అన్వేషించండి

Gruhalakshmi July 12th Update: తులసి జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నాడా? తులసి బోనం ఎత్తకుండా లాస్య స్కెచ్

తులసిని బోనం ఎత్తకుండా చేయాలని లాస్య, భాగ్య కుట్రలు పన్నుతారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

బోనాల జాతర దగ్గర తులసి కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. అక్కడికి లాస్య, నందు కూడా వస్తారు. బోనం ఎత్తడం నీకు రాదు, అది భక్తితో చేయాల్సిన పని అంటాడు. దాంతో లాస్య నేను మాత్రం ఆ తులసి మీద పగతో చేస్తున్న అని అంటుంది. తులసి బోనం సమర్పించకుండా చేయాలని లాస్య, భాగ్య ప్లాన్ వేస్తారు. ఇక తులసి వాళ్ళంతా కలిసి సంబరంగా బోనం సిద్ధం చేస్తారు. లాస్య వచ్చి వాళ్ళ  పక్కనే కూర్చుంటుంది. అది చూసి పార్టీలు, పబ్బులు అని తిరిగే వాళ్ళు ఎత్తేది సీసాలె కానీ బోనాలు కాదని లాస్యని అనసూయ దెప్పిపొడుస్తుంటే తులసి ఆపేందుకు ప్రయత్నిస్తుంది. బోనం కోసం మట్టి కుండలు తెమ్మని తులసి ప్రేమ్ కి చెబుతుంటే దివ్య నేను వెళ్తాను అని అంటుంది. కుండలు జాగ్రత్తగా తీసుకుని రా అవి పగిలిపోతే బోనం ఆగిపోతుందని పరంధామయ్య అంటాడు. ఆ మాటలు విన్న లాస్య భాగ్యకి ఏదో పని చెయ్యమని పురమాయిస్తుంది.

Also Read: తనవారితో కలసిపోయిన శౌర్య- పూర్తిగా మోనితలా మారిపోయిన శోభ - కార్తీకదీపం కథ ఇక సుఖాంతమేనా !

ఇక దివ్య కుండలు తీసుకోస్తూ అక్కడ కొంతమంది డాన్స్ చేస్తుంటే వాళ్ళ దగ్గరకి వెళ్ళి ఎగురుతుంది. భాగ్య కూడా అక్కడికి వచ్చి కావాలని దివ్యని తోసేయడంతో చేతిలోని కుండలు కింద పడి పగిలిపోతాయి. అది చూసి లాస్య, భాగ్య నవ్వుకుంటారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అందుకే అమ్మవారికి కోపం వచ్చిందని అక్కడ ఉన్న ఒక మహిళ అంటుంది. అసలు ఆమె బోనం ఎత్తాలని అనుకోవడమే పొరపాటు అందుకే అమ్మవారు శిక్షించిందని లాస్య అంటుంది. దీంతో తులసి వాళ్ళంతా బోనం ఆగిపోయినట్టేనా అని టెన్షన్ పడతారు. అప్పుడే మాధవి కుండలు తెచ్చి ఇచ్చి బోనం సిద్ధం చెయ్యమని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నోటి దాకా వచ్చిన పాయశంలో ఈగ లాగా వచ్చి వాలింది ఆ మాధవి నా ప్లాన్ అంతా కర్పూరంలా హారతి అయిపోయిందని భాగ్య అంటుంది. ఇక లాస్య భాగ్యకి కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి అవి తులసికి ఇచ్చేలా చేయమంటుంది. తులసి బోనం ఎత్తేప్పుడు మజ్జిగ ఇస్తారు అందులో ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలపాలని భాగ్యకి చెప్తుంది. 

Also Read: ఆదిత్య దగ్గర నుంచి రానని మాధవకి చెప్పిన దేవి, టెన్షన్ లో రాధ- ఎప్పటికీ దేవికి నేనే నాన్న అంటున్న మాధవ

బోనం తీసుకెళ్తూ తులసి కళ్ళు తిరిగి పడిపోయినట్లు లాస్య ఊహించుకుని తెగ సంబరపడిపోతుంది. అది చూసి భాగ్య వచ్చి లాస్యని నిద్రలేపుతుంది. నువ్వు ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఇంక నా చేతిలోనే ఉన్నాయి అవి కలపడానికి ఇంకా టైం ఉందని అంటుంది. ఇంత టెన్షన్ లో నీకు ఎలా నిద్రపట్టిందని భాగ్య వెటకారంగా అంటుంది. గుప్పెడంత మనసు భామలు వసు, సాక్షి బోనం సమర్పించి రిషి నాకు దక్కాలంటే నాకు దక్కాలని అమ్మవారిని కోరుకుంటారు. ఇక భాగ్య అనుకునట్టుగానే పోతురాజు అందించే మజ్జిగలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసేస్తుంది. ఇక బోనం ఎత్తే విషయంలో లాస్య, అనసూయకి మధ్య మాటల యుద్దం జరుగుతుంది. బోనం కోడలితో ఎత్తిస్తానని మొక్కుకున్నారా లేదా తులసి ఆంటీ ని మనసులో అనుకుని మొక్కుకున్నారా అని వసు అడుగుతుంది. నేను తులసిని కోడలిగా అనుకుని మొక్కుకున్నానని చెప్తుంది. దీంతో వసు ఇక బోనం ఎత్తేది తులసి ఆంటీనే అని  చెప్తుంది. అందుకు లాస్య భాగ్యాలు  మాత్రం ఒప్పుకోరు. ఇక పోతురాజు వచ్చి బోనం ఎత్తే తులసికి మజ్జిగ ఇవ్వడంతో అవి తాగుతుంది. 

తరువాయి భాగంలో.. 

కళ్ళు తిరుగుతున్నా కానీ తులసి అమ్మవారికి బోనం సమర్పిస్తుంది. అది చూసి లాస్య కుళ్ళుకుంటుంది. ఇక తులసి జీవితం మారిపోతుందని కొత్త రంగులు, కొత్త సంతోషాలు, కొత్త మనిషి రాబోతున్నాడని జోగిని చెప్తుంది. అది విన్న నందు మొహం మాడిపోతుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Embed widget