IND vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఇదే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే
Team India vs New Zealand | భారత్ న్యూజిలాండ్ ODI సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై జట్టు ఆశలు పెట్టుకుంది. వీరు ఈ ఫార్మాట్లో కంటిన్యూగా రాణించాలని బీసీసీఐ సైతం భావిస్తోంది.

Ind vs NZ 1st ODI | 2026 క్రికెట్ సీజన్ ప్రారంభం అయింది. న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ నేడు ప్రారంభమైంది. జనవరి 11, ఆదివారం నాడు వడోదరలోని కొత్తగా నిర్మించిన కోటంబి స్టేడియం (BCA స్టేడియం)లో జరగనున్న తొలి వన్డేలో టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. 16 సంవత్సరాల తర్వాత పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది.
భారత ప్లేయింగ్ లెవన్.. రిషబ్ పంత్ ఔట్..
శుభ్‌మన్ గిల్ కెప్టెన్, రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
1st ODI 🇮🇳XI: S. Gill (c), R. Sharma, V. Kohli, S. Iyer (vc), KL. Rahul (wk), R. Jadeja, W. Sundar, H. Rana, K. Yadav, M. Siraj, P. Krishna.https://t.co/pX6HYz772x #TeamIndia #INDvNZ #1stODI @IDFCFIRSTBank
— BCCI (@BCCI) January 11, 2026
న్యూజిలాండ్ జట్టు..
1st ODI 🇳🇿.XI: D. Conway, H. Nicholls, W. Young, D. Mitchell, G. Phillips, M. Hay (wk), M. Bracewell (c), Z Foulkes, K. Clarke, K. Jamieson, A. Ashok.https://t.co/pX6HYz772x #TeamIndia #INDvNZ #1stODI @IDFCFIRSTBank
— BCCI (@BCCI) January 11, 2026
ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణించారు. రోహిత్ విషయానికి వస్తే గతంలో జరిగిన ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో సైతం రాణించి ఫాం కొనసాగిస్తున్నాడు. మరోవైపు వన్డేల్లో విరాట్ మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడిన కోహ్లీ, రోహిత్ శతకాలతో అదరగొట్టారు. దాంతో వారు మంచి టచ్‌లో ఉన్నారని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఈ సిరీస్ కీలకంగా మారింది.
కాగా, వడోదరలో చదునైన పిచ్, భారీగా మంచు కురిసే అవకాశం ఉంది. కనుక నేడు హై స్కోరింగ్ థ్రిల్లర్ సాధ్యమని అంచనా వేస్తున్నారు. 2026 క్యాలెండర్ ఇయర్‌లో భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో విజయంతో బోణీ కొట్టాలని శుబ్‌మన్ గిల్ సేన భావిస్తోంది.
ప్రత్యక్ష ప్రసార వివరాలు
ఈ మ్యాచ్ టెలివిజన్, డిజిటల్ స్ట్రీమింగ్‌లో అనేక ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షించవచ్చు. IND vs NZ 1వ ODI మ్యాచ్ మధ్యాహ్నం 1:30 PM ISTకి ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ తీసుకుంది.
టెలివిజన్ ప్రసారం (భారతదేశం): ఈ సిరీస్‌కు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక ప్రసార హక్కులను కలిగి ఉంది. అభిమానులు వివిధ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లను చూడవచ్చు.
లైవ్ స్ట్రీమింగ్ (భారతదేశం): మొబైల్ లేదా కంప్యూటర్‌లలో ఈ మ్యాచ్ JioHotstar యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
అంతర్జాతీయ వీక్షకులు
న్యూజిలాండ్: అభిమానులు స్కై స్పోర్ట్ NZలో ఈ మ్యాచ్ చూడవచ్చు.
USA: స్లింగ్ టీవీ ద్వారా విల్లో టీవీ ప్రత్యక్ష కవరేజీని అందిస్తుంది.
UK: ఈ సిరీస్‌ను TNT స్పోర్ట్స్‌లో ప్రసారం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా: కయో స్పోర్ట్స్ మరియు ఫాక్స్ స్పోర్ట్స్ ప్రధాన ప్రసారకర్తలు.





















