. అందులో ఐలవ్యూ మురారీ అని ఉండటం చూసి షాక్ అవుతుంది.

Also Read: మూడేళ్ళ తర్వాత రిషి రీ ఎంట్రీ- ఎన్ని చెప్పినా జగతిని క్షమించలేనన్న మహేంద్ర

రేవతి: ఆ పేజీలన్నీ చింపేస్తుంది. ఈ గదిలో వాడి తాలూకు గుర్తులు కనిపిస్తే కాల్చి బూడిద చేస్తాను

ముకుంద: నా మనసులో మురారీ ఉన్నాడు దాన్ని కాల్చి బూడిద చేయగలరా?

రేవతి: నోర్ముయ్ తప్పుడు మాటలు మాట్లాడకు పవిత్రతకి పీఠం వేసే ఇల్లు. ఇక్కడ నీతినియమాలు వదిలేసి బతకకూడదు నువ్వు హద్దులు దాటి ప్రవరిస్తున్నావ్

ముకుంద: నాలో నేను ప్రేమిస్తే తప్పా అత్తయ్య

రేవతి: తప్పే మురారీకి పెళ్ళయింది నీకు పెళ్లి అయిపోయింది పొరపాటున కూడా నీ మనసు చెదిరిపోకూడదు. వాళ్ళు చిలకా గోరింకలా కాపురం చేసుకుంటున్నారు. నా కోడలు అమాయకురాలు దాని కాపురంలో చిచ్చు రేపకు

ముకుంద: వాళ్ళ గురించి మీకు తెలియదు వింటే మీరు తట్టుకోలేరు

రేవతి: వాళ్ళ గురించి నాకు తెలియనిది నీకు మాత్రమే తెలిసింది ఏంటో చెప్పు

ముకుంద: వాళ్ళు చేసుకుంది పెళ్లి కాదు. అది అగ్రిమెంట్ మ్యారేజ్ సంవత్సరం పూర్తి కాగానే అంటే ఇంకొద్ది రోజుల్లో కృష్ణ వెళ్ళిపోతుంది

రేవతి: నా కొడుకు కోడలు కొద్ది రోజుల్లో విడిపోతారా?

ముకుంద: అవును ఇద్దరూ ఆ ఒప్పందానికి వచ్చి ఇక్కడికి వచ్చారు. నిజానికి వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడటం లేదు కలిసి కాపురం చేయడం లేదు బయటకి వచ్చినప్పుడు మాత్రమే భార్యాభర్తలుగా నటిస్తున్నారు

Also Read: రుద్రాణి మీద చీటింగ్ కేసు పెడతానన్న రాజ్- భర్తని ప్రేమలో పడేసేందుకు కావ్య ప్రయత్నాలు

రేవతి: నేను నమ్మను అదంతా నటన.. ప్రేమ కాదా? ఇష్టం కాదా? అది కాపురం కాదా? వాళ్ళది అసలు పెళ్ళే కాదా?నిజం చెప్పు నీకు ఎలా తెలుసు

ముకుంద: మురారీ చెప్పాడు అనేసరికి బాధగా వెళ్ళిపోతుంది.

కృష్ణ ఒక అనాథ ఆశ్రమానికి వస్తుంది. అక్కడ పిల్లలందరూ కృష్ణతో బాగా మాట్లాడతారు. మురారీని చూసి వెళ్ళి పలకరిస్తారు. మీకు వీళ్ళు ఎలా తెలుసని కృష్ణ అంటే అదేంటి మీకు తెలియదా ఇది అన్నయ్యదే కదా అంటారు. నా కొడుకు కృష్ణకి ఇంత ద్రోహం చేస్తాడా? ఈ విషయంలో నేను తల్లిగా స్పందించాలా? అత్తగా స్పందించాలా? ఎలాగైన వాళ్ళిద్దరినీ కలపాలని రేవతి అనుకుంటుంది.

Published at : 05 Jun 2023 10:25 AM (IST) Tags: Krishna Mukunda Murari Serial Krishna Mukunda Murari Serial Today Episode Krishna Mukunda Murari Serial Written Update Krishna Mukunda Murari Serial June 5th Episode

ఇవి కూడా చూడండి

Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!

Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

టాప్ స్టోరీస్

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

సిక్కుల కళ్లలో ఆనందం కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?

సిక్కుల కళ్లలో ఆనందం కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ